సాంకేతిక పరిజ్ఞానపరంగా భారత యువత ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉందనీ, ప్రపంచ ‘టెక్ జెయింట్’ గా భారత్ ఉద్భవానికి అడ్డు లేదన్న ‘గిట్ హబ్’ సంస్థ సీఈఓ థామస్ దోంకే మాటలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉటంకించారు.
సృజనాత్మకత, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశ యువత సాధించిన విజయాలను ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రశంసించారు.
‘ఎక్స్’ సామాజిక మాధ్యమం పై ప్రధాని సందేశం:
“సృజన, సాంకేతిక పరిజ్ఞానాలపరంగా దేశ యువతకు మించినవారు లేరు!”
When it comes to innovation and technology, Indian youth are among the best! https://t.co/hpmsalotw4
— Narendra Modi (@narendramodi) October 30, 2024