ఈద్-ఉల్-ఫితర్ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ,
"ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భం మన సమాజంలో ఐక్యత, సోదర భావాన్ని పెంపొందించాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి.”, అని ఆకాంక్షించారు.
Best wishes on Eid-ul-Fitr. May this auspicious occasion enhance the spirit of togetherness and brotherhood in our society. May everyone be blessed with good health and prosperity.
— Narendra Modi (@narendramodi) May 2, 2022