దేశ వ్యాప్తంగా 2000 ప్రాథమిక వ్యవసాయపరపతి కేంద్రాలలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ప్రధాని అభినందించారు. అత్యంత ఖరీదైన మందులు కూడా దేశంలోని మారుమూల ప్రాంతాలలో సైతం అందుబాటులో ఉండాలన్నది ప్రభుత్వ ప్రాధామ్యాలలో ఒకటని శ్రీ మోదీ గుర్తు చేశారు.
కేంద్ర సహకార శాఖామంత్రి చేసిన ట్వీట్ కు ప్రధాని స్పందిస్తూ ఇలా ట్వీట్ చేశారు:
“దేశ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన మందులు కూడా అతి తక్కువ ధరకు అండాల్సి ఉంది. ఇది మన ప్రభుత్వ ప్రాధామ్యాలలో ఒకటి. సహకార రంగంలో చేపట్టిన ఈ చర్య వలన గ్రామీణ ప్రాంతాల్లో నివవసించే వారికి జీవితం మరింత సుఖమయం అవుతుందని విశ్వసిస్తున్నాను,”
देशभर में महंगी से महंगी दवाएं भी कम से कम कीमत पर उपलब्ध हों, यह हमारी सरकार की प्राथमिकताओं में से एक है। मुझे पूर्ण विश्वास है कि सहकारिता क्षेत्र में हुई इस बड़ी पहल से ग्रामीण इलाकों में रहने वाले लोगों का जीवन और आसान होगा। https://t.co/psOk4Q5kle
— Narendra Modi (@narendramodi) June 7, 2023


