ఆర్చ్ బిషప్ ఎమిరిటస్ డెస్మండ్ టుటు మరణంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో -
"ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటు ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజానీకానికి మార్గదర్శకులుగా నిలిచారు. మానవాళిపై గౌరవం.. సమానత్వాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం చిరస్మరణీయం. ఆయన మృతిపై నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన అభిమానులందరికీ నా హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Archbishop Emeritus Desmond Tutu was a guiding light for countless people globally. His emphasis on human dignity and equality will be forever remembered. I am deeply saddened by his demise, and extend my heartfelt condolences to all his admirers. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) December 26, 2021


