జిఎస్ఎటి-29 ఉపగ్రహ వాహక నౌక జిఎస్ఎల్‌వి ఎంకె III-డి2 ప్రయోగం సఫలం కావడం పట్ల ఐఎస్ఆర్ఒ (‘ఇస్రో’) శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
“జిఎస్ఎటి-29 ఉపగ్రహాన్ని వాహక నౌక జిఎస్ఎల్‌వి ఎంకె III-డి2 ద్వారా ప్రయోగించడంలో విజయం సాధించిన మన శాస్త్రవేత్తల కు ఇవే నా హృదయ పూర్వక అభినందనలు. ఈ రెండు విధాలైన సాఫల్యం తో అత్యంత భారీ ఉపగ్రహాన్ని ఒక భారతీయ వాహక నౌక ద్వారా కక్ష్య లోకి ప్రవేశ పెట్టడం లో ఒక నూతనమైన రికార్డు ను నెలకొల్పడం జరిగింది.
ఈ ఉపగ్రహం కమ్యూనికేశన్ సేవలను, ఇంటర్ నెట్ సేవల ను మన దేశం లోని సుదూర ప్రాంతాల కు సైతం అందించగలుగుతుంది” అని ప్రధాన మంత్రి తన సందేశం లో పేర్కొన్నారు.
My heartiest congratulations to our scientists on the successful launch of GSLV MK III-D2 carrying GSAT-29 satellite. The double success sets a new record of putting the heaviest satellite in orbit by an Indian launch vehicle. @isro
— Narendra Modi (@narendramodi) November 14, 2018
The satellite will provide communication and internet services to the remotest corners of our country. @isro
— Narendra Modi (@narendramodi) November 14, 2018


