భారతదేశం నుండి సంగీత ఉపకరణాల ఎగుమతుల లో వృద్ధి నమోదు అయినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2022వ సంవత్సరం లో ఏప్రిల్ మొదలుకొని సెప్టెంబర్ మధ్య కాలం లో భారతదేశం యొక్క సంగీత యంత్ర వాద్యాల ఎగుమతులు 2013వ సంవత్సరం తో పోలిస్తే 3.5 రెట్ల కంటే అధికం గా పెరిగిపోయాయి.
వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి మరొక ట్వీట్ లో శేర్ చేస్తూ, అందులో -
‘‘ఇది గొప్ప ఉత్సాహజనకం గా ఉన్నది. ప్రపంచం అంతటా భారతీయ సంగీతానికి పెరుగుతున్న లోకప్రియత్వం తో పాటు గా, ఈ రంగం లో మరింత గా ముందుకు పోవడం కోసం ఒక మంచి అవకాశం లభిస్తోంది.’’ అని పేర్కొన్నారు.
This is encouraging. With Indian music gaining popularity worldwide, there is a great opportunity to further grow in this sector. https://t.co/bEyJmQ7BKP
— Narendra Modi (@narendramodi) October 26, 2022