ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో “కృత్రిమ మేధను సురక్షితంగా, వేగంగా, సమర్థంగా అమలు చేయడం” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన అవు‌ట్ రీచ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

మావన నాగరితక దిశను పునర్నిర్వచించగల సామర్థ్యం ఉన్న పరివర్తనాత్మక శక్తి కృత్రిమ మేధ అని ప్రధానమంత్రి అన్నారు. అయితే, అది ప్రజలకు సాధికారత కల్పించేలా కూడా ఉండాలని స్పష్టం చేశారు. ఈ విస్తృతమైన ఆలోచనతో.. ఈమధ్యే ఏఐ ఇంపాక్ట్ సదస్సును భారత్ నిర్వహించిందని వివరించారు. ఏఐ కోసం భారత్ అనుసరిస్తున్న మానవ కేంద్రక లేదా మానవ్ దార్శనికత గురించి తెలియజేశారు. సమ్మిళిత్వం, భద్రత, ప్రజాక్షేమం అనే సూత్రాలపై ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆధారపడి ఉండాలన్నారు.

సైబర్ స్పేస్‌ను ప్రపంచ మానవాళికి ప్రయోజనం చేకూర్చేదిగానే భారత్ పరిగణిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. కీలకమైన సమాచార మౌలిక వసతులను భద్రపరిచే, సైబర్ ముప్పును ఎదుర్కోవడంలో సాయపడే ఏఐ నమూనాలు ప్రజాస్వామ్య దేశాలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ఏఐ అభివృద్ధిలో భద్రతనూ, వేగాన్నీ, సామర్థ్యాన్నీ కలిపి అందించే సమగ్ర విధానానికి ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఆయన నాలుగు సూచనలిచ్చారు. అవి- రూపకల్పన స్థాయిలోనే ఏఐ వ్యవస్థలు సురక్షితంగా ఉండాలి. ఉమ్మడి ప్రమాణాలు, ప్రయోగ విధానాలు, ఉమ్మడి మార్గదర్శకాలకు అనుగుణంగా ఏఐ అమలు ఉండాలి. డీప్‌ఫేక్‌లు, అసత్య సమాచారం, సైబర్ నేరాలను నియంత్రించడంలో సమర్థవంతమైన ప్రపంచ సహకారం ఉండాలి. సమ్మిళిత ప్రపంచాన్ని సాధించేలా గ్లోబల్ సౌత్ దేశాలకు సైతం ఏఐ ప్రయోజనాలు చేరాలి.

మానవ సామర్థ్యాన్ని పెంపొందించేదిగా, మానవ ఎంపికకు సాధికారత కల్పించేదిగా, మానవ గౌరవాన్ని పరిరక్షించేదిగా ఏఐ ఉండాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ లక్ష్యాలను ప్రోత్సహించడానికి భాగస్వాములతో కలసి భారత్ పనిచేస్తుందని తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony

Media Coverage

Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi calls upon people to celebrate National Handloom Day by showcasing India's rich handloom heritage
August 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, has called upon citizens to celebrate National Handloom Day on 7th August by promoting India's rich and diverse handloom traditions.

“Share your videos with your favourite handloom products, including GRWM videos on social media”, Shri Modi said.

Shri Modi posted on X;

Tomorrow, 7th August is National Handloom Day. Let’s make India’s handloom diversity popular.

Share your videos with your favourite handloom products, including GRWM videos on social media.

Don’t forget to use #NationalHandloomDay.