మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
April 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.The voice of the Global South becomes stronger and more confident when India and Brazil work together: PM Modi at the India-Brazil Joint Press Meet
February 21st, 12:30 pm
In his statement at the India-Brazil Joint Press Meet, PM Modi lauded Brazil President Lula’s vision and leadership and said that his visit has added grace to the AI Impact Summit. He noted that in their discussions they deliberated on advancing in every field with shared purpose and shared aspirations. The PM expressed confidence that the President's visit will deepen the strategic partnership and open new avenues of cooperation in the years ahead.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు
January 22nd, 09:43 pm
ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ అధ్యక్షుడు, గౌరవనీయ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా జన్మ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగం
November 19th, 11:00 am
పవిత్రమైన పుట్టపర్తి నేలపై నేడు మీ అందరి మధ్య ఉండటం నాకు ఒక భావోద్వేగంతో కూడిన ఆధ్యాత్మిక అనుభూతి. కొద్దిసేపటి క్రితం బాబా సమాధి వద్ద నివాళులు అర్పించే అవకాశం నాకు లభించింది. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందడం ఎల్లప్పుడూ నా హృదయాన్ని భావోద్వేగంతో నింపే అనుభవం.ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా శతజయంత్యుత్సవాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 19th, 10:30 am
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా భక్తకోటిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ‘సాయిరాం’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధానమంత్రి.. ఈ పవిత్ర పుట్టపర్తి క్షేత్రంలో భక్తులందరి నడుమ ఉండడం ఒక భావోద్వేగభరిత, ఆధ్యాత్మిక అనుభవమని పేర్కొన్నారు. కొద్దిసేపటి కిందటే బాబా సమాధి వద్ద పుష్పాంజలి ఘటించే అవకాశం తనకు దక్కిందన్నారు. బాబా పాదాలకు నమస్కరించి, ఆయన ఆశీస్సులను పొందినట్లు చెప్పారు. బాబా ఆశీస్సులు ఎప్పుడు అందించినా మనసు భావోద్వేగానికి లోనవుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు గత నెలలో చేపట్టిన బ్రెజిల్ పర్యటనను గుర్తు చేసుకున్న మోదీ
August 07th, 09:27 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడారు. గత నెలలో జరిగిన తన బ్రెజిల్ పర్యటనను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, పౌర సంబంధాల విషయంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై ఈ పర్యటనలోనే ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.బ్రెజిల్ అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం
July 09th, 06:02 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిలియాలో అధికారిక పర్యటన చేపడుతున్నారు. బ్రెజీలియాలోని అల్వరాడో ప్యాలెస్‌లో బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో ఈ రోజు సమావేశమయ్యారు. అధ్యక్షుడు లూలా ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు.సంయుక్త ప్రకటన: ఉన్నత లక్ష్యాలు కలిగిన రెండు గొప్ప దేశాలు.. భారత్, బ్రెజిల్
July 09th, 05:55 am
బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (2025 జులై 8న) బ్రెజిల్‌కు ఆధికారిక పర్యటనకు విచ్చేశారు. ఇది దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి బ్రెజిల్ - ఇండియాల మధ్య మైత్రి, పరస్పర విశ్వాస భావనలను ప్రతిబింబిస్తోంది. ఈ స్నేహ బంధాన్ని 2006లో వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించారు.బ్రెజిల్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధికారిక పర్యటన.. ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
July 09th, 03:14 am
డిజిటల్ మాధ్యమ వినియోగానికి సంబంధించి విజయవంతమైన డిజిటల్ సేవలను పెద్ద ఎత్తున ఇచ్చి పుచ్చుకోవడంలో పరస్పరం సహకరించుకోవడానికి రూపొందించిన ఒక అవగాహన ఒప్పంద పత్రం (ఎంఓయూ).ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి బ్రెజిల్‌లో అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’’ ప్రదానం
July 09th, 12:58 am
బ్రెజిల్‌లో అత్యున్నత జాతీయ పురస్కారం అయిన ‘‘ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’’ అవార్డుతో ఆ దేశ అధ్యక్షుడు గౌరవ లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సత్కరించారు.బ్రెజిల్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
July 08th, 08:30 pm
రియో, బ్రెజీలియాలో ఆత్మీయ స్వాగతం పలికిన నా స్నేహితుడు, అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెజాన్ ప్రకృతి సౌందర్యం, మీ ఆత్మీయత మమ్మల్ని మంత్రముగ్ధులను చేశాయి.బ్రెజిల్‌లోని బ్రెజిలియాకు చేరుకున్న ప్రధాని మోదీ
July 08th, 02:55 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర పర్యటన కోసం బ్రెజిలియాకు చేరుకున్నారు. భారతదేశం-బ్రెజిల్ సంబంధాల యొక్క వివిధ అంశాలపై అధ్యక్షుడు లూలాతో ఆయన వివరణాత్మక చర్చలు జరుపుతారు.బ్రెజిల్‌లో ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి
July 06th, 08:28 am
బ్రెజిల్‌లోని ప్రవాస భారతీయులు రియో డి జనీరోలో తనకు ఆత్మీయంగా స్వాగతం పలకడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. వారు భారతీయ సంస్కృతితో ముడిపడి ఉండడం.. భారత అభివృద్ధి పట్ల అత్యంత మక్కువ చూపడం ఆనందంగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వాగతానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను కూడా శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు చేరుకున్న ప్రధాని మోదీ
July 06th, 04:47 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం బ్రెజిల్ చేరుకున్నారు. రియో డి జనీరోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు మరియు అనేక మంది ప్రపంచ నాయకులను కలుస్తారు.ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
July 02nd, 07:34 am
జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వాతో చర్చిస్తాను.ఘనా, ట్రినిడాడ్ - టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి (జూలై 02 - 09)
June 27th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనాలో ఇదే ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడం.. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అభివృద్ధిలో సహకారాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడం, ఈసీవోడబ్ల్యూఏఎస్ (ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్), ఆఫ్రికన్ యూనియన్‌లతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.జీ-7 సమావేశాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాధ్యక్షులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 18th, 03:05 pm
జూన్ 17న కెనడా కననాస్కిస్ లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలతో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజా, బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వాతో భేటీ కావడమే కాకుండా, సుహృద్భావపూర్వక వాతావరణంలో అర్ధవంతంగా చర్చలు జరిగాయి.30 మార్చి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 120 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 30th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈరోజు- ఈ పవిత్రమైన రోజున మీతో ‘మన్ కీ బాత్’ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం 2082 ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందు ఉన్నాయి. కొందరు బీహార్ నుండి, కొందరు బెంగాల్ నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు గుజరాత్ నుండి ఈ లేఖలు రాశారు. వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారు. చాలా లేఖలలో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలనిపిస్తోంది-శస్త్రచికిత్స చేయించుకొన్న బ్రెజిల్ అధ్యక్షుడు త్వరగా కోలుకుని, ఆరోగ్యవంతుడవ్వాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 12th, 09:50 pm
ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొన్న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూలా డా సిల్వా త్వరగా కోలుకోవాలని, చక్కని ఆరోగ్యం కలగాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.భారత-కేరికామ్ రెండో శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి ముగింపు ఉపన్యాసం
November 21st, 02:21 am
మీరు ఇచ్చిన వెల కట్టలేని సూచనలు – సలహాలు, వ్యక్తం చేసిన సకారాత్మక ఆలోచనలను నేను స్వాగతిస్తున్నాను. భారతదేశ ప్రతిపాదనల విషయానికి వస్తే, వాటికి సంబంధించిన అన్ని వివరాలను నా బృందం మీకు తెలియజేస్తుంది. అన్ని విషయాల్లోనూ మనం ఒక నిర్ణీత కాలం లోపల ముందుకు వెళదాం.