Cabinet approves continuation of the National Health Mission – w.e.f. 1st April 2017 to 31st March 2020 with a budgetary support of Rs. 85,217 crore as Central Share
Cabinet approves continuation of the Prime Minister’s Development Package for Jammu & Kashmir 2015

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వంలోని కేంద్ర కేబినెట్ దేశంలో అమ‌లు జ‌రుగుతున్న జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మం (ఎన్‌హెచ్ఎం) కాల‌ప‌రిమితిని 2017 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 2020 మార్చి 31 వ తేదీ వ‌ర‌కు పొడిగించ‌డానికి ఆమోద‌ముద్ర వేసింది. ఇది దేశంలో ఆరోగ్య మౌలిక వ‌స‌తుల‌కు పెద్ద ఉత్తేజం అవుతుంది. ఈ కాలంలో ఎన్‌హెచ్ఎంకు కేంద్ర వాటాగా 85,217 కోట్ల రూపాయల నిధులు కేంద్ర బ‌డ్జెట్ నుంచి ల‌భిస్తాయి.

“జ‌మ్ము క‌శ్మీర్ లో జిల్లా ఆస్ప‌త్రులు, స‌బ్ జిల్లా ఆస్ప‌త్రుల‌కు, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు ఐదు సంవ‌త్స‌రాల పాటు మౌలిక వ‌స‌తులు” క‌ల్పించేందుకు అమ‌లులో ఉన్న ప్ర‌ధాన‌మంత్రి డెవ‌ల‌ప్‌మెంట్ ప్యాకేజిని కొన‌సాగించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 2017 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 2020 మార్చి 31 వ‌ర‌కు ఈ నిర్ణ‌యం అమ‌లులో ఉంటుంది. ఈ కాలంలో కేంద్ర స‌హాయంతో అమ‌లు జ‌రిగే కార్య‌క్ర‌మంగా దీనికి 625.20 కోట్ల రూపాయల స‌హాయం అందుతుంది.

ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు…

1. సార్వ‌త్రిక ఆరోగ్య క‌వ‌రేజ్ (యుహెచ్‌సి) అమ‌లుకు ఎన్ హెచ్ ఎం మూలంగా ఉంటుంది.
2. దీని కింద ల‌క్ష్యాలు/ టార్గెట్లు జాతీయ ఆరోగ్య విధానం, 2017 మ‌రియు ఎస్ డిజి-3తో అనుసంధానం అవుతాయి.
3. దేశంలో ఎండిజిల సాధ‌న‌కు ఎన్ హెచ్ ఎం ఉప‌యోగ‌ప‌డింది. యుహెచ్ సి స‌హా ఎస్ డిజి 3 ల‌క్ష్యాల సాధ‌న‌కు మూలంగా ఇది నిలుస్తుంది.
4. ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠం చేయ‌డానికి ప్ర‌త్యేకించి అత్య‌ధిక ప్రాధాన్య‌తా జిల్లాల్లో మ‌రింత ప‌టిష్ఠం చేసే వాహ‌నంగా ఎన్ హెచ్ ఎం నిలుస్తుంది. 
5. ఉమ్మ‌డి నాన్ క‌మ్యూనిక‌బుల్ వ్యాధులు, వ‌యోవృద్ధుల (గెరియాట్రిక్) ఆరోగ్య కేంద్రాలు, ఉపశమన చికిత్స‌లు (ప‌లియాటివ్ కేర్), పున‌రావాస ఆరోగ్య సేవ‌లు స‌హా ఎంపిక చేసిన సేవల నుంచి స‌మ‌గ్ర ప్రాథ‌మిక ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లోకి మార‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. 
6. దేశంలోని హెచ్ డ‌బ్ల్యుసిల‌కు ప్రివెంటివ్, ప్ర‌మోటివ్, క్యూరేటివ్, రీహాబిలిటేటివ్ సేవ‌లు, ఎన్ సిడి స్ర్కీనింగ్ మ‌రియు నిర్వహణ అందుబాటులోకి వ‌స్తాయి. రెండు మార్గాల రిఫ‌ర‌ల్ వ్య‌వ‌స్థ ద్వారా సిహెచ్‌సిలు, డిహెచ్‌లు అనుసంధానం అవుతాయి. సేవ‌లు అందించ‌డంలో విభాగాలుగా కాకుండా సంర‌క్షణ కొన‌సాగింపును మెరుగు ప‌ర‌చ‌డానికి వీలు క‌లుగుతుంది. అంద‌రిలోనూ సాధార‌ణంగా వ‌చ్చే ఎస్ సిడిలు స‌హా ఉచిత సార్‌‌త్రిక స్క్రీనింగ్ కోసం 12 సేవ‌ల‌ను ప్యాకేజిగా అందించ‌గ‌లుగుతారు. 
7. ఆరోగ్య సంర‌క్షణ, ప్ర‌జారోగ్య సేవల సామ‌ర్థ్యం మెరుగుప‌ర‌చ‌డం ల‌క్ష్యంగా స‌బ్ సెంట‌ర్ స్థాయిలో మ‌ధ్య‌స్థాయి ఆరోగ్య కార్య‌క‌ర్త నియామ‌కానికి వీలు క‌లుగుతుంది.
8. ఆయుష్ ను సంఘ‌టితం చేయడం, ఆరోగ్య ప్ర‌చారం, కొన్ని ర‌కాల దీర్ఘ‌కాలిక మొండి వ్యాధుల నిరోధం వంటి చ‌ర్యల ద్వారా ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధాన్యం ల‌భిస్తుంది. 
9. కీలక ఆరోగ్య సూచిలు, ప‌నితీరును మెరుగుప‌రిచే ఇతర సూచిక‌లు స‌హా ఆశావ‌హ‌మైన ల‌క్ష్యాలు నిర్ణ‌యించారు. 
10. మ‌రింత మెరుగుదల సాధించేందుకు ఫ‌లితాల ఆధారితంగా నిధుల పెంపు, ఆరోగ్య రంగంలో సంస్క‌ర‌ణ‌లకు అవ‌కాశం క‌లుగుతుంది.
11. వేర్వేరుగా అమ‌లు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌న్నింటినీ అనుసంధానం చేయ‌డం ద్వారా ఆరోగ్యం, సంర‌క్షణ చ‌ర్య‌ల‌న్నింటినీ సంఘ‌టితం చేయ‌డానికి వీలు క‌లుగుతుంది. 
12. నిర్దేశిత ల‌క్ష్యాల సాధ‌న‌కు విభిన్న వ్యూహాలు, చొర‌వ‌లు రూపొందించ‌గ‌లుగుతారు.
13. ఎన్ హెచ్ ఎం ఉచిత ఔష‌ధాలు, వైద్య ప‌రీక్షల సేవ‌లు అందుబాటులో ఉంచ‌డం, ప్ర‌ధాన‌మంత్రి జాతీయ డ‌యాలిసిస్ కార్య‌క్ర‌మం ద్వారా ప్రజల జేబు నుంచి చేసే ఖ‌ర్చు త‌గ్గించ‌డానికి ప్ర‌త్యేకంగా దృష్టి సారించ‌గ‌లుగుతారు. ప్ర‌ధానంగా రోగుల జేబు నుంచే చేసే ఖ‌ర్చు త‌గ్గించ‌డం ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం.
14. ఆరోగ్య సేవ‌ల్లో భిన్న విభౄగాలు అందిస్తున్న సేవ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతం చేయ‌గ‌లుగుతారు.
15. ముందువ‌రుస‌లో నిలిచి ప‌ని చేసే కార్య‌క‌ర్త‌ల్లో సహ‌కార స్ఫూర్తిని నింపేందుకు, ప్రోత్సాహానికి టీమ్ ఆధారిత ప్రోత్సాహ‌కాలు అందిస్తారు. 
16. కాయ‌క‌ల్ప్, లాక్యుష్య స‌హా ప్ర‌జారోగ్య సంస్థ‌ల‌కు నాణ్య‌తా స‌ర్టిఫికేష‌న్ ఇవ్వ‌డం ద్వారా వాటి నాణ్య‌త‌ను పెంచ‌డానికి ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇస్తారు. 
17. అన్ని రాష్ర్టాలకు అందిస్తున్న టీకామందుల సంఖ్య‌ను పెంచుతారు.
18. ఆయుష్మాన్ భార‌త్ కింద జాతీయ ఆరోగ్య సంర‌క్షణ కార్య‌క్ర‌మాన్ని సంఘ‌టితం చేస్తారు.

ప్ర‌భావం…

i. కొన‌సాగింపు స‌మ‌యంలో ఎన్ హెచ్ ఎం నిర్దేశిత ల‌క్ష్యాలు సాధించ‌గ‌లుగుతుంది. 
ii. శైశవ ద‌శ‌లో మ‌ర‌ణాల సంఖ్య (ఎన్ ఎంఆర్), బాలల మ‌ర‌ణాల సంఖ్య (ఐఎంఆర్), ఐదు సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సులో మ‌ర‌ణాల రేటు (యు5ఎంఆర్), స్థూల ఫెర్టిలిటీ రేటు (టిఎఫ్ ఆర్) వంటి కీలక ఆరోగ్య సూచికల మెరుగుదల సాధ్యం అవుతుందిజ 
iii. సంక్రమణ వ్యాధులను అదుపు చేయ‌గ‌లుగుతారు. 
iv. ఆరోగ్య సంర‌క్షణ కోసం ప్రజల జేబు నుంచి అయ్యే వ్య‌యాలు త‌గ్గించ‌గ‌లుగుతారు. 
v. రోటీన్ గా చేప‌ట్టే ఇమ్యునైజేష‌న్ స‌ర్వీసులు, నాన్ క‌మ్యూనిక‌బుల్ వ్యాధుల చికిత్స‌కు క‌వ‌రేజ్ మెరుగు ప‌ర‌చ‌గ‌లుగుతారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 డిసెంబర్ 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security