యోర్ ఎక్స్ లన్సి, అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో,

యోర్ మాజిస్టీ,

ఎక్స్ లన్సిజ్,


నమస్కారం.

మన భాగస్వామ్యం తన నాలుగో దశాబ్దం లోకి అడుగు పెడుతున్నది.

 

ఈ సందర్భం లో, ఇండియా-ఏశియాన్ సమిట్ అధ్యక్ష బాధ్యతల ను కలసి పంచుకొంటుండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది.

 

ఈ శిఖర సమ్మేళనాన్ని బ్రహ్మాండం గా నిర్వహిస్తున్నందుకు గాను అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో కు నేను మనసారా అభినందనల ను తెలియజేస్తూ, మరి ఆయన కు నా కృతజ్ఞతను సైతం తెలియజేస్తున్నాను.

ఏశియాన్ సమూహం యొక్క సమర్థ నాయకత్వాని కి గాను ఆయన కు అనేకానేక అభినందనల ను కూడా నేను తెలియజేస్తున్నాను.

కంబోడియా ప్రధాని గా ఇటీవలె పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు హిజ్ ఎక్స్ లన్సి శ్రీ హున్ మానెట్ కు నేను హృద‌యపూర్వక అభినందనల ను తెలియజేస్తున్నాను.

ఈ సమావేశాని కి పర్యవేక్షక హోదా లో విచ్చేసిన తిమోర్- లెస్తె ప్రధాని హిజ్ ఎక్స్ లన్సి శ్రీ సెనానా గుజ్ మావో కు కూడా నేను మన:పూర్వకం గా ఆహ్వానిస్తున్నాను


యోర్ మాజిస్టీఎక్స్ లన్సిజ్,


మన చరిత్ర మరియు భౌగోళికత్వం భారతదేశాన్ని మరియు ఏశియాన్ ను పెనవేస్తున్నాయి.

అలాగే ఉమ్మడి విలువ లు, ప్రాంతీయ ఏకత్వం, శాంతి, సమృద్ధి, ఇంకా బహుళ ధృవ ప్రపంచం పట్ల ఉమ్మడి విశ్వాసం మనల ను పరస్పరం పట్టి ఉంచుతున్నాయి.

భారతదేశం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలిసీ లో కేంద్రీయ స్తంభం ఏశియాన్ యే. ఏశియాన్ యొక్క కేంద్రీయత్వాన్ని, మరి ఇండో-పసిఫిక్ పట్ల ఏశియాన్ కు ఉన్న దృక్పథాన్ని భారతదేశం పూర్తి గా సమర్థిస్తున్నది.

 

కిందటి సంవత్సరం లో, మనం ఇండియా-ఏశియాన్ మైత్రి సంవత్సరాన్ని జరుపుకొన్నాం; మరి పరస్పర సంబంధాలకు ఒక ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ అనే రూపాన్ని ఇచ్చాం.

 

యోర్ మాజిస్టీఎక్స్ లన్సిజ్,


ప్రస్తుతం, ప్రపంచ అనిశ్చితుల వాతావరణం లో సైతం ప్రతి రంగం లోను, మన పరస్పర సహకారం నిరంతరాయం గా పురోగమిస్తున్నది.

ఇది మన సంబంధాల బలాని కి మరియు ఆటు పోటుల ను తట్టుకొని నిలబడడాని కి ప్రమాణం గా ఉన్నది.

'‘ఏశియాన్ మేటర్ స్: ఎపి సెంట్రమ్ ఆఫ్ గ్రోథ్’ అనేది ఈ సంవత్సరం లో జరుగుతున్న ఏశియాన్ సమిట్ కు ఇతివృత్తం గా ఉంది.

ఏశియాన్ కు విలువ ఉంది, ఎందుకు అని అంటే ఇక్కడ అందరి వాణి ని వినడం జరుగుతుంది, మరి ఏశియాన్ అనేది ఎపిసెంట్రమ్ ఆఫ్ గ్రోథ్ గా ఉంది.. ఇలా ఎందుకు అంటే ప్రపంచ అభివృద్ధి లో ఏశియాన్ ప్రాంతాని కి ఒక కీలకమైన పాత్ర ఉన్నది.

 

‘వసుధైవ కుటుంబకం’ - అదే ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే ఇదే భావన జి-20 కి అధ్యక్షత ను వహిస్తున్న భారతదేశం తీసుకొన్న ఇతివృత్తం గా కూడాను ఉన్నది.


యోర్ మాజిస్టీఎక్స్ లన్సిజ్,


ఇరవై ఒకటో శతాబ్దం అనేది ఏశియా యొక్క శతాబ్ది గా ఉంది. మన అందరి శతాబ్దం గా ఉంది.

దీనికి గాను నియమాల పై ఆధారపడి ఉండేటటువంటి కోవిడ్ అనంతర కాల ప్రపంచ వ్యవస్థ ను నిర్మించడం అవసరం; మరి మానవ జాతి సంక్షేమం కోసం అందరూ పాటుపడవలసి ఉంది.

స్వేఛ్చాయుతమైనటువంటి మరియు దాపరికాని కి తావు ఉండనటువంటి ఇండో-పసిఫిక్ యొక్క పురోగతి లో, గ్లోబల్ సౌథ్ దేశాల అభిప్రాయాల ను బిగ్గర గా వినిపించడం లో మన అందరి కి ఉమ్మడి హితం ఒనగూరుతుంది.

 

ఈ రోజు న జరిగే చర్చ లు భారతదేశం యొక్క భవిష్యత్తు ను మరియు ఏశియాన్ ప్రాంతం యొక్క భవిష్యత్తు ను బలపరచే క్రొత్త తీర్మానాల కు దారితీస్తాయని నేను నమ్ముతున్నాను.

 

కంట్రీ కోఆర్డినేటర్ సింగపూర్, త్వరలో అధ్యక్ష బాధ్యతల ను స్వీకరించనున్న లావ్ పిడిఆర్, మరియు మీ అందరి తోను భారతదేశం భుజం తో భుజం కలిపి పని చేయడాని కి కంకణం కట్టుకొన్నది.

మీకు ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
The new labour codes in India – A step towards empowerment and economic growth

Media Coverage

The new labour codes in India – A step towards empowerment and economic growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Digital India has eased the process of getting pension for the senior citizens : PM
October 09, 2024

The Prime Minister Shri Narendra Modi today expressed satisfaction that Digital India has made the process of getting pension easier and it is proving to be very useful for senior citizens across the country.

Responding to a post by journalist Ajay Kumar, Shri Modi wrote:

“सबसे पहले @AjayKumarJourno जी, आपकी माता जी को मेरा प्रणाम!

मुझे इस बात का संतोष है कि डिजिटल इंडिया ने उनकी पेंशन की राह आसान की है और यह देशभर के बुजुर्ग नागरिकों के बहुत काम आ रहा है। यही तो इस कार्यक्रम की बहुत बड़ी विशेषता है।”