పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ శ్రీ అరవింద్ శ్రీనివాస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆదివారం కలిశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో అరవింద్ శ్రీనివాస్ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“మిమ్మల్ని కలిసి కృత్రిమ మేధ, దాని ఉపయోగాలు, దాని పరిణామంపై చర్చించడం చాలా సంతోషాన్నిచ్చింది. @perplexity_aiతో మీరు గొప్ప పని చేస్తుండడం హర్షణీయం. మీ భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.”
Was great to meet you and discuss AI, its uses and its evolution.
— Narendra Modi (@narendramodi) December 28, 2024
Good to see you doing great work with @perplexity_ai. Wish you all the best for your future endeavors. https://t.co/kD8d9LMorC


