ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మెట్రో రైల్‌ ప్రాజెక్టు ‘ఫేజ్-1బి’ పనులకు ఆమోదం తెలిపింది. ఇది 11.165 మీటర్ల పొడవైన మార్గం కాగా- ఇందులో 7 భూగర్భ, 5 ఎలివేటెడ్- మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. ఇది పూర్తయితే, లక్నో నగరంలో 34 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

వృద్ధికి ఊతం సహా పలు ప్రయోజనాలు:

‘ఫేజ్-1బి’ పనులు లక్నో నగర మెట్రో రైలు నెట్‌వర్క్ కీలక విస్తరణలో భాగం కావడంతో నగరమంతటా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గణనీయ పురోగమనానికి ప్రతీకగా నిలుస్తాయి.

అనుసంధానంలో మెరుగుదల:

ఈ పనులతో సుమారు 11.165 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో లక్నో నగరంలోని అత్యంత పురాతన, అధిక జనసాంద్రత, చౌకైన ప్రజా రవాణా కొరతగల ప్రాంతాలకు సంధాన సౌలభ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

ఈ దశ పాత లక్నోలోని కీలక మండలాలను సజావుగా అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది, వీటిలో ఇవి ఉన్నాయి:

పాత లక్నోలోని కీలక ప్రదేశాలను సజావుగా అనుసంధానించడం ‘ఫేజ్-1బి’ ప్రధాన లక్ష్యం. ఇది పూర్తయితే కింది ప్రాంతాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి:

·         అమీనాబాద్, యాహియాగంజ్, పాండేగంజ్, చౌక్ వంటి వాణిజ్య కేంద్రాలు.

·         ముఖ్యంగా కింగ్ జార్జ్ వైద్య విశ్వవిద్యాలయం (వైద్య కళాశాల ఆస్పత్రి) వంటి ప్రాణాంతక వ్యాధుల, అత్యవసర చికిత్స కేంద్రాలు.

·         బడా ఇమాంబడ, చోటా ఇమాంబడ, భూల్ భులయ్యా, క్లాక్ టవర్, రూమీ దర్వాజా వగైరా ప్రధాన పర్యాటక ఆకర్షక ప్రదేశాలు

·         నగరంలో పాక ప్రావీణ్యం చాటే, సుసంపన్న-చారిత్రక ఆహార సంస్కృతికి ప్రతీకలైన ప్రదేశాలు

ఈ కీలక ప్రాంతాలను మెట్రో నెట్‌వర్క్‌తో జోడించే ‘ఫేజ్-1బి’తో అనుసంధానం మరింత మెరుగవుతుంది. దాంతోపాటు ఆర్థిక కార్యకలాపాలకు ఉత్తేజం, పర్యాటక రంగానికి ప్రేరణ లభిస్తాయి. స్థానిక ప్రజలకు, సందర్శకులకు పట్టణ రవాణా సౌలభ్యం ఇనుమడిస్తుంది.

వాహన రద్దీ తగ్గుదల: రోడ్డు రవాణాతో పోలిస్తే మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ సహజంగానే చౌకైన ప్రత్యామ్నాయం. ఈ నేపథ్యంలో ‘ఫేజ్‌-1బి’ ద్వారా లక్నో నగరంలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ పొడిగింపుతో రహదారులపై వాహన రద్దీ తగ్గుతుందని అంచనా. ముఖ్యంగా అమిత రద్దీగా కనిపించే పాత లక్నో మార్గాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. దీనివల్ల వాహన రాకపోకలు సజావుగా సాగి, ప్రయాణ సమయం కలిసిరావడమేగాక రహదారి భద్రతకూ భరోసా లభిస్తుంది.

పర్యావరణ ప్రయోజనాలు: లక్నో నగరంలో ‘ఫేజ్-1బి’ మెట్రో రైలు ప్రాజెక్ట్ అదనంగా అందుబాటులోకి వస్తే పర్యావరణానికీ మేలు కలుగుతుంది. ఈ మేరకు సంప్రదాయ శిలాజ ఇంధన ఆధారిత రవాణాతో పోలిస్తే కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.

ఆర్థిక వృద్ధి: ప్రయాణ సమయం తగ్గుదలతోపాటు నగర పరిధిలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్సు డిపోల వంటి వివిధ ప్రాంతాలకు రవాణా సౌలభ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు, కార్మికులు తమ కార్యాలయాలకు, పని ప్రదేశాలకు స్వల్ప వ్యయంతో సకాలంలో చేరుకోగలరు కాబట్టి ఉత్పాదకత కూడా ఇనుమడిస్తుంది. అనుసంధానం మెరుగుదల వల్ల స్థానిక వ్యాపారాలకు... ముఖ్యంగా కొత్త మెట్రో స్టేషన్ల సామీప్య ప్రాంతాల్లో ఊపు లభిస్తుంది. అలాగే లోగడ సౌలభ్య లోపంగల ప్రాంతాల్లో పెట్టుబడులకు, ప్రగతికి అవకాశం ఉంటుంది.

సామాజిక ప్రభావం: లక్నోలో ‘ఫేజ్-1బి’ మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ వల్ల ప్రజా రవాణా  ప్రజలందరికీ సమానంగా అందుబాటులోకి వస్తుంది. తద్వారా విభిన్న సామాజిక-ఆర్థిక వర్గాలకు ప్రయోజనం కలుగుతుంది. రవాణా సౌలభ్యంలో అసమానతలు తగ్గి, ప్రయాణ సమయం ఆదా కావడం ద్వారా నిత్యావసర సేవల లభ్యత మెరుగుపడి జనజీవన నాణ్యత ఇనుమడిస్తుంది.

లక్నో మెట్రో రైలు ప్రాజెక్ట్ ‘ఫేజ్-1బి’ నగర పరిణామాత్మక ప్రగతికి ఇతోధికంగా తోడ్పడుతుంది. అనుసంధానం పెరుగుదల, వాహన రద్దీ తగ్గుదల, పర్యావరణ ప్రయోజనాలు, ఆర్థిక వృద్ధి, జనజీవన నాణ్యత మెరుగుదల వగైరాలకు భరోసా ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కీలక సమస్యలకు పరిష్కారం చూపడం, భవిష్యత్‌ విస్తరణకు పునాది వేయడం ద్వారా నగర పురోగమనం, సుస్థిరత సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Best-ever July sales set stage for strong festive season

Media Coverage

Best-ever July sales set stage for strong festive season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi shares Sanskrit Subhashitam recognizing Earth as the nurturing mother of all life
August 06, 2026

The Prime Minister, Shri Narendra Modi today shared Sanskrit Subhashitam emphasising that humanity may live in harmony with the Earth, as earth is the nurturing mother of all life and the moral order that sustains her should be respected.

The Prime Minister shared a Sanskrit verse-

विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।

शिवां स्योनामनु चरेम विश्वहा॥

The Prime Minister posted on X:

विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।

शिवां स्योनामनु चरेम विश्वहा॥