• 700 కి.మీ. ఆరావళి శ్రేణిలో వనాలను పెంచడానికి ఉద్దేశించిన ‘అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టు’లో భాగంగా మొక్కలు నాటనున్న ప్రధానమంత్రి
• ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన సుస్థిర రవాణా కార్యక్రమంలో భాగంగా 200 విద్యుత్తు బస్సులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, గురువారం (జూన్ 5న) ఉదయం 10.15 గంటలకు న్యూఢిల్లీ లోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో చేపట్టే మొక్కల పెంపకం కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించనున్నారు. పర్యావరణ సంరక్షణ, హరిత ప్రధాన రవాణా సదుపాయాలు .. వీటి పట్ల భారత్ నిబద్దతను ప్రధాని పునరుద్ఘాటించనున్నారు.

‘ఏక్ పేడ్ మాకే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాం) కార్యక్రమంలో భాగంగా ఒక మర్రి మొక్కను ప్రధాని నాటి, దానికి నీళ్లు పోస్తారు. ‘అరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టు’లో ఈ కార్యక్రమం ఒక భాగం కానుంది. 700 కి.మీ. పొడవున అలరారుతున్న అరావళీ పర్వత శ్రేణిని తిరిగి వనాలతో కళకళలాడేటట్టు చేయాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

ఈ ప్రాజెక్టు ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాలతో పాటు గుజరాత్ సహా నాలుగు రాష్ట్రాలలో 29 జిల్లాల్లో అరావళీ పర్వత శ్రేణి చుట్టుపక్కల 5 కి.మీ. బఫర్ ఏరియాలో పచ్చదనాన్ని విస్తరించే ఒక ప్రముఖ కార్యక్రమం. వనాలను పెంచడం, పునర్వనీకరణ, జల వనరుల పునరుద్ధరణ మార్గాలను అనుసరిస్తూ, అరావళీలో జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాంతంలో నేల సారాన్ని, జల లభ్యతను, వాతావరణ ఆటుపోట్లను తట్టుకొనే స్థితినీ మెరుగుపరచడం కూడా ఈ ప్రాజెక్టు మరో ఉద్దేశం. ఈ ప్రాజెక్టు స్థానిక సముదాయాలకు ఉపాధి కల్పన, ఆదాయార్జన అవకాశాలను కల్పించి వారికి మేలు చేయనుంది.

ఢిల్లీ ప్రభుత్వం అమలుపరుస్తున్న సుస్థిరత ప్రాతిపదిక ప్రధానమైన రవాణా కార్యక్రమంలో భాగంగా 200 విద్యుత్తు బస్సులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఇది పట్టణ ప్రాంతంలో స్వచ్ఛత ప్రధానమైన రాకపోకలకు ప్రోత్సాహాన్ని అందించడం ఒక్కటే కాకుండా పర్యావరణ సమతుల్యత విషయంలో దేశ ప్రజల సామూహిక బాధ్యతకు కూడా సంకేతంగా నిలవనుంది.‌

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Shortcuts will cut you short’: PM Modi’s message for youngsters at former President Kovind’s autobiography launch

Media Coverage

‘Shortcuts will cut you short’: PM Modi’s message for youngsters at former President Kovind’s autobiography launch
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 ఆగష్టు 2026
August 13, 2026

Aatmanirbhar in Motion: Solar Homes, Made-in-India Containers, Record Exports & a Rising Global Footprint Under the Leadership of PM Modi