ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త ఉత్సాహం, శక్తిని నింపాలని, అలాగే దేశ ప్రజల మధ్య ఐక్యత అనే రంగును మరింతగా గాఢతరం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
“మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఆనందం, ఉత్సాహంతో నిండిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్తేజాన్ని, శక్తిని నింపడంతో పాటు, దేశ ప్రజల మధ్య ఐక్యత అనే రంగును మరింత గాఢతరం చేయాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ ఎక్స్‘ లో పేర్కొన్నారు.
आप सभी को होली की ढेरों शुभकामनाएं। हर्ष और उल्लास से भरा यह पावन-पर्व हर किसी के जीवन में नई उमंग और ऊर्जा का संचार करने के साथ ही देशवासियों की एकता के रंग को और प्रगाढ़ करे, यही कामना है।
— Narendra Modi (@narendramodi) March 13, 2025


