చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022 ‘మిక్స్‌డ్ 50మీటర్ల రైఫిల్-ఎస్‌హెచ్1’లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు రుద్రాంశ్ ఖండేల్వాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్ ‘మిక్స్‌డ్ 50మీటర్ల రైఫిల్-ఎస్‌హెచ్1’లో అసమాన ప్రతిభతో రజతం సాధించిన రుద్రాంశ్ ఖండేల్వాల్‌కు నా హృదయపూర్వక ప్రశంసలు. ఈ సందర్భంగా అతడు చూపిన అంకిత భావం, నైపుణ్యం ఎంతో అభినందనీయం. ఈ విజయం ద్వారా ఔత్సాహిక క్రీడాకారులకు అతడొక ప్రమాణాన్ని నిర్దేశించాడు. అతడు సాధించిన ఘనత దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Heartiest congratulations to @1903rudransh on the incredible Silver Medal in the Mixed 50m Rifle SH1 event. His dedication and prowess are truly commendable, setting a benchmark for aspiring athletes. India beams with pride at his achievement. pic.twitter.com/XH50A5mISL
— Narendra Modi (@narendramodi) October 23, 2023


