మాతృభూమి పవిత్ర వారసత్వాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి..
May 21st, 09:04 am
సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఆధ్యాత్మిక సాధన, ఆరాధనలతో పాటు ధైర్య సాహసాలకీ, శక్తికీ, సర్వజన సంక్షేమానికీ నిలయం అయిన పవిత్ర భూమిగా మన మాతృదేశం అలరారుతోందని ఆయన అన్నారు. గొప్ప వారసత్వంతో పాటు ప్రాచీన సంస్కృతికి ఆలవాలమైన ఈ పవిత్ర భూమి ఎల్లవేళలా అందరూ సుఖంతో, సమృద్ధితో వర్ధిల్లేటట్లు చేయాలని తాను మనసారా కోరుకుంటున్నానని శ్రీ మోదీ అన్నారు.మే 10, 11వ తేదీల్లో గుజరాత్‌లో పీఎం పర్యటన
May 09th, 11:19 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2026 మే 10, 11వ తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. మే 10న రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకుంటారు. మే 11న ఉదయం 10:15 గంటలకు సోమనాథ్ ఆలయంలో జరిగే సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అనంతరం ప్రధానమంత్రి వడోదరాకు వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు సర్దార్‌ధామ్ హాస్టల్‌ను ప్రారంభిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఏర్పాటు చేసిన సభల్లో ఆయన ప్రసంగిస్తారు.భారతరత్న డాక్టర్ ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
January 17th, 10:17 am
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న డాక్టర్ ఎంజీ రామచంద్రన్ (ఏంజీఆర్) జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
August 03rd, 09:35 am
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 03rd, 09:30 am
అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్యవసాయశాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది సమావేశ థీమ్ సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల దిశగా పరివర్తన. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాటడమే ఈ సమావేశ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.