Indian diaspora across the world are true and permanent ambassadors of the country, says PM Modi
In whichever part of the world Indians went, they not only retained their Indianness but also integrated the lifestyle of that nation: PM
Aspirations of India’s youth and their optimism about the country are at the highest levels: PM Modi
India, with its rich values and traditions, has the power to lead and guide the world dealing with instability: PM Modi
At a time when the world is divided by ideologies, India believes in the mantra of ‘Sabka Sath, Sabka Vikas’: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జ‌రిగిన పిఐఒ-పార్ల‌మెంటేరియ‌న్ కాన్ఫ‌రెన్స్ ప్రారంభ స‌భ‌ లో ప్ర‌సంగించారు.

ప్ర‌తినిధుల‌ను ఈ స‌మావేశానికి ఆహ్వానిస్తూ, కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాలుగా అనేక మంది భార‌త‌దేశాన్ని వదలిపెట్టివెళ్లిన‌ప్ప‌టికీ భార‌త‌దేశం వారి అంత‌రంగాల‌లో, హృద‌యాలలో ఒక స్థానాన్ని ప‌దిల‌ప‌ర‌చుకొని ఉన్నద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. భార‌తీయ మూలాలు క‌లిగి ఉన్న ప్రజలు వారు నివ‌సిస్తున్న భూభాగాల‌తో త‌మ‌ను తాము పూర్తిగా మమేకం కావ‌డం ఆశ్చ‌ర్య‌కరమేమీ కాదని ఆయ‌న అన్నారు. భార‌తీయ‌త‌ను వారు లోలోప‌ల స‌జీవంగా ఉంచుకొంటూనే, ఆయా దేశాల వేషభాషలను మరియు ఆహారాన్నికూడా ఇముడ్చుకొన్నార‌ని ఆయ‌న అన్నారు.

ఈ రోజున ఢిల్లీలో భార‌తీయ మూలాలు క‌లిగిన ఒక బుల్లి ప్ర‌పంచ పార్ల‌మెంటు పోగ‌యిందా అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. భార‌తీయ మూలాలు క‌లిగిన వ్య‌క్తులు ఈ రోజు ఐర్లండ్, మారిష‌స్ మ‌రియు పోర్చుగ‌ల్ ల ప్ర‌ధానులుగా ఉన్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. భార‌తీయ మూలాలు క‌లిగిన‌టువంటి వ్య‌క్తులు మ‌రెన్నో దేశాల‌లో దేశాధిప‌తులు మ‌రియు ప్ర‌భుత్వ అధినేత‌లుగా కూడా ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు.

గ‌త మూడు నాలుగు సంవ‌త్స‌రాలుగా భార‌త‌దేశం ప‌ట్ల ప్ర‌భుత్వ అభిప్రాయం మారిపోయిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు. భార‌త‌దేశం త‌న‌ను తాను మార్పు చేసుకొంటూ ఉండ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం యొక్క ఆశ‌లు మ‌రియు ఆకాంక్ష‌లు ఇదివ‌ర‌కు ఎన్న‌డూ లేనంత ఉన్న‌త స్థాయికి చేరుకొన్నాయి అని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క రంగంలో తిప్పివేయ‌డానికి వీలుగాని ప‌రివ‌ర్త‌న సంకేతాలు క‌నిపిస్తున్నట్లు ఆయ‌న చెప్పారు.

పిఐఒ లు వారు ఎక్క‌డ నివ‌సిస్తున్న‌ప్ప‌టికీ భార‌త‌దేశ శాశ్వ‌త రాయ‌బారుల వంటి వారు అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. తాను విదేశాల‌కు వెళ్ళిన‌ప్పుడ‌ల్లా వారిని క‌లుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తుంటాన‌ని ఆయ‌న వివ‌రించారు.

విదేశాల‌లో భార‌తీయ పౌరులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ‌మ‌తి సుష్మ స్వ‌రాజ్ త‌దేక దృష్టిని సారిస్తున్నారంటూ ఆమెను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా దౌత్య కార్యాల‌యాల తాలూకు ఇక్క‌ట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించ‌డానికి మ‌రియు ప్ర‌తిస్పందించ‌డానికి ‘‘మ‌ద‌ద్‌’’ (MADAD) పోర్ట‌ల్ ను అందుబాటులోకి తెచ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

ప్ర‌వాస భార‌తీయులు (ఎన్ఆర్ఐ లు) భార‌తదేశ అభివృద్ధిలో భాగ‌స్వాములు అని ప్ర‌భుత్వం న‌మ్ముతున్నట్లు ప్ర‌ధాన మంత్రి వివరించారు. నీతి ఆయోగ్ రూపొందించిన యాక్ష‌న్ అజెండా టిల్ 2020 లో ఎన్ఆర్ఐ ల‌కు ఒక ముఖ్య‌ స్థానం ఉన్నట్లు ఆయ‌న తెలిపారు.

అస్థిర‌త్వ యుగంలో యావ‌త్ ప్ర‌పంచానికి భార‌తీయ నాగ‌ర‌క‌త విలువ‌లు మ‌రియు భారతీయ సంస్కృతి మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని అందిచ‌గ‌లవని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఆసియాన్ దేశాల‌తో అత్యంత స‌న్నిహిత సంబంధాల‌ను భార‌త‌దేశం క‌లిగివున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి చెబుతూ, ఈ సంబంధాల‌ను నేటి నుండి కొద్ది రోజుల లోప‌ల రాబోయే గ‌ణ‌తంత్ర దినం నాడు క‌ళ్ళ‌కు క‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Domestic air passenger traffic to rise by 3-6 pc in this fiscal: ICRA

Media Coverage

Domestic air passenger traffic to rise by 3-6 pc in this fiscal: ICRA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జూలై 2026
July 24, 2026

Aatmanirbhar in Action — Space, Missiles, EVs & Livelihoods Under PM Modi’s Watch