Ustad Hussain Sayeeduddin Dagar’s contribution to Hindustani classical music will be remembered for generations: PM
People across India & the world were enthralled by the music of Ustad Hussain Sayeeduddin Dagar, an inspiration for music enthusiasts: PM

ప్రముఖ హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ హుస్సేన్ సయీదుద్దీన్ డగర్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

‘‘ఉస్తాద్ హుస్సేన్ సయీదుద్దీన్ డగర్ మరణం దు:ఖం కలిగిస్తోంది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతానికి ఆయన చేసిన సేవలు తరాల తరబడి స్మరించుకోదగినవి.

ఉస్తాద్ హుస్సేన్ సయీదుద్దీన్ డగర్ సంగీతం భారతదేశంలోని వారినే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రజల మనస్సును ఆకట్టుకొంది. సంగీతం పట్ల ఉత్సుకత కలిగినవారికి ఆయన ఒక ప్రేరణగా నిలుస్తారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India can be a massive architect in AI: Economist Danny Quah

Media Coverage

India can be a massive architect in AI: Economist Danny Quah
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి విజయాన్ని అందిస్తాయని చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
April 30, 2026

ఉత్సుకత, సకారాత్మక శక్తి... ఇవి మనుషులకు ఎప్పటికీ చురుకుగా ఉండే స్ఫూర్తిని ఇస్తాయని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
పొంగిపొరలే ఈ ఉత్సుకతే ఏ పనిని అయినా సరే, పూర్తి చేయడంలో మనిషికి విజయాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘కర్మశీలురు, శక్తిమంతులైన దేశ ప్రజలే  అన్నింటి కన్న పెద్ద శక్తి  ఏ దేశానికైనా. వారి కృషితోనే అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వారి ప్రయత్నాలతో దేశం సమృద్ధిని, స్వయంసమృద్ధిని, ప్రగతి శిఖరాన్ని అందుకొంటుంది.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః
కరోతి సఫలం జన్తోః కర్మ యచ్చ కరోతి సః’’ అని పేర్కొన్నారు.
ఉత్సాహం, సకారాత్మక శక్తి మనుషులను వారి పనులలో నిరంతరం చురుకుగా ఉండేటట్లు ప్రేరణను అందిస్తాయి. పొంగి పొర్లుతూ ఉండే ఈ ఉత్సాహమే... మనిషి పూర్తి చేయాలనుకునే  ఏ పనిలోనైనా సాఫల్యాన్ని అందిస్తుందని  ఈ సుభాషితం బోధిస్తోంది.