షేర్ చేయండి
 
Comments
Steps are being taken to double farmers' income by 2022: PM
Our efforts are on modernizing the agriculture sector by incorporating latest technology: PM Modi
Govt is focussing on promoting agricultural technology-based startups: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లో జ‌రుగుతున్న మూడో గ్లోబ‌ల్ పొటాటో కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ఈ రోజు న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు.  ఇదివ‌ర‌క‌టి రెండు గ్లోబ‌ల్ పొటాటో కాన్ఫ‌రెన్సుల ను 1999వ సంవ‌త్స‌రం లో మ‌రియు 2008వ సంవ‌త్స‌రం లో నిర్వ‌హించ‌డ‌మైంది.  ఈ స‌మావేశాలను న్యూ ఢిల్లీ లోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిస‌ర్చ్,   షిమ్ లా లోని ఐసిఎఆర్‌-సెంట్ర‌ల్ పొటాటో రిస‌ర్చ్ ఇన్స్ టిట్యూట్ మ‌రియు పెరూ లోని లిమా లో గ‌ల ఇంట‌ర్‌ నేశ‌న‌ల్‌ పొటాటో సెంటర్ (సిఐపి) ల స‌హ‌కారం తో ఇండియ‌న్ పొటాటో అసోసియేశన్ (ఐపిఎ) నిర్వ‌హిస్తున్న‌ది. 

ఆహారం మరియు పోషన విజ్ఞానాని కి సంబంధించిన ముఖ్యమైన అంశాల ను గురించి రానున్న కొద్ది రోజుల పాటు చ‌ర్చించ‌డం కోసం గ్లోబ‌ల్ పొటాటో కాన్‌క్లేవ్ కు ప్ర‌పంచం అంతటి నుండి బంగాళాదుంపలను పండించే రైతులు, శాస్త్రవేత్త‌ లు మ‌రియు ఇత‌ర సంబంధిత వ‌ర్గాల వారు ఇక్కడ సమావేశమయ్యారు.

ప్ర‌ధాన మంత్రి ఈ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ,  బంగాళాదుంప‌ల పంట పై స‌మావేశం, అగ్రి ఎక్స్‌ పో మ‌రియు పొటాటో ఫీల్డ్ డే.. ఈ మూడూ ఏకకాలం లో జ‌ర‌గ‌డం మూడో కాన్‌క్లేవ్ విశిష్ట‌త అన్నారు.  ఫీల్డ్ డే నాడు 6,000 మంది రైతు లు క్షేత్ర సంద‌ర్శ‌న కు వెళ్ళ‌డం ఒక కొనియాడదగ్గ ప్ర‌య‌త్నం అని కూడా ఆయ‌న అన్నారు.

 

బంగాళాదుంప‌ల ఉత్ప‌త్తి లో మ‌రియు దిగుబ‌డి లో దేశం లో పేరు తెచ్చుకొన్న గుజ‌రాత్ లో మూడో గ్లోబ‌ల్ పొటాటో కాన్‌క్లేవ్ జ‌రుగుతూ ఉండ‌టం ముఖ్యమైన ప‌రిణామం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  బంగాళాదుంప‌ పంట సాగు అవుతున్నటువంటి విస్తీర్ణం గ‌డ‌చిన 11 సంవ‌త్స‌రాల లో దాదాపు గా 20 శాతం హెచ్చింద‌ని, అదే కాలం లో గుజ‌రాత్ లో ఈ పంట విస్తీర్ణం సుమారు గా 170 శాతం మేర‌కు పెరిగింద‌ని ఆయ‌న తెలిపారు.

 

దీనికి ప్ర‌ధాన కార‌ణం విధానప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు మ‌రియు నిర్ణ‌యాలేన‌ని, అవి రాష్ట్రం జల్లు సేద్యం, ఇంకా బిందు సేద్యం ల వంటి ఆధునిక ప‌ద్ధ‌తుల ను అనుస‌రించ‌డానికి, అలాగే ఉత్త‌మమైన శీత‌లీక‌ర‌ణ స‌దుపాయాల‌తో పాటు ఫూడ్ ప్రోసెసింగ్ ఇండ‌స్ట్రీకి లింకేజీలకు తోడ్పడ్డాయని ఆయ‌న వివ‌రించారు.  ప్ర‌స్తుతం బంగాళాదుంప‌ల ప్రోసెసింగ్ లో ప్రధాన కంపెనీలు అనేకం గుజరాత్ లో నెల‌కొన్నాయ‌ని, ఈ పంట‌ను ఎగుమ‌తి చేసే సంస్థ‌ల లో ఎక్కువ సంస్థ‌లు సైతం గుజ‌రాత్ లో ఉన్నాయ‌ని,  ఇవ‌న్నీ మొత్తంమీద దేశం లో బంగాళా దుంప‌లకు ప్ర‌ధాన కేంద్రం గా ఈ రాష్ట్రం ఆవిర్భ‌వించేందుకు దోహ‌ద‌ప‌డ్డాయ‌ని ఆయన అన్నారు.

 

రైతుల ఆదాయాన్ని 2022వ సంవ‌త్స‌రం కల్లా రెట్టింపు చేయాల‌న్న ల‌క్ష్యం దిశ గా త‌న ప్ర‌భుత్వం పలు చ‌ర్య‌ల ను  తీసుకొంటోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  త‌త్ఫ‌లితం గా తృణ ధాన్యాలు, ఇత‌ర ఆహార ప‌దార్థాల ఉత్ప‌త్తి లో ప్ర‌పంచం లో అగ్ర‌గామి మూడు దేశాల స‌ర‌స‌న భార‌త‌దేశం నిల‌చింద‌న్నారు. ఫూడ్ ప్రోసెసింగ్ ఇండ‌స్ట్రీస్ ను ప్రతి స్థాయి లో ప్రోత్సహించాలనే దృష్టి తో తన ప్రభుత్వం ఈ రంగం లో 100 శాతం ఎఫ్‌డిఐ ని అనుమ‌తించ‌డం, విలువ జోడింపు లో మద్దతు ను అందించ‌డం, పిఎం కిసాన్ సంప‌ద యోజ‌న ద్వారా వేల్యూ చైన్ ను అభివృద్ధిపరచడం.. వంటి చర్యలను తీసుకొందని కూడా ఆయ‌న వివరించారు.

ఈ నెల మొదట్లో 6 కోట్ల మంది రైతు ల బ్యాంకు ఖాతాల లోకి 12,000 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని ప్ర‌త్య‌క్ష బ‌దిలీ ద్వారా మార్పిడి చేసి ఒక క్రొత్త రికార్డు ను స్థాపించిన‌ సంగతి ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  రైతు కు మరియు వినియోగదారు కు మధ్య దళారుల, ఇతర దశల ప్రమేయాన్ని త‌గ్గించ‌డం త‌న ప్ర‌భుత్వం యొక్క ప్రాథమ్యం గా ఉంద‌ని ఆయ‌న చెప్పారు.  వ్య‌వ‌సాయ ప్ర‌ధాన‌ సాంకేతిక విజ్ఞాన ఆధారిత స్టార్ట్-అప్ ల‌ను ప్రోత్స‌హించ‌డం పైన కూడా తన ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటోందని, దీని ద్వారా స్మార్ట్ అగ్రికల్చర్ మరియు ప్రెసిజన్ అగ్రికల్చర్ కు అవసరమయ్యే ధాన్యం కుప్పల ను మరియు రైతుల డేటా బేస్ లను వినియోగించుకొనే వీలు ఉంటుందని ఆయ‌న అన్నారు.

ఆధునిక బ‌యోటెక్నాల‌జీ, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్‌, బ్లాక్ చైన్‌, డ్రోన్ టెక్నాల‌జీ ల ద్వారా వ్య‌వ‌సాయం లోని వివిధ స‌మ‌స్య‌ల కు ప‌రిష్కార మార్గాల ను అంద‌జేయ‌వ‌ల‌సింది గా శాస్త్రవేత్త‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  ఏ ఒక్క‌రూ ఆక‌లి తో మిగిలిపోవ‌డం గాని లేదా పోష‌కాహార లోపం బారిన పడటం గాని జ‌రుగ‌కుండా చూడ‌టం విధాన రూప‌క‌ర్త‌ల పైన మ‌రియు శాస్త్రవేత్త‌ల స‌ముదాయంపైన ఉన్న గురుత‌ర బాధ్య‌త అని ఆయ‌న అన్నారు.

 

పూర్వ‌రంగం:

 

ఈ మూడో గ్లోబల్ పొటాటా కాన్‌క్లేవ్ సంబంధిత వ‌ర్గాలు అన్నిటి ని ఒక ఉమ్మ‌డి వేదిక మీద‌ కు తీసుకువ‌చ్చేందుకు ఒక అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది.  త‌ద్వారా బంగాళాదుంప‌ల రంగం తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రి కి ప్ర‌మేయాన్ని క‌ల్పిస్తూ, అన్ని అంశాల ను చ‌ర్చించి భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల కు రూప‌క‌ల్ప‌న చేసేందుకు వీలు ఏర్పడుతుంది.  దేశం లో వివిధ వ‌ర్గాల కు బంగాళాదుంప‌ల ప‌రిశోధ‌న రంగం లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల ను గురించి వివ‌రించే ఒక విశిష్ట‌మైన కార్య‌క్ర‌మమిది. 

 

ఈ బృహ‌త్ కార్య‌క్ర‌మం లో.. (1) ద పొటాటో కాన్ఫరెన్స్, (2)  ద అగ్రి ఎక్స్‌పో మ‌రియు (3) ద పొటాటో ఫీల్డ్ డే.. అనే మూడు ముఖ్య భాగాలు ఉంటాయి.

 

పొటాటో కాన్ఫ‌రెన్స్ ను 2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 28వ తేదీ నుండి 30వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల‌ పాటు నిర్వ‌హిస్తారు.  దీని లో ప‌ది ఇతివృత్తాలు ఉంటాయి.  మ‌ళ్ళీ ఆ ఇతివృత్తాల లో ఎనిమిది ఇతివృత్తాలు మౌలిక ప‌రిశోధ‌న మ‌రియు అప్ల‌య్ డ్ రిస‌ర్చ్ లు ఆధారం గా ఉంటాయి.  మిగ‌తా రెండు ఇతివృత్తాలు బంగాళాదుంప‌ల వ్యాపారం, వేల్యూ చైన్ మేనేజ్‌మెంట్ మ‌రియు విధాన‌ప‌ర‌మైన అంశాల ప‌ట్ల ప్ర‌త్యేక ప్రాముఖ్యాన్ని క‌లిగివుంటాయి. 

 

 అగ్రి ఎక్స్‌పో ను 2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 28వ తేదీ నుండి జ‌న‌వ‌రి 30వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.  దీని లో భాగం గా బంగాళాదుంప‌ల ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల స్థాయి మ‌రియు వ్యాపారం, ప్రోసెసింగ్‌, విత్త‌న బంగాళాదుంప‌ల ఉత్ప‌త్తి, బ‌యోటెక్నాల‌జీ, ప్ర‌భుత్వ‌-ప్రైవేటు భాగ‌స్వామ్యం ల‌తో పాటు, రైతుల‌ కు సంబంధించిన ఉత్ప‌త్తులు వ‌గైరా అంశాల ను ప్రదర్శించనున్నారు.

2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 31వ తేదీన పొటాటో ఫీల్డ్ డే ను జ‌రుపుతారు.  దీని లో భాగం గా.. బంగాళాదుంప‌ల ర‌కాలు, బంగాళాదుంప‌ల రంగం లో యాంత్రీక‌ర‌ణ తాలూకు పురోగ‌తి, ఇంకా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు.. వీటి ప్ర‌ద‌ర్శ‌న చోటు చేసుకొంటుంది.

 

ప్ర‌ధానం గా చ‌ర్చ‌కు వ‌చ్చే అంశాల లో నాట్ల‌ కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి, స‌ర‌ఫ‌రా శృంఖ‌లాల యొక్క కొర‌త, పంట‌కోత‌ ల అనంత‌రం వాటిల్లే న‌ష్టాలు, ప్రోసెసింగ్ ను పెంపొందించ‌డానికి తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల తో పాటు ఎగుమతులు మరియు వివిధ రీతుల ఉపయోగం, ఇంకా అవసరమైన విధాన‌ సంబంధి సహాయం- అంటే ప్రమాణీకరణ పొందిన విత్తనాల ఉత్పత్తి మరియు వినియోగం, బహు దూర ప్రాంతాలకు రవాణా కు మరియు ఎగుమతులను ప్రోత్సాహించడానికి తోడ్పాటు లు వంటివి భాగం గా ఉంటాయి.  

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
‘పరీక్ష పే చర్చ 2022’లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించిన ప్రధాన మంత్రి
Explore More
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
Indian economy has recovered 'handsomely' from pandemic-induced disruptions: Arvind Panagariya

Media Coverage

Indian economy has recovered 'handsomely' from pandemic-induced disruptions: Arvind Panagariya
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets people on Republic Day
January 26, 2022
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Republic Day.

In a tweet, the Prime Minister said;

"आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। जय हिंद!

Wishing you all a happy Republic Day. Jai Hind! #RepublicDay"