IICC would reflect India’s economic progress, rich cultural heritage, and our consciousness towards environment protection: PM Modi
Our Government has begun a series of unprecedented projects for the nation’s development: PM Modi
Our Government does not shy away from taking tough decisions in national interest: PM Modi
All round progress has happened in the last four years only because national interest has been kept supreme: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇండియా ఇంటర్‌నేశ‌న‌ల్ కన్‌వెన్శన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) కి న్యూ ఢిల్లీ లోని ద్వార‌క లో ఈ రోజు న పునాది రాయి ని వేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ భార‌త‌దేశ ఆర్థిక పురోగ‌తి ని, ఘ‌న‌మైన సాంస్కృతిక వార‌స‌త్వాన్ని మ‌రియు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప‌ట్ల మ‌న‌కు ఉన్న స్పృహ‌ ను ఈ కేంద్రం ప్ర‌తిబింబిస్తుంద‌న్నారు.  వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యానికి, ప్ర‌పంచ శ్రేణి మౌలిక స‌దుపాయాల‌ కు ప్రాముఖ్యాన్ని ఇస్తున్న‌ ప్ర‌భుత్వ దార్శ‌నిక‌త లో ఇది ఒక భాగం అని కూడా ఆయ‌న చెప్పారు.

దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఏ విధంగా ఇది వ‌ర‌కు లేనటువంటి అనేక ప‌థ‌కాలను మొద‌లుపెట్టిందీ ప్ర‌ధాన మంత్రి జ్ఞ‌ప్తి కి తెచ్చారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న అతి పొడ‌వైన సొరంగం, గ్యాస్ స‌ర‌ఫ‌రా కు ఉద్దేశించిన‌టువంటి సుదీర్ఘ‌మైన గొట్ట‌పు మార్గం, అత్యంత భారీదైన మొబైల్ తయారీ యూనిట్ తో పాటు, ప్ర‌తి కుటుంబానికి విద్యుత్తు త‌దిత‌ర ప‌థ‌కాల‌ను గురించి ప్ర‌స్తావించారు.  ఇవ‌న్నీ ‘న్యూ ఇండియా’ యొక్క నైపుణ్యానికి, పరిమాణానికి మరియు వేగానికి ఉదాహరణలు అని ఆయ‌న అన్నారు.

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా అనేక దేశాలు స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌ కు విస్తృత‌మైన సామ‌ర్ధ్యాల‌ను అభివృద్ధిప‌ర‌చుకొన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ అంశంపై భార‌త‌దేశం లో చాలా కాలం పాటు ఆలోచ‌న చేయ‌డం జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న చెప్పారు.  ప్ర‌స్తుతం ఇది మార్పు కు లోన‌వుతోందని ఆయ‌న వివ‌రించారు.

బ‌ల‌మైన సంస్థాగ‌త సామ‌ర్ధ్యాలు మ‌రియు వ్య‌వ‌స్థాత్మ‌క సామ‌ర్ధ్యాల ద్వారా ఒక దేశం పురోగ‌మిస్తుంద‌ని, ఏళ్ళ త‌ర‌బ‌డి జరిపే కృషి ఫ‌లితం గా ఇవి సిద్ధిస్తాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  దీనికి గాను నిర్ణయాలను స‌కాలం లో తీసుకోవ‌డం తో పాటు వాటిని జాప్యానికి తావీయ‌కుండా అమ‌లు ప‌ర‌చ‌డమూ ముఖ్య‌మేనని ఆయ‌న చెప్పారు.

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌భుత్వ బ్యాంకుల విలీనం విషయం లో ఇటీవ‌ల తీసుకొన్న నిర్ణ‌యాన్ని గురించి ప్ర‌స్తావించారు.  సుమారు రెండున్న‌ర ద‌శాబ్దాల క్రితం దీనిని గురించిన ఆలోచ‌న చేసిన‌ప్ప‌టికీ అమ‌లు ప‌ర‌చ‌డం జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు.  అయితే, ఈ ప్ర‌భుత్వం దేశానికి హిత‌క‌ర‌మైన క‌ఠిన నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం లో వెనుకాడదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  దేశ ప్ర‌జ‌ల హితాన్ని అన్నింటి క‌న్నా మిన్న‌ గా భావించినందువ‌ల్ల‌నే గ‌త నాలుగు సంవ‌త్స‌రాలు గా అన్ని రంగాలలో అభివృద్ధి చోటు చేసుకొంద‌ని ఆయ‌న అన్నారు.  ప్ర‌జ‌ల కు అత్యంత మేలు చేసే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకొనే ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  స‌వాళ్ళు ఎదుర‌వుతున్న‌ప్ప‌టికీ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌మైన పునాది మీద ఉన్నదని ఆయ‌న చెప్పారు.  ‘‘వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యాన్ని’’ గురించి ఆయ‌న ప్ర‌స్తావిస్తూ, ప్ర‌స్తుతం ఈ కృషి ని జిల్లా స్థాయి కి తీసుకుపోయే దిశ‌ లో ప్రభుత్వం కృషి చేస్తోంద‌న్నారు.

Click here to read PM's speech 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report

Media Coverage

Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 మార్చి 2026
March 26, 2026

India’s Economy, Innovative Spirit and Global Standing Continue to Thrive with the Modi Government