ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ నీరజ్ చోప్రా, ఆయన భార్య శ్రీమతి హిమానీ మోర్ ఈ రోజు న్యూఢిల్లీలో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో సమావేశమయ్యారు. ‘‘మేం క్రీడలు సహా, అనేక అంశాలపై ఎంతో చక్కగా మాట్లాడుకున్నాం’’ అని శ్రీ మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో -
‘‘ఈ రోజు నీరజ్ చోప్రాతో, ఆయన భార్య హిమానీ మోర్‌తో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో భేటీ అయ్యాను. మేం క్రీడలు సహా, అనేక అంశాలపై ఎంతో చక్కగా మాట్లాడుకున్నాం.
@Neeraj_chopra1’’ అని పేర్కొన్నారు.
Met Neeraj Chopra and his wife, Himani Mor at 7, Lok Kalyan Marg earlier today. We had a great interaction on various issues including sports of course!@Neeraj_chopra1 pic.twitter.com/YYQjV324aV
— Narendra Modi (@narendramodi) December 23, 2025


