India has Democracy, Demography and Demand altogether: PM Modi at India-Korea Business Summit
We have worked towards creating a stable business environment, removing arbitrariness in decision making, says PM Modi
We are on a de-regulation and de-licensing drive. Validity period of industrial licenses has been increased from 3 years to 15 years and more: PM
We are working with the mission of Transforming India from an informal economy into a formal economy: PM Modi
India is the fastest growing major economy of the world today: PM Modi
We are also a country with the one of the largest Start up eco-systems: PM Modi at India-Korea Business Summit

కొరియా గణతంత్రం వ్యాపార, పరిశ్రమలు మరియు శక్తి శాఖ మంత్రివర్యులు,

భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు,

చోసున్- ఇల్బో గ్రూపు ప్రెసిడెంట్ మరియు సిఇఒ;

కొరియా మరియు భారతదేశానికి చెందిన వ్యాపార ప్రముఖులు,

మహిళలు మరియు సజ్జనులారా,

మీ అందరినీ ఇక్కడ కలుసుకొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో భారీ సంఖ్యలో కొరియా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తూ ఉండడం నిజంగా ఒక ప్రపంచ గాథ వంటిది. మీ అందరినీ ఆహ్వానించడానికి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. భారతదేశం, కొరియా ల అనుబంధం శతాబ్దాల క్రితం నాటిది. ఒక భారత యువ రాణి కొరియా లో పర్యటించి కొరియా కు రాణి అయ్యారని ఒక కథనం ఉంది. బౌద్ధ సంప్రదాయాలతో కూడా మన రెండు దేశాలకు సంబంధం ఉంది. కొరియా కు గల ఉజ్జ్వలమైన గతాన్ని, రానున్న వెలుగులతో కూడిన భవిష్యత్తును గురించి నోబెల్ బహుమతి గ్రహీత, ప్రసిద్ధ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ “లాంప్ ఆఫ్ ద ఈస్ట్” పేరిట ఒక పద్యం రాశారు. బాలీవుడ్ చిత్రాలకు కొరియా లో మంచి ఆదరణ ఉంది. కొద్ది నెలల క్రితం ప్రొ- కబడ్డీ లీగ్ సందర్భంగా కొరియా కు చెందిన కబడ్డీ క్రీడాకారుడికి హర్షధ్వానాలతో నీరాజనం పట్టారు. భారతదేశం, కొరియా రెండూ వాటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15 వ తేదీనే నిర్వహించుకోవడం ఒక చక్కని సారూప్యత. యువ రాణి నుండి పద్యం వరకు, బుద్ధుని నుండి బాలీవుడ్ వరకు మన రెండు దేశాల మధ్య అన్ని సారూప్యతలున్నాయి.

నేను ఇంతకు ముందే చెప్పినట్టు కొరియాకు నేనెప్పుడూ ఆకర్షితుడినవుతూ ఉంటాను. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నేను కొరియా ను సందర్శించాను. గుజరాత్ విస్తీర్ణంతో సమానమైన ఒక దేశం ఆర్థికంగా అంత పురోగతి ఎలా సాధించిందా అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. కొరియా ప్రజల్లోని పారిశ్రామిక ధోరణులంటే నాకు ఆరాధన భావం ఉంది. అంతర్జాతీయ బ్రాండులను సృష్టించి అవి చిరకాల మనగలిగేలా చేసిన వారి వైఖరిని నేను గౌరవిస్తాను. ఐటి, ఎలక్ట్రానిక్స్ నుండి ఆటోమొబైల్, స్టీల్ ల వరకు కొరియా ప్రపంచానికి అసాధారణమైన ఉత్పత్తులను అందించింది. కొరియా కంపెనీల నవ కల్పనలు, శక్తివంతమైన తయారీ సామర్థ్యాలు సర్వత్రా ప్రశంసలు పొందుతూ ఉంటాయి.

మిత్రులారా,

గత ఏడాది మన ద్వైపాక్షిక వాణిజ్యం 20 బిలియన్ డాలర్లను మించడం ఎంతో ఆనందదాయకం. ఆరేళ్ల కాలంలో తొలిసారిగా ఇది జరిగింది. 2015లో నా కొరియా సందర్శన అనంతరం భారతదేశం పై సానుకూలంగా దృష్టి సారించే ధోరణి మరింతగా పెరిగింది. మీ బహిరంగ విపణి విధానాలు భారతదేశ సరళీకరణ విధానాలు, “లుక్ ఈస్ట్ విధానం”లోని సానుకూలతను కనిపెట్టాయి. భారతదేశం లో ప్రస్తుతం 500 కి పైగా కొరియా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాస్తవానికి మీరు తయారు చేస్తున్న పలు ఉత్పత్తులు భారతదేశంలో ఇంటింటి పేర్లుగా మారిపోయాయి. అయినప్పటికీ భారతదేశానికి వస్తున్న ఎఫ్ డిఐలలో కొరియాది ఇప్పటికీ 16వ స్థానంగానే ఉంది. భారీ విపణి తోను, సానుకూల విధానాల వాతావరణంతోను భారతదేశం మరిన్ని ఎక్కువ అవకాశాలను కొరియా ఇన్వెస్టర్ల ముందుంచింది.

మీలో చాలా మంది ఇప్పటికే భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నారు గనుక ఇక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులు మీకు బాగా తెలుసు. భారతదేశ సిఇఒ లతో మీరు జరిపిన చర్చల ద్వారా ప్రస్తుతం భారతదేశం ఏ దిశగా పయనిస్తోందన్న అవగాహన కూడా ఏర్పడి ఉంటుంది. అయినప్పటికీ నేను కొన్ని నిమిషాలు ఆ అంశాన్ని గురించి వివరించాలనుకుంటున్నాను. ఇప్పటికీ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీలను వ్యక్తిగతంగా ఇక్కడకు ఆహ్వానించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను. ప్రపంచ దేశాలను గమనించినట్టయితే మూడు ప్రధానాంశాలు ఒక్కటిగా కలిసి ఉన్నర ఆర్థిక వ్యవస్థలు కొన్ని మాత్రమే ఉంటాయి.
అవి.. ప్రజాస్వామ్యం, జన సంఖ్య, డిమాండు. భారతదేశం లో ఈ మూడూ కలిసి ఉన్నాయి.

– ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుతంగా, సరళంగా పని చేసుకొనేందుకు అనుకూలమైన వాతావరణం, విలువలు కలిగినది భారత ప్రజాస్వామ్యం.

– ప్రతిభా సామర్థ్యాలకు పెట్టింది పేరైన యువశక్తి జనాభాపరంగా భారతదేశానికి గల ప్రత్యేక స్వభావం

– వస్తువులకు, సేవలకు అత్యధిక గిరాకీ కలిగిన అతి పెద్దదైన, నానాటికీ విస్తరిస్తున్న విపణి భారతదేశం

నానాటికీ విస్తరిస్తున్న మధ్యతరగతి దేశీయ విపణి మరింతగా వృద్ధి చెందేందుకు అవకాశాలను ప్రసాదిస్తోంది. విధాన నిర్ణయాలలో ఏకపక్ష ధోరణులు తొలగించడం, దేశీయ చట్టాలకు విలువ ఇవ్వడం ద్వారా సుస్థితమైన వ్యాపార వాతావరణ కల్పనకు మేం కృషి చేస్తున్నాం. రోజు వారీ కార్యకలాపాల్లో సానుకూలత తెచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అనుమానాల్లో కూరుకుపోయే కన్నా విశ్వసనీయతను పెంచేందుకు కృషి చేస్తున్నాం. “కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన” సిద్ధాంతం ద్వారా వ్యాపార భాగస్వాములకు మరింత సానుకూలతను తీసుకు వస్తున్నాం. ఇవి వచ్చినట్టయితే నిబంధనలు, విధానాలు వాటికవే ఏర్పడుతాయి.

వ్యాపారానుకూలత కోరేది ఇలాంటి చర్యలనే. ఇప్పుడు మేం “సులభంగా జీవించే వాతావరణం” కల్పనకు కృషి చేస్తున్నాం.

మేం నియంత్రణలను, లైసెన్సింగ్ విధానాలను తొలగించే కృషిలో ఉన్నాం.

పారిశ్రామిక లైసెన్సుల చెల్లుబాటు కాలపరిమితిని మూడు సంవత్సరాల నుండి 15 సంవత్సరాలకు పెంచాం.

రక్షణ ఉత్పత్తులకు పారిశ్రామిక లైసెన్సుల మంజూరును సరళం చేశాం.

గతంలో లైసెన్సులతో మాత్రమే ఉత్పత్తి అవుతున్న 60 నుండి 70 శాతం ఉత్పత్తులను ఇప్పుడు లైసెన్సుతో పని లేకుండానే తయారుచేయవచ్చు.

అవసరాన్ని బట్టి మాత్రమే ఫ్యాక్టరీ తనిఖీలు ఉంటాయని మేం చెప్పాం. ఎప్పుడు తలిస్తే అప్పుడు తనిఖీలకు వెళ్లేందుకు ఏ ఉన్నతాధికారికీ అధికారం కట్టబెట్టలేదు.

ఎఫ్ డిఐల విషయంలో బహిరంగ వైఖరి గల కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి.

మా ఆర్థిక వ్యవస్థలో పలు రంగాలలో ఎఫ్ డిఐలను పూర్తి స్వేచ్ఛ కల్పించాం. 90 శాతానికి పైగా అనుమతులను ఆటోమేటిక్ విధానంలోనే పెట్టాం.

రక్షణ రంగం మినహా తయారీ రంగం లోని ఏ ఇతర విభాగాలలో పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతితో పని లేదు.

చట్టబద్ధమైన సంఖ్యల కేటాయింపుతో ఒక కంపెనీ స్థాపించడం ఇప్పుడు ఒక్క రోజు పనే.

సీమాంతర వ్యాపారం, ఇతర వ్యాపారాలు, పెట్టుబడుల విభాగాల్లో మేం వేలాది సంస్కరణలను చేపట్టాం. వాటిలో జిఎస్ టి చాఃరిత్రాత్మకమైంది.

జిఎస్ టి ద్వారా కార్యకలాపాలు ఎంత సరళం అయ్యాయో మీరు ఈ పాటికి అనుభవం ద్వారా తెలుసుకునే ఉంటారు.

కాలం చెల్లిపోయిన చట్టాలను మరియు పాలన వ్యవహారాలను సంక్లిష్టం చేస్తున్న చట్టాలను మొత్తంమీద1400కి పైగానే మేం పూర్తిగా రద్దు చేశాం.

ఈ చర్యలన్నీ మా ఆర్థిక రంగాన్ని మరింత మెరుగైన ఆర్థిక వృద్ధి సాధన బాటలో పెట్టాయి.

గత మూడేళ్ల కాలంలో ఎఫ్ డిఐల రాక విపరీతంగా పెరిగింది.

దేశీయ పరిశ్రమలో ఇప్పుడు కొత్త శక్తి, చలనశీలత ఏర్పడ్డాయి.

స్టార్ట్- అప్ లకు అనుకూలమైన కొత్త వాతావరణాన్ని కల్పించాం.

పౌరులకు గుర్తింపు నంబర్ (యూనిక్ ఐడి), మొబైల్ విస్తరణతో మేం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా త్వరితంగా అడుగులు వేస్తున్నాం.

ఇటీవల ఆన్ లైన్ లోకి వచ్చిన కోట్లాది మంది భారతీయుల శక్తిని ఉపయోగించుకోవడం మా వ్యూహం.

ఇతరుల పట్ల శ్రద్ధను, సానుభూతిని ప్రదర్శిస్తూనే పోటీ సామర్థ్యం గల న్యూ ఇండియా అవతరణకు ఇది అవకాశం కల్పిస్తోంది.

ప్రపంచ యవనిక నుంచి చూసినట్టయితే..

ప్రపంచ బ్యాంకు వ్యపారానుకూల సూచిలో గత మూడేళ్లలో భారతదేశం 42 స్థానాలు పైకి వెళ్లింది.

ప్రపంచబ్యాంకు లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ సూచి 2016లో భారతదేశం 19 స్థానాలు పైకి ఎక్కింది.

ప్రపంచ ఆర్థిక వేదిక అంతర్జాతీయ పోటీ సామర్థ్య సూచి లో గత రెండేళ్ల కాలంలో 31 స్థానాలు ఎగబాకింది.

విపోకి చెందిన గ్లోబల్ ఇనవేశన్ ఇండెక్స్ లో రెండు సంవత్సరాల కాలంలో మేం 21 స్థానాలుముందుకి దూసుకుపోయాం.

అంక్టాడ్ కు జాబితాలో అత్యంత ఆకర్షణీయ ఎఫ్ డిఐ గమ్యాలలో భారతదేశం అగ్రగామి 10 స్థానాలలో నిలిచింది.

ప్రపంచంలో తక్కువ వ్యయాలకే తయారీ సామర్థ్యం గల వాతావరణం భారతదేశం లో ఉంది.

ఎంతో మేధస్సు, శక్తియుక్తులు గల వృత్తి నిపుణులు ఎందరో భారతదేశం ఆస్తి. ప్రపంచ శ్రేణి ఇంజనీరింగ్ విద్య, బలమైన ఆర్ అండ్ డి వసతులు మాకు ఉన్నాయి.

గత రెండు సంవత్సరాలలో దేశంలో కార్పొరేట్ పన్నులు కనిష్ఠంగా ఉండే దిశగా అడుగేస్తున్నాం. చిన్న వ్యాపారాలకు, కొత్త పెట్టుబడులకు పన్ను రేటు ను 30 శాతం నుండి 25 శాతానికి తగ్గించాం.

భారతదేశంలో పరివర్తన లక్ష్యంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో మేం ముందుకు సాగుతున్నాం.
పాత నాగరికతను ఆధునిక సమాజంగా తీర్చి దిద్దుతున్నాం.

అవ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థను వ్యవస్థీకృతం చేస్తున్నాం.

మేం పని చేస్తున్నపరిధి, విస్తృతి ఎంతటిదో మీరే ఊహించవచ్చు. కొనుగోలు శక్తి పరంగా మాది ఇప్పటికే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జిడిపి పరంగా అతి త్వరలో ప్రపంచం లోని ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోంది.

ప్రపంచంలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మాది. ప్రపంచంలో అతి పెద్ద స్టార్ట్- అప్ అనుకూల సమాజాల్లో భారతదేశం ఒకటి.

నైపుణ్యాలు, వేగం, పరిధి కలిగివుండి ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యం గలదిగా పారిశ్రామిక రంగాన్ని తీర్చి దిద్దడం మా విజన్. ఇదే లక్ష్యంతో దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరచేందుకు మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. యువతకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడానికి తయారీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఈ లక్ష్యంతోనే మేం “మేక్ ఇన్ ఇండియా” ప్రచార కార్యక్రమం చేపట్టాం.

మా పారిశ్రామిక మౌలిక వసతులు, విధానాలు, ఆచరణల్లో అంతర్జాతీయ ప్రమాణాలను సాధించడం ద్వారా భారతదేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చాలన్నది మా లక్ష్యం. “డిజిటల్ ఇండియా”, “స్కిల్ ఇండియా” ల వంటి కార్యక్రమాల ద్వారా దీనికి మరింత స్ఫూర్తిని ఇస్తున్నాం. ఎలాంటి లోపాలు లేని, ఎలాంటి ప్రభావం లేని తయారీ కార్యకలాపాలు, స్వచ్ఛమైన, హరితభరితమైన అభివృద్ధి మా కట్టుబాట్లు.

మరింత మెరుగైన పర్యావరణ టెక్నాలజీలు ఉపయోగిస్తామని ప్రపంచానికి ప్రకటించిన కట్టుబాటుకు దీటుగా మేం త్వరితంగా అడుగులు వేస్తున్నాం.

భారతదేశ సాఫ్ట్ వేర్ పరిశ్రమ కు, కొరియా ఐటి పరిశ్రమ కు మధ్య సహకారానికి ఎంతో అవకాశం ఉన్నట్టు నా దృష్టికి వచ్చింది. మీ కార్ల తయారీ, మా డిజైనింగ్ సామర్థ్యాలను ఇప్పటికే జత చేశాం. ఉక్కు తయారీలో మేం ప్రపంచంలో మూడో స్థానానికి ఎదిగినా దానికి విలువ జోడింపు ప్రక్రియ ఇంకా జరగవలసి ఉంది. మరింత మెరుగైన ఉత్పత్తుల కోసం మీ ఉక్కు తయారీ సామర్థ్యాలను, మా దగ్గర పుష్కలంగా ఉన్న ఇనుప ఖనిజాన్ని ఒక్కటి చేయాల్సిన అవసరం ఉంది.

అలాగే మీ నౌకా నిర్మాణ సామర్థ్యం, పోర్టుల ఆధారిత అభివృద్ధికి మేం చేస్తున్న కృషి కలిసి మన భాగస్వామ్యానికి కొత్త చోదకశక్తి కావాలి.

ఇళ్ల నిర్మాణం, స్మార్ట్ సిటీలు, రైల్వే స్టేషన్ ల ఆధునికీకరణ, నీరు, రవాణా, రైల్వేలు, సముద్ర నౌకాశ్రయాలు, పునరుత్పాదకతలతో సహా శక్తి, ఐటి మౌలిక వసతులు- సర్వీసులు, ఎలక్ట్రానిక్స్ ల వంటి విభాగాలన్నీ మా దేశంలో ఎన్నో అవకాశాలను మీ ముందు నిలిపాయి. ఆసియా లో ప్రాంతీయ వృద్ధి, అభివృద్ధి, సుస్థిరత, సుసంపన్నతల కోణంలో మన భాగస్వామ్యం ఎంతో శక్తివంతమైంది. అతి పెద్ద ఆర్థిక నమూనాతో భారతదేశం తూర్పు వైపు ఆశగా చూస్తోంది. అలాగే దక్షిణ కొరియా తన విదేశీ విపణుల విస్తరణ కోసం కృషి చేస్తోంది.

భాగస్వామ్యాన్ని మరింత లోతుగా విస్తరించుకోవడం ద్వారా ఉభయ పక్షాలు లాభపడవచ్చు. భారతదేశం అతి పెద్దదైన వర్థమాన విపణి. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా విపణులలో ప్రవేశానికి కొరియాకు భారతదేశం ఒక సేతువుగా నిలుస్తుంది. మన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు నడిపించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నా కొరియా పర్యటన సందర్భంగా గుర్తించిన విషయం గుర్తుచేసుకోండి. 
భారతదేశం లో కొరియా పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాం. అందుకు అనుగుణంగా “కొరియా ప్లస్” ను 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో కొరియా పెట్టుబడులను ప్రోత్సహించడం, సానుకూల వాతావరణాన్ని కల్పించడం, అవి స్థిరంగా ఉండేలా చూడడం కొరియా ప్లస్ కు అప్పగించిన బాధ్యతలు. రెండేళ్ల స్వల్పకాలంలోనే కొరియా ప్లస్ భారతదేశానికి 100కు పైగా కొరియా ఇన్వెస్టర్లను తీసుకువచ్చింది. కొరియన్ కంపెనీలు భారతదేశం లో ఉన్నంత కాలం వాటికి అది భాగస్వామిగా వ్యవహరిస్తుంది. కొరియా ప్రజలు, కంపెనీలు, ఐడియాలు, పెట్టుబడుల పట్ల మాకు గల కట్టుబాటుకు అది నిదర్శనం.

మిత్రులారా,
భారతదేశం ఇప్పుడు వ్యాపారానికి సిద్ధంగా ఉందని చెప్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. పరిశ్రమల రంగ ప్రవేశానికి భారతదేశం ఇప్పుడు ఎలాంటి అవరోధాలు లేని స్వేచ్ఛా గమ్యం. ఇలాంటి స్వేచ్ఛాయుత, వర్ధమాన విపణి ప్రపంచంలో మీకు ఎక్కడా కనిపించదు. మీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి, పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా మేం సిద్ధం అని హామీ ఇస్తున్నాను. మీ పెట్టుబడులకు, మీరు మా ఆర్థిక వ్యవస్థకు అందిస్తున్న వాటాకు మేం విలువ ఇస్తాం. వ్యక్తిగత స్థాయిలోనూ మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు నేను సిద్ధంగా ఉంటానని హామీ ఇస్తున్నాను.

మీకు ఇవే నా ధన్యవాదాలు..

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
During Diplomatic Dinners to Hectic Political Events — Narendra Modi’s Austere Navratri Fasting

Media Coverage

During Diplomatic Dinners to Hectic Political Events — Narendra Modi’s Austere Navratri Fasting
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 అక్టోబర్ 2024
October 06, 2024

PM Modi’s Inclusive Vision for Growth and Prosperity Powering India’s Success Story