ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ ఈ రోజు వారణాసిలోని బడా లాల్పూర్లో హస్తకళల కోసం ఒక వాణిజ్య సులభతర కేంద్రమయిన డీన్ దయాల్ ఉపాధ్యాయ హస్తకళ సంకుల్ ను సందర్శించారు. ఇరువురు నాయకులు కళాకారులతో పరస్పర చర్యలు చేపట్టారు మరియు తమ చేతిపనుల ప్రత్యక్ష ప్రదర్శనలు చూశారు.










