వ్యక్తిగత పురోగతితో పాటు దేశ ప్రగతిలో క్రమశిక్షణ, స్వావలంబన కీలక పాత్రను పోషిస్తాయని భారతీయ సంస్కృతి చాటిచెబుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.
ఒక సంస్కృత సూక్తిని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఉదాహరించారు. ఇతరులపై ఆధారపడితే కష్టాలు ఎదురవుతాయనీ, స్వీయ కర్మలను నియంత్రించుకొంటూ ఉంటే ఎప్పటికీ ఆనందంగా ఉండడం సాధ్యపడుతుందనీ ఆ శ్లోకం సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ సంస్కృతంలో ఇలా రాశారు:
‘‘సర్వ పరవశం దుఃఖమ్ సర్వమాత్మావశం సుఖమ్
ఏతద్ విద్వత్ సమాసేన లక్షణం సుఖదు:ఖయో:’’
सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम्।
— Narendra Modi (@narendramodi) December 15, 2025
एतद् विद्यात् समासेन लक्षणं सुखदुःखयोः॥ pic.twitter.com/519XHslFd4


