PM meets Indologisis, Hindi language students and Indian community in Tashkent
PM witnesses cultural programme, emphasises on cultural ties
People to people ties are very important: PM

On the morning on 7th July 2015 the PM had an interaction with Indologists, Hindi language students and Indian community in Tashkent.

The PM spoke about the bond between India and Uzbekistan and appreciated the cultural programme. He emphasised on people to people ties.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s jewellery exports rise 2.4% to $9.17 billion; studded gold emerges as bright spot

Media Coverage

India’s jewellery exports rise 2.4% to $9.17 billion; studded gold emerges as bright spot
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని కొనియాడిన ప్రధానమంత్రి
August 14, 2026
పట్టుదలతో కూడిన శ్రమ, మానవ ప్రయత్నాల శక్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న పీఎం

పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా దేశ విభజన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరి ధైర్యసాహసాలను స్మరించుకుంటున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విభజన చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నభిన్నం చేసిందని, కుటుంబాలు చెల్లాచెదురయ్యాయని, ఎంతోమంది ప్రియమైన వారిని కోల్పోయారని, చెప్పలేనంత బాధను అనుభవించాల్సి వచ్చిందన్నారు.

కష్టాలను అధిగమించి ప్రజలు, వారి జీవితాలను పునర్మించుకున్నారని, ప్రతికూల పరిస్థితులను విజయంగా మలచుకుంటూ దేశ పురోగతికి తోడ్పాటునందించారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సంకల్ప బలం ఎంత గొప్పదో వారి జీవిత ప్రయాణాలు మనకు తెలియజేస్తాయన్నారు. దేశంలో ఐక్యతను, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించుకోవాలన్న సంకల్పాన్ని ఈ రోజు మరింత బలపరుస్తుందని… వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టి కృషి చేసేలా స్ఫూర్తినిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి దేశ పురోగతికి కృషి చేసిన వారందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక నివాళులు అర్పించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో లక్ష్యాలను సాధించవచ్చని వారి ధైర్యసాహసాలు, సామర్థ్యాలు నిరూపించాయని పేర్కొన్నారు. దేశ సద్భావన, ఐక్యతా స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఒక సుభాషితాన్ని ప్రస్తావిస్తూ.. శ్రమ, పట్టుదల, అంకితభావంతో కూడిన ప్రయత్నాల వల్లే వివిధ కళలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక నైపుణ్యాలు, హస్తకళలు, నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, ఇవి విజయానికి బాటలు వేస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కేవలం అదృష్టాన్ని నమ్ముకుని ఉండిపోకుండా… ధైర్యం, శ్రమ శక్తి, నిరంతర ప్రయత్నాలతో స్థిరంగా గమ్యం దిశగా సాగాలని తెలిపారు. మానవ ప్రయత్నాలే భవితవ్యాన్ని నిర్ణయిస్తాయన్నారు.

సామాజిక మాధ్యమం "ఎక్స్" వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"ఇవాళ మనం పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే నిర్వహిస్తున్నాం. దేశ విభజన వల్ల ప్రభావితమైన వారి ధైర్యసాహసాలను ఈ సందర్భంగా స్మరించుకుందాం. విభజన వల్ల ఎన్నో జీవితాలు చిన్నాభిన్నమై.. మరెన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ప్రియమైన వారిని కోల్పోయారు. ఎంతో వేదనను అనుభవించారు.

అదే సమయంలో ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించి ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. కష్టాలను విజయాలుగా మలచుకున్నారు. దేశ పురోగతికి ఎంతో కృషి చేశారు. వారి జీవిత ప్రయాణాలు సంకల్పబలాన్ని గుర్తుచేస్తాయి.

దేశంలో ఐక్యతను, సౌభ్రాతృత్వానని పరిరక్షించుకోవాలన్న సంకల్పాన్ని ఈ రోజు మరింత బలపరుస్తుందని… వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టి కృషి చేసేలా స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నా"

"పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడి దేశ ప్రగతికి అమూల్యమైన సేవలందించిన దేశవాసులందరికీ హృదయపూర్వక నివాళులు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యసాహసాలతో సంకల్ప బలం గొప్పతనాన్ని నిరూపించారు.

"विभाजन विभीषिका स्मृति दिवस पर उन सभी देशवासियों का हृदय से नमन, जिन्होंने उस वीभत्स दौर से निकलकर देश की प्रगति में अमूल्य योगदान दिया। उन्होंने अपने साहस और सामर्थ्य से दिखाया कि कैसे विपरीत परिस्थितियों में भी संकल्पों को सिद्ध किया जाता है। आइए, सद्भावना और एकजुटता की राष्ट्रीय भावना को और सशक्त करें।

उद्यमस्य प्रसादेन दृश्यन्ते विविधाः कलाः।
कातरा एव जल्पन्ति यद् भाव्यं तद् भविष्यति॥”

It is through hard work, enterprise and dedicated effort that diverse arts, science, technological skills, craftsmanship and innovations flourish, paving the way for success. Therefore, one should not remain dependent on fate; rather, one should move steadily towards one's goals with courage, diligence and persistent effort, for it is human endeavor that shapes destiny.