ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  ‘‘పరీక్షా పే చర్చా 2.0’’లో భాగం గా నేడు న్యూ ఢిల్లీ లోని తాల్‌క‌టోరా స్టేడియం లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మ‌రియు తల్లిదండ్రుల తో సంభాషించారు.  తొంబై నిముషాల‌ కు పైగా జ‌రిగిన ఈ ముఖాముఖి లో విద్యార్థులు, టీచర్ల తో పాటు త‌ల్లితండ్రులు మ‌ధ్య మ‌ధ్య సేదతీరారు; ఒకింత హాస్యం, ఒకింత చమత్కారం కలగలసినటువంటి ప్ర‌ధాన మంత్రి అభిప్రాయాల కు వారు పదే పదే హర్షధ్వానాలు చేశారు. 

 

ఈ సంవ‌త్స‌రం ఈ కార్యక్రమం లో దేశం అంతటి నుండి విద్యార్థులే కాకుండా విదేశాల లో ఉంటున్న భార‌తీయ విద్యార్థులు కూడా పాలుపంచుకొన్నారు.

ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ కు తగిన వాతావరణాన్ని కల్సిస్తూ పరీక్షా పే చర్చ సాగే పుర మందిరం ఒక బుల్లి భార‌త‌దేశం లాగా ఉందని వ‌ర్ణించారు.  ఇది భార‌త‌దేశం యొక్క భ‌విష్య‌త్తు కు ప్రతీక గా కూడా ఉంద‌ని ఆయ‌న అన్నారు.  త‌ల్లితండ్రులు మ‌రియు గురువులు సైతం ఈ కార్య‌క్ర‌మం లో భాగం అయ్యారని చెప్తూ ఆయ‌న ఆనందాన్ని వెలిబుచ్చారు.  

త‌మ పిల్ల‌లు వ్రాయాల్సిన పరీక్ష ల విషయం లో ఒత్తిడి ని ఎదుర్కొనే త‌ల్లితండ్రుల‌ కు మ‌రియు వాస్త‌వానికి భిన్న‌మైన అంచ‌నాల‌ ను క‌లిగి వుండేట‌టువంటి తల్లిదండ్రుల‌ కు గురువులు ఏమి చెప్పాల‌ని ప్ర‌ధాన మంత్రి ని ఒక టీచరు అడిగారు.  యుపిఎస్‌సి ప‌రీక్ష‌ కు సిద్ధ‌మ‌వుతున్న ఒక విద్యార్థి కూడా ఇటువంటి కోవ కే చెందిన ఒక ప్ర‌శ్న‌ ను అడిగారు.  ప్ర‌ధాన మంత్రి స‌మాధాన‌మిస్తూ, ప‌రీక్ష ప్ర‌భావాని కి ఎంత మాత్రం లోన‌వకుండా ఉండండనే సలహా ను తాను ఎవ్వరికీ ఇవ్వ‌బోన‌ని, పరీక్ష‌ యొక్క‌ సారాన్ని అర్థం చేసుకోవ‌డం ముఖ్య‌మ‌న్నారు.   ఒక ప‌రీక్ష అనేది జీవితాని కి సంబంధించిన ప‌రీక్షా ? లేక, అది ప‌దో త‌ర‌గతో లేదా ప‌న్నెండో త‌ర‌గ‌తో అనే ఒక ఫలానా గ్రేడ్ కు సంబంధించినటువంటి  ప‌రీక్షా ? అంటూ సభ లోని వారి కి ఆయన ఎదురుప్రశ్న ను వేశారు.  ఒకసారి గనక ఈ సంద‌ర్భాన్ని గ్ర‌హించామంటే, అప్పుడు ఒత్తిడి త‌గ్గిపోతుంది అని ఆయ‌న చెప్పారు.

 

త‌ల్లితండ్రులు వారు పండించుకోనటువంటి వారి సొంత క‌ల‌ల ను వారి యొక్క  పిల్ల‌లు నెర‌వేర్చాల‌ని ఆశించ‌కూడ‌ద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  ప్ర‌తి ఒక్క బాలుడి కి లేదా బాలిక కు వారిదైన సొంత స‌త్తా మ‌రియు శ‌క్తులు ఉంటాయ‌ని, ప్ర‌తి చిన్నారి లోని ఈ సానుకూలమైనటువంటి అంశాల ను అర్థం చేసుకోవ‌డం ముఖ్య‌మ‌ని ఆయ‌న చెప్పారు.

అపేక్షలు పెట్టుకోవడం అవ‌స‌ర‌మే అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  మనం నిరాశాపూరిత‌మైనటువంటి మ‌రియు సంతోషానికి తావు లేనటువంటి వాతావరణం లో మనుగడ ను సాగించలేం అని ఆయ‌న నొక్కి ప‌లికారు.

త‌ల్లితండ్రుల యొక్క ఒత్తిడి, త‌ల్లిదండ్రుల వద్ద నుండి వ‌చ్చే ఒత్తిడి అనే అంశాల కు సంబంధించి కొన్ని ప్ర‌శ్న‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి జ‌వాబిస్తూ, పిల్ల‌ల ప్రదర్శన వారి త‌ల్లిదండ్రుల పరిచయ కార్డు కాకూడద‌ని పేర్కొన్నారు.  ఒక‌వేళ ఇదే ల‌క్ష్యం అయినటువంటి ప‌క్షం లో, అంచ‌నాలు అనేవి అర్థం లేనివి గా మారిపోతాయి అని ఆయన అన్నారు.  మోదీ ప్ర‌ధాన మంత్రి గా వచ్చి అంచ‌నాల ను పెంచివేశార‌నేది కొద్ది మంది కి ఏర్ప‌డిన అభిప్రాయ‌ం అని ఆయ‌న చెప్పారు.  1.25 బిలియ‌న్ మంది భార‌తీయులు 1.25 బిలియ‌న్ ఆకాంక్ష‌ల‌ ను క‌లిగివుండాల‌నేది త‌న అభిప్రాయ‌మ‌ని ఆయ‌న అన్నారు.  ఆ ఆకాంక్ష‌ లను సైతం వ్య‌క్తపరచాల‌ని, మ‌రి ఆ ఆకాంక్ష‌ల ను నెరవేర్చుకోవ‌డం కోసం మనం అందరం మన యొక్క సామ‌ర్ధ్యాల‌ ను ఉమ్మడి గా పెంచి పోషించుకోవాల‌ని ఆయ‌న చెప్పారు.

 

ఒక మాతృమూర్తి త‌న బాబు ఒక‌ప్పుడు చక్క‌ గా చదివే వాడ‌ని, అయితే ప్ర‌స్తుతం ఆన్‌లైన్ క్రీడ‌ ల‌తో అత‌డి కి ధ్యాన భంగం అయింద‌ంటూ భ‌యాందోళ‌న‌ లను వ్య‌క్తం చేశారు.  దీని కి ప్ర‌ధాన మంత్రి బ‌దులిస్తూ, సాంకేతిక విజ్ఞానం ప‌ట్ల స్పృహ ను క‌లిగివుండ‌టం అనేది విద్యార్థుల‌ కు దానంత‌ట అదే చెడు చేస్తుంద‌ని తాను న‌మ్మ‌నన్నారు.  విద్యార్థులు కొత్త సాంకేతిక విజ్ఞానం తో  ప‌రిచ‌యాన్ని పొంద‌డం మంచిదే అని తాను విశ్వ‌సిస్తానని ఆయన చెప్పారు.  అయితే, సాంకేతిక విజ్ఞానం బుద్ధి వికసించేందుకు దారి తీయాల‌ని ఆయ‌న అన్నారు.  అది నూత‌న అంశాల‌ కు ఒక సాధనం కావాలి అని ఆయ‌న సూచించారు.  ప్లేస్టేశన్ మంచిదే, అయితే ఎవ‌రూ ఆటమైదానాన్ని మ‌ర‌చిపోకూడ‌దు అని ఆయ‌న అన్నారు.

సమయ నిర్వ‌హ‌ణ ను గురించి మరియు నిస్సత్తువ కు లోనవ‌డాన్ని గురించి అడిగిన ఒక ప్ర‌శ్న‌ కు ప్ర‌ధాన మంత్రి స‌మాధానం చెప్తూ, దేశం లోని యావత్తు 1.25 బిలియ‌న్ మంది భార‌తీయులు త‌న కు కుటుంబ‌ సభ్యులు అని చెప్పారు.  ఎవ‌రైనా ఒక వ్యక్తి త‌న పరివారం కోసం పనిచేస్తున్నప్పుడు, అత‌డు అల‌స‌ట కు ఎలా లోనవగలడు ? అని ఆయ‌న అన్నారు.  ప్ర‌తి ఒక్క కొత్త రోజు న తాను తన పనుల ను కొత్త శ‌క్తి తో పున: ప్రారంభిస్తానని ఆయ‌న తెలిపారు.

చ‌దువుకోవడాన్ని ఏ విధం గా మ‌రింత ఆనందదాయకం గా మార్చ‌ుకోవచ్చని , అలాగే ప‌రీక్ష‌లు అనేవి ఏ విధం గా ఒక‌రి వ్య‌క్తిత్వాన్ని మెరుగు ప‌ర‌చ‌గ‌లుగుతాయంటూ ప్ర‌ధాన మంత్రి ని విద్యార్థులు అడిగారు.  స‌రైన భావన తో పరీక్ష లకు హాజరు కావడం ప్రధానం అని ప్ర‌ధాన మంత్రి జవాబిచ్చారు.  ప‌రీక్ష‌ల తో ఒక వ్య‌క్తి మరింత శ‌క్తి గల వాడి గా మారుతాడని, మరి వాటిని ఎవ్వరూ యిష్టపడకుండా ఉండరాద‌ని ఆయ‌న అన్నారు.

విషయం పైన, వృత్తి జీవ‌నం తాలూకు ఎంపిక‌ పైన విద్యార్థులు ప్ర‌ధాన మంత్రి వ‌ద్ద నుండి స‌ల‌హాల ను పొందగోరారు.  ప్ర‌తి ఒక్క విద్యార్థి కి వేరు వేరు బ‌లాలు అంటూ ఉంటాయ‌ని, అందువల్ల ప్ర‌తి ఒక్క విద్యార్థి గ‌ణితం లో, విజ్ఞాన శాస్త్రం లో చ‌క్క‌గా రాణించే అవసరం ఏమీ లేదనే అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చారు.  దీని కి ప్ర‌ధాన‌ మంత్రి స‌మాధాన‌మిస్తూ, ఆలోచ‌న‌ లో స్ప‌ష్ట‌త‌ మ‌రియు ఆత్మవిశ్వాసం ఉండి తీరాలని పేర్కొన్నారు.  అవును, విజ్ఞాన శాస్త్రం, ఇంకా గ‌ణితం అవ‌స‌ర‌మే, కానీ అన్వేషించదగ్గ ఇత‌ర విషయా లు సైతం ఉన్నాయ‌ని ఆయన అన్నారు.  ప్ర‌స్తుతం అవ‌కాశాలు ల‌భిస్తున్న రంగాలు అనేకం ఉన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  

ఇదే అంశం పై గ‌త సంవ‌త్స‌రం జ‌రిగిన పుర మందిర సంభాష‌ణ ను ఒక విద్యార్థి గుర్తు కు తెచ్చి, ప‌రీక్ష‌లు, ఇంకా వృత్తి జీవ‌నం వంటి అంశాల‌ కు వ‌చ్చే స‌రికి ఇప్పుడు త‌న త‌ల్లితండ్రులు ఇదివ‌రక‌టి తో పోలిస్తే మరింత ఎక్కువ భరోసా తో ఉన్నట్లు క‌నిపిస్తున్నార‌ని చెప్పారు.  త‌ల్లితండ్రుల యొక్క సానుకూల వైఖరి పిల్ల‌ల జీవితాల లో పెద్ద పాత్ర‌ ను పోషిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

బాల‌ల ను ప్రోత్స‌హించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉందని ప్ర‌ధాన మంత్రి దృష్టి కి విద్యార్థులు తీసుకువచ్చారు.  దీనికి ఆయ‌న ప్ర‌తిస్పందిస్తూ, ఇత‌రుల‌ తో పోటీ పడటం కాకుండా గతం లోని స్వీయ ప్ర‌దర్శన ను మెరుగుప‌ర‌చుకోవ‌డం కోసం పోటీ పడాల‌న్నారు.  ఒకవేళ ఒక వ్య‌క్తి త‌న గత ప్ర‌దర్శన తో పోటీ ని పెట్టుకొంటే, అటువంటప్పుడు నిరాశావాదాన్ని మరియు న‌కారాత్మ‌క‌త ను సులువుగా ఓడించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

విద్యా వ్య‌వ‌స్థ ల‌కు మ‌రింత గా మెరుగులు దిద్దవ‌ల‌సిన అవ‌స‌రాన్ని గురించి, అలాగే బ‌ట్టీ ప‌ట్ట‌డానికి పరీక్ష లు అనే విధం గా పరీక్షలు మిగిలాయని; అంత క‌న్నా విద్యార్థులు ఏమి ఆకళింపు చేసుకొన్నారనేది కూడా పరీక్ష లు రుజువు చేయాలంటూ విద్యార్థులు ప్ర‌స్తావించారు.

 

ప్ర‌ధాన మంత్రి త‌న వంతు గా చెప్తూ, మ‌న జ్ఞానార్జ‌న ఒక్క పరీక్ష‌ల కే ప‌రిమితం కాకూడద‌న్నారు.  మ‌న విద్య జీవితం లోని వేరు వేరు స‌వాళ్ళ ను ఎదుర్కొనేటటువంటి స‌త్తా ను మన కు ఇవ్వాల‌న్నారు.

విచారం అనే అంశం పై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, మ‌న దేశం వంటి దేశం లో ఈ అంశం ఆందోళ‌నక‌ర‌ం అని పేర్కొన్నారు.  దీని కి ఎదురొడ్డి నిలచేటటువంటి మరియు దీనిని దూరం చేసేటటువంటి ఉపాయాలు భార‌తీయ సంస్కృతి లో ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు.  వ్యాకులత కు గురి కావడం మ‌రియు మాన‌సిక స్వ‌స్థ‌త‌ కు సంబంధించిన వ్యవహారాల‌ ను గురించి మ‌నం ఎంత బాహాటం గా చ‌ర్చించుకొంటే అంత మంచి జరుగుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

 

ఒక వ్య‌క్తి ఉన్న‌ట్టుండి స్తబ్దత కు లోన‌వ‌డం జ‌ర‌గ‌దు అని ఆయ‌న అన్నారు.  ఒక మ‌నిషి కుంగుబాటు దిశ‌ గా సాగుతున్నట్టు తెలిపే కొన్ని సంకేతాలు స్పష్టంగా కనుపిస్తాయని, ఈ సంకేతాల‌ ను ఉపేక్షించడం మంచి ఆలోచ‌న కాద‌ని చెప్పిరు.  దీని కి భిన్నం గా మ‌నం దీనిని గురించి పదే పదే మాట్లాడుకోవాలని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  సలహాలు ఇవ్వడం స‌హాయ‌కారి కాగలదని, ఎందుకంటే ఈ కౌన్సెలింగ్ వల్ల వ్య‌క్తి తన సమ‌స్య‌ల‌ విషయమై ఎక్కువ సేపు మాట్లాడుతాడని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
During Diplomatic Dinners to Hectic Political Events — Narendra Modi’s Austere Navratri Fasting

Media Coverage

During Diplomatic Dinners to Hectic Political Events — Narendra Modi’s Austere Navratri Fasting
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 అక్టోబర్ 2024
October 06, 2024

PM Modi’s Inclusive Vision for Growth and Prosperity Powering India’s Success Story