జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ, భారత దీర్ఘకాలిక భద్రత, అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడంలోనూ వ్యూహాత్మక జ్ఞానం, అవగాహనతో కూడిన సంయమనం, నిర్ణయాత్మక చర్యలు ఎంతో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సంస్కృత సూక్తిని ఉదాహరిస్తూ ఇలా రాశారు:
‘‘సుదుర్బలం నావజానాతి కంచిద్ యుక్తో రిపుం సేవతే బుద్ధిపూర్వమ్
న విగ్రహం రోచయతే బలస్థై: కాలే చ యో విక్రమతే స ధీర:’’
सुदुर्बलं नावजानाति कञ्चिद् युक्तो रिपुं सेवते बुद्धिपूर्वम्।
— Narendra Modi (@narendramodi) December 11, 2025
न विग्रहं रोचयते बलस्थैः काले च यो विक्रमते स धीरः॥ pic.twitter.com/OiRZQoKaMU


