ఆసియా క్రీడలలో మన క్రీడాకారులు 100 పతకాల మైలురాయిని అధిగమించడంతో యావద్దేశం పులకించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో క్రీడాకారుల బృందం స్వదేశానికి చేరాక ఈ నెల 10వ తేదీన వారికి విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మన క్రీడాకారులు సాధించిన విజయాలు, అనుభవాల గురించి వారితో ముచ్చటిస్తారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల్లో భారతదేశానికి ఇదెంతో కీలక విజయం! మన క్రీడాకారులు 100 పతకాల మైలురాయిని అధిగమించినందుకు దేశ ప్రజలంతా సంతోషంతో పొంగిపోతున్నారు. ఈ చారిత్రక మైలురాయిని అందుకోవడంలో ప్రతిభా పాటవాలు చూపిన మన ఆటగాళ్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ప్రతి అద్భుత ప్రదర్శన అబ్బురపరచి, మన హృదయాలను సంతోషంతో, గర్వంతో నింపింది. ఈ నేపథ్యంలో మన క్రీడాకారులు స్వదేశానికి రాగానే 10వ తేదీన వారికి విందు ఇవ్వడం కోసం నేను ఎదురుచూస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
A momentous achievement for India at the Asian Games!
— Narendra Modi (@narendramodi) October 7, 2023
The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals.
I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA


