షేర్ చేయండి
 
Comments
భూమి పునరుద్ధరణతో సహా పలు యాప్ ల కోసం రిమోట్ సెన్సింగ్ మరియు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో భారతదేశం గర్విస్తుంది: ప్రధాని మోదీ
ప్రతి చుక్కతో ఎక్కువ పంట పండించడం అనే నినాదంతో మేము పని చేస్తున్నాము. అదే సమయంలో, మేము జీరో బడ్జెట్ సహజ వ్యవసాయంపై కూడా దృష్టి పెడుతున్నాము: ప్రధాని మోదీ
ముందుకు వెళితే, వాతావరణ మార్పు, జీవవైవిధ్యం మరియు భూ క్షీణత సమస్యలను పరిష్కరించడంలో ఎక్కువ దక్షిణ-దక్షిణ సహకారం కోసం చొరవలను ప్రతిపాదించడం భారతదేశం సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయెడా లో ‘మరుభూమీకరణం పై పోరు కు కుదిరిన ఐ రా స
ఒప్పందం (యుఎన్ సిసిడి)లో చేరిన దేశాల 14వ సమ్మేళనం (సిఒపి 14) యొక్క ఉన్నత స్థాయి విభాగాన్ని’ ఉద్దేశించి ప్రసంగించారు.

 

రెండు సంవత్సరాల కాలాని కి యుఎన్ సిసిడి సహ అధ్యక్ష పదవి ని చేపట్టిన ఇండియా తమ పదవీ కాలం లో సమర్ధవంతం గా తోడ్పాటు ను అందించగలదని ప్రధాన మంత్రి తెలిపారు. అనాదిగా భారత భూమి కి ప్రాధాన్యమిస్తూ వస్తోందని, భారతీయ సంస్కృతి లో పృథ్వి ని పవిత్రం గా పరిగణించడం జరిగింది, దీని కి మాత స్థాయి ని ఇచ్చామని ఆయన అన్నారు.

“సారవంతమైన భూమి మరు భూమి గా మారడం ప్రభావం ప్రపంచం లో మూడింట రెండో వంతు దేశాల పై పడుతుందనే విషయం వింటే మీరు దిగ్బ్రాంతి చెందుతారు. ఒకవైపు భూ పరిరక్షణ చర్యల తో పాటు మరొక వైపు ప్రపంచం ఎదుర్కొంటున్న జల సంక్షోబాన్ని కూడా పరిష్కరించవలసి ఉంటుంది. ఎందుకంటే మనం భ్రష్టు పట్టిన భూముల సమస్య ను గురించి చర్య లు తీసుకునేటప్పుడు నీటి ఎద్దడి ని కూడా పట్టించుకోవాలి. నీటి సరఫరా ను పెంచడం, నీటి ని రీచార్జి చేయడం, నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం, భూమి లో తేమ ను కాపాడడం వంటి చర్యల ద్వారా భూ వినియోగాని కి, జల వినియోగాని కి సంబంధించి సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలి. యుఎన్ సిసిడి భూసార పరిరక్షణ వ్యూహాని కి ప్రపంచ జల కార్యాచరణ కేంద్ర బిందువు” అని ప్రధాన మంత్రి అన్నారు.

“ఐ రా స నేతృత్వం లో పర్యావరణ పరిరక్షణ పై జరిగిన పారిస్ సిఒపి సందర్భం గా భారతదేశం సమర్పించిన సూచకాలు నాకు ఈరోజు గుర్తు కు వస్తున్నాయి. భూమి, నీరు, గాలి, చెట్లు తదితర జీవజాలం మధ్య ఆరోగ్యకర సమతుల్యత ను సాధించడం లో భారతదేశం సాంస్కృతిక మూలాల ను గురించి పారిస్ మహాసభ లో చేసిన సూచనల లో నొక్కి చెప్పడం జరిగింది. భారతదేశం లో మొక్కలు, వృక్షాల విస్తీర్ణాన్ని పెంచగలిగామనే సంగతి మీకు సంతోషాన్ని కలిగించవచ్చు. 2015 నుండి 2017 మధ్యకాలం లో చెట్లు, అడవుల విస్తీర్ణం 0.8 మిలియన్ హెక్టేర్లు పెరిగింది” అని ప్రధాన మంత్రి తెలిపారు.

వివిధ చర్యల ద్వారా పంట దిగుబడి ని పెంచి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రధాన మంత్రి వెల్లడించారు. వాటి లో భూ పునరుద్ధరణ, సూక్ష్మ సేద్యం ల వంటివి భాగం గా ఉన్నాయి. ప్రతి నీటి బిందువు తో ఎక్కువ పంట అనే లక్ష్యం తో మేము పనిచేస్తున్నాము. అదే కాలం లో జీవామృతం వంటి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తున్నాము. జల సంబంధ ముఖ్యమైన సమస్యలు అన్నింటి ని సంపూర్ణం గా పరిష్కరించడానికి మేము జల శక్తి మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేశాము. ఒకసారే వాడి పారవేసే ప్లాస్టిక్ వాడకాన్ని రానున్న సంవత్సరాల లో భారతదేశం తగ్గించనుంది.

“మిత్రులారా, మానవుల సాధికారిత కు పర్యావరణ స్థితిగతులతో సన్నిహిత సంబంధం ఉంటుంది. జల వనరుల పెంపు గాని లేక ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం గాని నడవడి లో మార్పు పై ఆధారపడివుంటాయి. సమాజం లోని అన్ని వర్గాలు ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలను సాధించగలుగుతాము. మనం అనేక రకాల ఆకృతుల కు రూపకల్పన చేసినప్పటికీ వాస్తవం గా కార్యక్షేత్రం లో కలసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే మార్పు చూడగలుగుతాము. భారతదేశం లో చేపట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమం లో అన్ని వర్గాలు పాల్గొని పారిశుద్ధ్యాన్ని చేపట్టి పరిశుభ్రత ను పెంచడం జరిగింది. 2014వ సంవత్సరం లో 38 శాతం ఉన్న పారిశుద్ధ్య పనులు ఇప్పుడు 99 శాతానికి పెరిగాయి.”

 

 

ప్రపంచ భూ అజెండా కు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. “భూసార పరిరక్షణ, భూమి సమతుల్యత కాపాడేందుకు భారతదేశం చేపట్టి విజయం సాధించిన చర్యల ను, వ్యూహాల ను అవగాహన చేసుకొని అవలంభించ దలచిన దేశాల కు భారతదేశం తోడ్పాటు ను అందిస్తుందని నేను ప్రకటిస్తున్నాను. భారతదేశం లో బంజరు భూమి ని సాగుకు యోగ్యం గా మార్చే ప్రక్రియ ను ఇప్పుడు ఉన్న 21 మిలియన్ హెక్టేర్ల స్థాయి నుండి 2030వ సంవత్సరం కల్లా 26 మిలియన్ హెక్టేర్ల కు పెంచాలనే బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నట్లు ఈ సందర్భం గా ప్రకటిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

భూసార క్షీణత కు సంబంధించిన సమస్యల ను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాస్త్రీయ పద్ధతుల లో అభివృద్ధి చేసేందుకు భారత అడవుల పరిశోధన విద్యా మండలి లో సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. అది అభివృద్ధి చెందుతున్న దేశాలు భూసార క్షీణత కు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని, సాంకేతికత ను, మానవ వనరుల శిక్షణ తదితర విధాల సహకారాన్ని అందజేస్తుంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ओम्द्यौःशान्तिः, अन्तरिक्षं शान्तिः అనే శ్లోకాన్ని ప్రస్తావించి తన ప్రసంగాన్ని ముగించారు. శాంతి పదాని కి అర్థం కేవలం ప్రశాంతత మాత్రమే కాదు, లేదా హింస- ప్రతీకారాన్ని కలిగివుండటం అనే కాదు, అది ఇక్కడ సమృద్ధి అనే భావాన్ని సూచిస్తోంది. ప్రతి వస్తువు కు ఒక ఉద్దేశ్యం ఉంటుంది. మరి ప్రతి ఒక్కదాని కి ఆ ఉద్దేశ్యాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. అటువంటి ఉద్దేశ్యాన్ని పూర్తి చేయడం కూడాను సమృద్ధే అవుతుంది. ఈ అర్థం లోనే ఆకాశం, స్వర్గం మరియు అంతరిక్షం యొక్క సమృద్ధి సిద్ధించగలుగుతుంది.

Click here to read full text speech

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India breaks into the top 10 list of agri produce exporters

Media Coverage

India breaks into the top 10 list of agri produce exporters
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 జూలై 2021
July 23, 2021
షేర్ చేయండి
 
Comments

Prime Minister Narendra Modi wished Japan PM Yoshihide Suga ahead of the Tokyo Olympics opening ceremony

Modi govt committed to welfare of poor and Atmanirbhar Bharat