PM Modi extends New Year greetings to citizens across the Nation
People across India are celebrating the start of New Year. New Year greetings to everyone. May the year bring peace, joy & prosperity: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశమంతటా నూతన సంవత్సరాది పండుగను జరుపుకొంటున్న పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికీ ఈ నూతన సంవత్సరం శాంతిని, సంతోషాన్ని, సమృద్ధిని ప్రసాదించుగాక అంటూ ప్రధాన మంత్రి ట్విటర్ లో రాసిన వరుస ట్వీట్ లలో తన అంతరంగ భావనలను పంచుకొన్నారు.

“భారతదేశం అంతటా ప్రజలు నూతన సంవత్సర ఆరంభాన్ని వేడుకగా జరుపుకొంటున్నారు. ప్రతి ఒక్కరికీ ఇవే నా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శాంతిని, సంతోషాన్ని, సమృద్ధిని ప్రసాదించుగాక.

దేశ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు నవరాత్రి సందర్భంగా శత కోటి శుభాభినందనలు. నూతన సంవత్సరం సమృద్ధిని, ప్రసన్నతను, ఇంకా మంచి ఆరోగ్యాన్ని మన అందరి జీవితాలలోకీ తీసుకురావాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

మణిపూర్ లోని నా సోదర, సోదరీమణులకు సాజిబు చీరావ్ బా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీకు ఉల్లాసాన్ని, సామరస్యాన్ని పంచుగాక.

మంగళప్రదమైన నవ్ రేహ్ సందర్భంగా, ఈ పండుగను జరుపుకొంటున్న ప్రతి ఒక్కరికీ ఇవే నా శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం సానుకూల భావనలకు, చక్కని ఆరోగ్యానికి ఒక ప్రతీకగా ఉండు గాక.

ఉగాది పండుగను జరుపుకొంటున్న వారందరికీ ఆ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీ అందరి అభిలాషలను నెరవేర్చు గాక; ఎల్లెడెలా సంతోషం వర్ధిల్లు గాక.

సింధీ సముదాయానికి చేటీ చాంద్ శుభాకాంక్షలు. ప్రభువు ఝూలే లాల్ మనందరినీ ఆశీర్వదించు గాక; కొత్త సంవత్సరం సంతోషభరితంగాను, స్మరణీయమైందిగాను ఉండు గాక.


గుడి పాడ్వా ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని, మహారాష్ట్ర ప్రజలకు ఇవే నా శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సంతోషాన్ని, చక్కని ఆరోగ్యాన్ని, సమృద్ధిని ప్రసాదించు గాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre launches Bhavya scheme to set up 100 industrial parks across country

Media Coverage

Centre launches Bhavya scheme to set up 100 industrial parks across country
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 మే 2026
May 24, 2026

Strength, Growth & Global Trust: How PM Modi is Transforming India Across Frontiers