ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుని దౌత్య సలహాదారు శ్రీ ఇమ్యాన్యుయెల్ బన్ ఈ రోజు న్యూఢిల్లీలో కలుసుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ మాక్రోన్‌కు దౌత్య సలహాదారైన శ్రీ ఇమ్యాన్యుయెల్ బన్‌ను కలుసుకోవడం సంతోషదాయకం.
అనేక రంగాల్లో సన్నిహిత సహకారంతో ముందుకు పోతున్న బలమైన, విశ్వసనీయమైన భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇక మీదట కూడా కొనసాగించాలని మేం పునరుద్ఘాటించాం. నవకల్పన, సాంకేతిక విజ్ఞానం, విద్య రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరించడం భారత్-ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరం సందర్భంగా.. సంతోషం కలుగుతోంది. కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా మేం మా అభిప్రాయాల్ని పంచుకున్నాం. అధ్యక్షుడు శ్రీ మాక్రోన్ త్వరలోనే భారత్ పర్యటనకు వస్తారని ఆశిస్తూ, ఆయనకు స్వాగతం పలకడం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’.
Delighted to meet Emmanuel Bonne, Diplomatic Advisor to President Macron.
— Narendra Modi (@narendramodi) January 13, 2026
Reaffirmed the strong and trusted India–France Strategic Partnership, marked by close cooperation across multiple domains. Encouraging to see our collaboration expanding into innovation, technology and… pic.twitter.com/V9yEPcculA


