ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియన్నా లో ప్రవాసీ భారతీయులు ఆయన గౌరవార్థం  ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొని, భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.  కార్యక్రమ స్థలానికి ప్రధాన మంత్రి రాగానే, భారతీయ సముదాయం ఆయనకు ఎంతో ఉత్సాహం తోను, ఆప్యాయంగాను స్వాగతం పలికింది.  ఆస్ట్రియా కార్మిక, ఆర్థిక వ్యవస్థ శాఖ మంత్రి శ్రీ మార్టిన్ కొచెర్ కూడా ఈ సాముదాయిక సభ లో పాలుపంచుకొన్నారు.  ఆస్ట్రియా నలుమూలలా విస్తరించివున్న ప్రవాసీ భారతీయులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.

 

 ప్రధాన మంత్రి తన ప్రసంగంలో భారతదేశాని కి, ఆస్ట్రియా కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడం కోసం ప్రవాసీ భారతీయులు అందిస్తున్న తోడ్పాటును గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.  భారతదేశం, ఆస్ట్రియా.. ఈ రెండు మిత్ర దేశాలు వాటి మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భాన్ని వేడుకగా జరుపుకొంటూ ఉన్న కాలంలో ఆస్ట్రియా కు తాను విచ్చేయడం ఈ సందర్భాన్ని నిజానికి విశిష్టమైందిగా మార్చిందని ఆయన అన్నారు.  రెండు దేశాల ఉమ్మడి ప్రజాస్వామిక విలువలను, బహుళవాద నాగరికతను ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొంటూ, ఇటీవల భారతదేశంలో జరిగిన ఎన్నికల విస్తృతిని గురించి, పరిమాణాన్ని గురించి, సాఫల్యాన్ని గురించి మాట్లాడారు.  ఆ ఎన్నికలలో భారతదేశ ప్రజలు నిరంతరతకోసం ఓటు వేశారని, దీనితో తనకు మూడో పదవీకాలం కోసం చరిత్రాత్మకమైన ప్రజాతీర్పు దక్కిందని ప్రధాన మంత్రి అన్నారు.

 

గత పది సంవత్సరాలలో దేశం సాధించిన పరివర్తన పూర్వకమైన ప్రగతిని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు.  భారతదేశం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశం ‘‘వికసిత్ భారత్’’ గా అయ్యే క్రమంలో, సమీప భవిష్యత్తులో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందనే విశ్వాసాన్ని కూడా ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.  హరిత ప్రధానమైనటువంటి అభివృద్ధి, నూతన ఆవిష్కరణల రంగాలలో ఆస్ట్రియా కు ఉన్న నైపుణ్యం భారతదేశానికి ఏ విధంగా భాగస్వామి కాగలదో అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అదే జరిగితే దీని అధిక వృద్ధి సంబంధ అనుభవం, ప్రపంచ స్థాయి లో ప్రఖ్యాతిని గాంచిన స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ తాలూకు ప్రపయోజనాన్ని కూడా పొందవచ్చని ఆయన అన్నారు.  భారతదేశం ‘‘విశ్వబంధు’’గా ఉంటూ, ప్రపంచ పురోగమనానికి, శ్రేయానికి తోడ్పాటును అందించడాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు.  ప్రవాసి భారతీయ సముదాయం వారి నూతన మాతృభూమిలో వర్ధిల్లుతూనే, వారి మాతృదేశంతో సాంస్కృతిక బంధాలను, భావావేశభరిత బంధాలను పెంచి పోషించుకొంటూ ఉండవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా, ఆయన వందల సంవత్సరాలుగా భారతదేశ తత్వశాస్త్రమన్నా, భాషలన్నా, భావ ధార అన్నా ఆస్ట్రియా లో ప్రగాఢమైన మేధో సంబంధ కుతూహలం వ్యక్తమవుతోందన్నారు.

 

ఆస్ట్రియా లో దాదాపుగా 31,000 ల మంది ప్రవాసీ భారతీయులు ఉంటున్నారు.  వారిలో ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ తదితర రంగాలలోను, బహుపక్షీయ ఐరాస సంస్థలలోను పని చేస్తున్న వృత్తి నిపుణులు కూడా కలసి ఉన్నారు. ఆస్ట్రియా లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సుమారు 500  మంది భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. 

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi pens heartfelt letter to BJP's new Thiruvananthapuram mayor; says

Media Coverage

PM Modi pens heartfelt letter to BJP's new Thiruvananthapuram mayor; says "UDF-LDF fixed match will end soon"
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2026
January 02, 2026

PM Modi’s Leadership Anchors India’s Development Journey