భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు గౌరవ మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాం గూలం భారత్‌లో అధికారికంగా పర్యటించారు. విస్తృత శ్రేణి ద్వైపాక్షిక అంశాలపై ప్రధానమంత్రులిద్దరూ ఫలవంతంగా చర్చించారు. మారిషస్ ప్రభుత్వ అభ్యర్థనల ఆధారంగా.. భారత్, మారిషస్ సంయుక్తంగా కింది ప్రాజెక్టుల అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి.

గ్రాంట్ ప్రాతిపదికన చేపట్టాల్సిన ప్రాజెక్టులు/సాయం:

I. కొత్త సర్ సీవూసగూర్ రాంగూలం నేషనల్ హాస్పిటల్.

II. ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.

III. పశువైద్య పాఠశాల, జంతువుల ఆస్పత్రి.

IV. హెలికాప్టర్ల ఏర్పాటు.

ఈ ప్రాజెక్టులు, అభ్యర్థించిన సాయం కోసం దాదాపు 215 మిలియన్ డాలర్లు (9.80 బిలియన్ల మారిషస్ రూపాయలు) ఖర్చు అవుతాయని అంచనా.

గ్రాంట్-కమ్-ఎల్ఓసీ ప్రాతిపదికన చేపట్టాల్సిన ప్రాజెక్టులు/ అందించాల్సిన సాయం

I. ఎస్ఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఏటీసీ టవర్ నిర్మాణ పనులను పూర్తి చేయడం.

II. ఎం-4 మోటార్ వే అభివృద్ధి.

III. రెండో దశ రింగ్ రోడ్డు అభివృద్ధి.

IV. సీహెచ్‌సీఎల్ ద్వారా పోర్ట్ పరికరాల కొనుగోలు.

ఈ ప్రాజెక్టులు/సాయం అంచనా వ్యయం దాదాపు 440 మిలియన్ డాలర్లు/ 20.10 బిలియన్ల మారిషస్ రూపాయలు.

2. వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఇరు పక్షాలు కింది అంశాలపై సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి:

I. మారిషస్‌లో ఓడరేవు పునరభివృద్ధి, పునర్నిర్మాణం;

II. చాగోస్ సముద్ర రక్షిత ప్రాంత అభివృద్ధి, నిఘాలో సాయం.


3. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం 25 మిలియన్ డాలర్ల బడ్జెట్ సాయాన్ని అందించడంపైనా సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi