నాగాలాండ్ సీనియర్ నాయకుడు శ్రీ ఇంకాంగ్ ఎల్. ఇంచెన్ మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
నాగాలాండ్ అభివృద్ధి కోసం విశేష కృషి చేసిన శ్రీ ఇంచెన్ చిరస్మరణీయులని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. అనేక సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో క్రియాశీలంగా ఉన్న ఆయన.. అహర్నిశలూ గిరిజన వర్గాల సంక్షేమానికే దృఢంగా కట్టుబడి ఉన్నారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా తన పదవీకాలంలో అంకితభావంతో ఆయన అందించిన విశేష సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“నాగాలాండ్ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన శ్రీ ఇంకాంగ్ ఎల్. ఇంచెన్ చిరస్మరణీయుడు. అనేక ఏళ్ల పాటు ప్రజా జీవితంలో క్రియాశీలంగా ఉన్న ఆయన.. ముఖ్యంగా గిరిజన వర్గాల సంక్షేమం కోసం శ్రమించారు. శాసన సభ్యుడిగా, మంత్రిగా తన పదవీకాలంలో ఆయన అందించిన విశేష సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాగాలాండ్‌లో బీజేపీ బలోపేతం కోసం కూడా ఆయన ఎంతగానో కృషిచేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు సానుభూతి తెలుపుతున్నాను.”
Shri Imkong L. Imchen Ji will be remembered for his outstanding contribution to Nagaland's development. He had been active in public life for several years and was particularly passionate about welfare of tribal communities. His legislative and ministerial tenures will be fondly…
— Narendra Modi (@narendramodi) November 12, 2025


