ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో ఉమ్మడి పత్రికా ప్రకటనలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పురాతన కాలం నుంచి భారతదేశం మరియు ఇరాన్ మంచి సంబంధాలు కలిగిఉన్నాయని అన్నారు. ఇరువురు నాయకులు వాస్తవమైన మరియు ఉత్పాదక చర్చ జరిపారు. వాణిజ్యం మరియు పెట్టుబడి, ఇంధనం, అనుసంధానత, రక్షణ మరియు భద్రత మరియు ప్రాంతీయ సమస్యలపై సహకారానన్ని బలోపేతం చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి.