రెండేళ్లలో రూ.2,000 కోట్లతో ఈ పథకం అమలు
తీవ్రమైన వాతావరణ ఘటనలు, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడంలో మరింత ఊతం ఇవ్వనున్న మిషన్

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండేళ్లలో రూ.2000 కోట్ల వ్యయంతో మిషన్ మౌసమ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 

భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానంగా అమలు చేసే ఈ మిషన్ మౌసమ్, భారతదేశ వాతావరణ సంబంధిత శాస్త్ర, పరిశోధన, సేవలను అద్భుతంగా పెంచడానికి బహుముఖ, పరివర్తనాత్మక చొరవగా ఉంటుంది. తీవ్రమైన వాతావరణ ఘటనలు, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడంలో పౌరులు, చిట్ట చివరి వినియోగదారులతో సహా వాటాదారులను మరింత సన్నద్ధం చేయడానికి ఇది సహాయపడుతుంది. దీర్ఘకాలంలో కమ్యూనిటీలు, వివిధ రంగాలు, పర్యావరణ వ్యవస్థల్లో సామర్థ్యాన్ని, స్థితిస్థాపకతను విస్తృతం చేయడంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం  దోహదపడుతుంది.

మిషన్ మౌసమ్ లో భాగంగా భారతదేశం, వాతావరణ శాస్త్రాలలో ముఖ్యంగా వాతావరణ నిఘా, మోడలింగ్, ముందస్తు హెచ్చరిక, నిర్వహణలో పరిశోధన, అభివృద్ధి, సామర్థ్యాన్ని విశేషంగా వివరిస్తుంది. అధునాతన అబ్జర్వేషన్ సిస్టమ్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఏకీకృతం చేయడం ద్వారా, మిషన్ మౌసమ్ వాతావరణాన్ని అధిక ఖచ్చితత్వంతో అంచనా వేయడానికి కొత్త ప్రమాణాలను నిర్ధారిస్తుంది. 

రుతుపవనాల అంచనాలు, గాలి నాణ్యతకు సంబంధించిన హెచ్చరికలు, విపరీత వాతావరణ సంఘటనలు, తుఫానులు, పొగమంచు, వడగళ్ళు గురించి ఖచ్చితత్వంతో పరిశీలనలు జరుపుతుంది. వర్షం అంచనాలను వాతావరణ జోక్యాలతో సహా అత్యంత ఖచ్చితమైన, సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది. ఇందుకు పరిశీలనలు, అవగాహనను మెరుగుపరచడంపై ఈ మిషన్ దృష్టి పెడుతుంది. మిషన్ మౌసమ్ కీలకమైన అంశాలలో...  ఆధునిక సెన్సార్‌లు, అధిక-పనితీరు గల సూపర్‌కంప్యూటర్‌లతో తదుపరి తరం రాడార్లు, ఉపగ్రహ వ్యవస్థల విస్తరణ ఉన్నాయి. అలాగే మెరుగైన భూ విజ్ఞాన శాస్త్ర నమూనాల అభివృద్ధి, రియల్ టైం డేటా వ్యాప్తి కోసం జిఐఎస్-ఆధారిత ఆటోమేటెడ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఈ మిషన్ లో పొందుపరిచారు. 

మిషన్ మౌసమ్... వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, పర్యావరణం, విమానయానం, నీటి వనరులు, విద్యుత్తు, పర్యాటకం, షిప్పింగ్, రవాణా, ఇంధనం, ఆరోగ్యం వంటి అనేక రంగాలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది పట్టణ ప్రణాళిక, రోడ్డు, రైలు రవాణా, ఆఫ్‌షోర్ కార్యకలాపాలు, పర్యావరణ పర్యవేక్షణ వంటి అంశాలలో డేటా ఆధారిత నిర్ణయాలను మెరుగుపరుస్తుంది.

భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన మూడు సంస్థలు: 

ప్రధానంగా భారత వాతావరణ విభాగం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్, మిషన్ మౌసమ్‌ను అమలు చేస్తాయి. ఈ సంస్థలకు ఇతర ఎంఓఈఎస్ సంస్థలు (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ) మద్దతు ఇస్తాయి, అలాగే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అకాడెమియా, పరిశ్రమల సహకారంతో క్లైమేట్ సైన్సెస్, సర్వీసులు భారతదేశ నాయకత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయి. 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Positive consumer sentiments drive automobile dispatches up 12% in 2024: SIAM

Media Coverage

Positive consumer sentiments drive automobile dispatches up 12% in 2024: SIAM
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 జనవరి 2025
January 15, 2025

Appreciation for PM Modi’s Efforts to Ensure Country’s Development Coupled with Civilizational Connect