ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వరుణ నది వెంబడి ఉన్న ఎన్‌హెచ్-31, వారణాసి రింగ్ రోడ్డును కలుపుతూ 43.218 కిలోమీటర్ల పొడవైన అనుసంధాన కారిడార్ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధాన రహదారి, వంతెనలు, వృత్తాకార మార్గాలు, ఎక్కి-దిగే మార్గాలు, సర్వీసు రోడ్లతో 6,4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ఏఐ) నిర్మించనుంది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.10,998.32 కోట్లు కాగా.. సివిల్ నిర్మాణ పనులకు రూ.4,565.33 కోట్లు, భూసేకరణకు రూ.934.91 కోట్లు కేటాయించారు.

వారణాసిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో ఈ కారిడార్ కీలక భాగం. ఇది ఎన్‌హెచ్-31, కాశీ రైల్వేస్టేషన్ మధ్య అంతరాయం లేని అనుసంధానాన్ని కల్పిస్తుంది. ఇది వారణాసి రింగ్ రోడ్, వారణాసి విమానాశ్రయం, కాశీ రైల్వేస్టేషన్, వారణాసి సిటీ రైల్వేస్టేషన్, వారణాసి జంక్షన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, రాంనగర్ పోర్టు, సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి ఘాట్లు, పరిసర ప్రాంతమైన చందౌలీకి రవాణా సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

గంటకు 80-100 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్‌హెచ్-31 నుంచి కాశీ రైల్వేస్టేషన్ మధ్య ప్రయాణ సమయం సుమారు 40 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గుతుంది. అంటే దాదాపు 50 శాతం సమయం తగ్గుతుంది. ఇది నగరంలోని రహదారులపై రద్దీని తగ్గించటమే కాక, రహదారి భద్రతను మెరుగుపరుస్తుంది. వాహన నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. ప్రయాణికులు, సరకురవాణా వాహనాలు వేగంగా, అంతరాయం లేకుండా రాకపోకలు సాగించేందుకు సహకరిస్తుంది.

ఆర్థిక కేంద్రం (చందౌలీ సామాజిక ఆర్థిక మండలి), సామాజిక కేంద్రం (చందౌలీ), ఆరు ప్రధాన లాజిస్టిక్స్ కేంద్రాలకు ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడటంతో ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతం అవుతుంది. తద్వారా పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్రణాళికకు అనుగుణంగా బహుళ విధాన రవాణా అనుసంధానం పెరుగుతుంది. ఇది వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువులు, నిర్మాణ సామాగ్రి, ఖనిజాల సమర్థవంతమైన రవాణాకు దోహదపడుతుంది. రవాణా సామర్థ్యం మెరుగవుతుంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో సుస్థిర ఆర్థికాభివృద్ధికి ఇది సహకరిస్తుంది.

మొత్తంగా ఈ ప్రాజెక్టు వారణాసికి వచ్చే సందర్శకుల, అక్కడి స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అనుసంధానాన్ని పెంపొందిస్తూ, వివిధ రవాణా వ్యవస్థలను కలుపుతూ.. పర్యాటకం, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా ఆధునిక, నియంత్రణ పద్ధతిలో ప్రవేశాన్ని కల్పించే పట్టణ రవాణా కారిడార్‌ను నిర్మిస్తారు.

కారిడార్ మ్యాప్:

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Conferred With Uzbekistan's Highest Honour For Foreign Leaders

Media Coverage

PM Modi Conferred With Uzbekistan's Highest Honour For Foreign Leaders
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 ఆగష్టు 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour