భారత్‌లో చైతన్యం తొణికిసలాడుతున్న అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ సభ్యులతో మాటామంతీ జరపనున్న ప్రధాని
తమ అనుభవంలోని ముఖ్యాంశాల్ని పంచుకోనున్న ఎంపిక చేసిన అంకుర సంస్థల ప్రతినిధులు

స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేయడం మొదలుపెట్టి పది సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తుగా 2026 జనవరి 16న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అదే రోజు.. జాతీయ అంకుర సంస్థల దినం కూడా.

ఈ కార్యక్రమంలో.. భారత్‌లోని చైతన్యవంత అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ సభ్యులతో ప్రధానమంత్రి మాట్లాడతారు. ఎంపిక చేసిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవ ముఖ్యాంశాల్ని పంచుకుంటారు. ఆహ్వానితులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

స్టార్టప్ ఇండియాను ప్రధానమంత్రి 2016 జనవరి 16న ప్రారంభించారు. మార్పును తీసుకువచ్చే జాతీయ కార్యక్రమంగా దీనిని చేపట్టారు. ఉద్యోగాలు కావాలని కోరుకొనే వారి దేశంగా కన్నా, ఉద్యోగాల్ని ఇచ్చే వారి దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంతో పాటు నవకల్పనను ప్రోత్సహించడం, నవ పారిశ్రామికత్వాన్ని పెంపొందించడం, పెట్టుబడులు ఊతంగా నిలిచే అభివృద్ధి సాధన దిశగా ఇండియాను ముందుకు తీసుకు పోవడం స్టార్టప్ ఇండియా లక్ష్యాలు.

గత పదేళ్లుగా, దేశ ఆర్థిక, నవకల్పన స్వరూపంలో ఓ కీలక స్థానాన్ని స్టార్టప్ ఇండియా పొందింది. సంస్థాగత యంత్రాంగాల్ని పటిష్ఠపరిచింది. పెట్టుబడితో పాటు మార్గదర్శకత్వం పరిధిని విస్తరించింది. అంకుర సంస్థలు అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో వర్ధిల్లేందుకు, విస్తరించేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పరిచింది. ఈ దశాబ్ద కాలంలో దేశ అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థలో గొప్ప విస్తరణ చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా అంకుర సంస్థలకు గుర్తింపును ఇచ్చారు. ఈ వాణిస్య సంస్థలు ఉపాధిని కల్పించడంలో, నవకల్పన ఊతంగా ఆర్థికాభివృద్ధి చోటుచేసుకొనేటట్లు చూడటంలో, వేర్వేరు రంగాల్లో దేశీయ సరఫరా వ్యవస్థల్ని బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Infra spend up six-fold since 2014, crosses Rs 12 lakh crore: PM Modi

Media Coverage

Infra spend up six-fold since 2014, crosses Rs 12 lakh crore: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 ఏప్రిల్ 2026
April 15, 2026

From Temples to Turbines: PM Modi’s Blueprint for a Culturally Rooted, Economically Explosive Viksit Bharat