‘‘సర్దార్ పటేల్ మనకు అఖండ భారతాన్ని ఇచ్చారు’’ అని 2016వ సంవత్సరం అక్టోబరు 31వ తేదీ న ‘‘ఒకే భారతం – శ్రేష్ఠ భారతం’’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఇక శ్రేష్ఠ భారతాన్ని రూపొందించడం 125 కోట్ల మంది భారతీయుల సమష్టి కర్తవ్యం’’ అని కూడా నిర్దేశించారు. భారత ప్రధాన మంత్రి గా బాధ్యతల ను స్వీకరించడానికి ముందు కూడా నరేంద్ర మోదీకి మార్గనిర్దేశం చేసింది ఈ సూత్రమే.

మన ప్రియ భారత ఐక్యత, భద్రత, సార్వభౌమత్వం, ప్రగతి కోసం సర్వస్వం త్యాగం చేసిన జాతీయ నాయకుల ను గౌరవించడం ఒక బాధ్యత గా భావిస్తారు. మన జాతీయాభిమానం, ఆత్మచైతన్యం లో మన చరిత్ర, వారసత్వాలు ఒక భాగం కావాలన్నది ఆయన ఆకాంక్ష.

దండి వద్ద నిర్మించిన జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకం ఇందుకు ఒక ఉదాహరణ. మహాత్మ గాంధీ నాయకత్వం లో 1930వ సంవత్సరం లో సాగిన దండి యాత్ర శక్తి ని, ఆయన ను అనుసరించిన 80 మంది సత్యాగ్రహుల పోరాట స్ఫూర్తి ని ఈ స్మారకం సగౌరవం గా చాటుతుంది.

సర్దార్ పటేల్ నిలువెత్తు నిబ్బరాని కి ప్రతీక గా నిలచే 182 మీటర్ల ఐక్యత విగ్రహం ఆయన సమున్నత వ్యక్తిత్వాన్ని చాటుతూ జాతి నేతల కు ఇస్తున్న గౌరవాని కి తిరుగు లేని ఉదాహరణ గా నిలుస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లోనే ప్రపంచం లో అత్యంత ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని నిర్మించాలని శ్రీ నరేంద్ర మోదీ తొలుత స్వప్నించారు. ఈ విగ్రహం దేశాన్ని ఏకీకృతం చేసిన ‘భారతదేశపు ఉక్కు మనిషి’కి నివాళి మాత్రమే కాకుండా భారతీయులు అందరి కి అత్యంత గర్వకారణమైన స్మారకం కూడా.

 

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జీవిత విశేషాల కు సంబంధించిన ఫైళ్ల ను రహస్య పత్రాల జాబితా లో నుండి తప్పించి బహిర్గతం చేయాలని ఆయన కుటుంబం దశాబ్దాలు గా డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే, వరుసగా ఏర్పడిన ప్రభుత్వాలు దీనిపై గట్టి నిర్ణయాన్ని తీసుకోవడానికి తిరస్కరించాయి. నేతాజీ కుటుంబం లోని సభ్యులందరికీ శ్రీ నరేంద్ర మోదీ తన నివాసం లో 2015వ సంవత్సరం అక్టోబరు లో ఆతిథ్యం ఇచ్చే నాటి పరిస్థితి ఇది. ‘‘చరిత్ర గొంతు నొక్కివేయడం పై నాకెలాంటి కారణం కనిపించడంలేదు’’ అని ఈ సందర్భం గా ఆయన చెప్పారు. చరిత్ర ను మరచిపోయే వారు దాన్ని సృష్టించే శక్తి ని కూడా కోల్పోతారని వ్యాఖ్యానించారు. అదే క్షణం లో నేతాజీ కుటుంబం కోరినట్లు ఆయన కు సంబంధించిన ఫైళ్లను రహస్య జాబితా నుండి తొలగించి డిజిటల్ వేదిక పై ప్రజలందరికీ బహిరంగపరిచారు.

 

ఎర్ర కోట వద్ద 1940వ దశకం మధ్య లో ఐఎన్ ఎ ట్రయల్స్ దేశాన్ని కుదుపేశాయి. అయితే, నాటి ఉద్యమ సమావేశం నిర్వహించిన ఆ కట్టడం ఎర్ర కోట భవన సముదాయం లోపలి భాగానికే పరిమితమైంది. ఈ ఏడాది సుభాష్ బోస్ జయంతి నేపథ్యం లో ప్రధాన మంత్రి ఇదే భవనం లో ఒక ప్రదర్శనశాల ను ప్రారంభించి దాన్ని నేతాజీ కి, భారత జాతీయ సైన్యాని కి అంకితమిచ్చారు. ఇప్పుడది ఇక్కడి నాలుగు ప్రదర్శనశాల ల సముదాయమైన ‘‘క్రాంతి మందిర్’’లో ఒక భాగం అయింది. అలాగే 1857వ సంవత్సరపు తొలి స్వాతంత్ర్య పోరాటం, జలియన్ వాలాబాగ్ ఊచకోత కు అంకితమిచ్చిన ప్రదర్శనశాల కూడా ఈ సముదాయం లోనే ఉన్నాయి.

 

విపత్తు ప్రతిస్పందన కార్యకలాపాల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది ని సత్కరించేందుకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేరిట ఒక పురస్కారాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

 

గడచిన నాలుగు సంవత్సరాల లో మన చరిత్ర కు వన్నెతెచ్చిన పలువురు గొప్ప నాయకుల త్యాగాల ను స్మరించుకుంటూ అనేక ఇతర స్మారకాలు కూడా నిర్మించబడ్డాయి.


శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన లక్ష్యాలలో బాబాసాహెబ్ భీం రావ్ ఆంబేడ్ కర్ జ్ఞాపకార్థం ఐదు స్మారకాలను ‘పంచతీర్థాలు’గా తీర్చిదిద్దాలన్నది కూడా ఒకటి. బాబాసాహెబ్ జన్మించిన మౌ, బ్రిటన్ లో విద్యాభ్యాసం సందర్భం గా లండన్ నగరం లో ఆయన బస చేసిన ప్రదేశం, నాగ్ పూర్ లోని దీక్షాభూమి, ఢిల్లీ లోని మహా పరినిర్వాణ్ స్థల్,

 

ముంబయి లోని చైత్యభూమి ఈ పంచతీర్థాల లో భాగంగా ఉన్నాయి.

 

శ్రీ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు కచ్ఛ్ ప్రాంతం లో శ్యాం జీ కృష్ణవర్మ కు స్మారకాన్ని ప్రారంభించారు.

హరియాణా లో గొప్ప సంఘ సంస్కర్త సర్ ఛోటూ రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

శివాజీ స్మారకం నిర్మాణాని కి అరేబియా సముద్రం లోని ముంబయి తీరం లో శంకుస్థాపన చేశారు.

ఢిల్లీ లో నేశనల్ సైన్స్ సెంటర్ లో సర్దార్ పటేల్ గ్యాలరీ ని ప్రధాన మంత్రి ప్రారంభించారు.

దేశ సేవలో తమ ప్రాణాల ను పణంగా పెట్టిన 33,000 మంది పోలీసు సిబ్బంది ధైర్యసాహసాలు, త్యాగాల కు నివాళి గా ఇటీవలే జాతీయ పోలీసు స్మారకాన్ని దేశానికి అంకితమిచ్చారు.

స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి యుద్ధాలు, వివిధ ఇతర విధులలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర సైనికుల ను స్మరించుకునేలా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని కొన్ని వారాల్లోనే ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. మనం నేడు మెరుగైన జీవితం గడపటం కోసం తమవంతుగా సర్వస్వాన్నీ ధారపోసిన వారి త్యాగాల కు ఈ స్మారకాలన్నీ ప్రతీకలు గా నిలుస్తాయి. ప్రస్తుత, భావి తరాల కు స్ఫూర్తి ప్రదాత లు వారే.

శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో నిర్మితమైన ఈ స్మారకాలు మన జాతీయత కు చిహ్నాలు గా నిలచిపోతాయి. మనలో పెంపొందాల్సిన ఐక్యత ను, జాతీయాభిమానాన్ని ఇనుమడింపజేసి, ప్రోది చేసేవి గా నిలుస్తాయి.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's $13 billion semiconductor mission: Boosting domestic chip manufacturing and design

Media Coverage

India's $13 billion semiconductor mission: Boosting domestic chip manufacturing and design
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 సెప్టెంబర్ 2026
September 08, 2026

Viksit Bharat, Many Engines: Defence, Diplomacy, Growth & Green Power Under PM Modi