దుర్గా మాత పవిత్ర ఆశీర్వాదాన్ని గుర్తుచేస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మవారి అనుగ్రహం యావత్ భక్తజనానికి శాంతి, సంతోషం, నూతనోత్తేజం సమకూరుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే మాతను స్తుతిస్తూ శ్రీమతి రాజలక్ష్మి సంజయ్ ఆలంపించిన భక్తిగీతాన్ని ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“నవరాత్రి సందర్భంగా దుర్గా మాత ఆశీస్సులు భక్త జనావళిలో శాంతి, ఆనందం, సరికొత్త ఉత్తేజం నింపుతాయి. ఆ పరాశక్తిని ఆరాధనలో భాగంగా రాజలక్ష్మి సంజయ్ గారు ఆలపించిన ఈ భక్తిగీతం విని మీరు కూడా పరవశించండి...” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
नवरात्रि पर देवी मां का आशीर्वाद भक्तों में सुख-शांति और नई ऊर्जा का संचार करता है। सुनिए, शक्ति की आराधना को समर्पित राजलक्ष्मी संजय जी की यह स्तुति...https://t.co/FA1l4l9k6o
— Narendra Modi (@narendramodi) March 31, 2025


