ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తారొ కొనొ నేడు మర్యాద పూర్వకం గా సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ 2018వ సంవత్సరం అక్టోబరు లో జపాన్ ను సందర్శించిన అనంతరం గత కొన్ని నెలల్లో చేపట్టినటువంటి తరువాయి చర్యల ను ప్రధాన మంత్రి దృష్టి కి శ్రీ కొనొ తీసుకు వచ్చారు.

2018వ సంవత్సరం అక్టోబరు లో తన జపాన్ సందర్శన సఫలం కావడాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు; భారతదేశానికి, జపాన్ కు మధ్య స్పెశల్ స్ట్రటీజిక్ అండ్ గ్లోబల్ పార్ట్ నర్ శిప్ ను గాఢతరం చేసుకోవాలని ఉందంటూ ఆయన తన బలమైన నిబద్ధత ను మరొక సారి ఉద్ఘాటించారు.

ఈ సంవత్సరం లో జపాన్ లో జరుగనున్న తదుపరి విడత వార్షిక శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం భారతదేశం నిరీక్షిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.


