ఇటలీ లోని అపులియా లో జి-7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రెంచ్ రిపబ్లిక్ యొక్క అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ తో ఈ రోజు న ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి వరుసగా మూడోసారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు హృదయ పూర్వక శుభాకాంక్షల ను అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ తెలియజేసినందుకు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

ఇద్దరు నేత లు ‘హరైజన్ 2047’ మార్గసూచీ మరియు ఇండో-పసిఫిక్ మార్గసూచీ లపై ప్రత్యేకం గా దృష్టి ని కేంద్రీకరిస్తూ, భారతదేశం-ఫ్రాన్స్ ల మధ్య పరస్పర సంబంధాల ను సమీక్షించారు. ఈ చర్చల లో రక్షణ, పరమాణు, అంతరిక్షం, విద్య, జలవాయు సంబంధి కార్యాచరణ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ లతో పాటు నేశనల్ మ్యూజియమ్ విషయం లో భాగస్వామ్యం వంటి సాంస్కృతిక కార్యక్రమం మరియు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల ను వృద్ధి చెందింప చేయడం లో సహకారం వంటి అంశాలు చోటు చేసుకొన్నాయి. వారు ‘మేక్ ఇన్ ఇండియా’ పై మరింత శ్రద్ధ ను తీసుకోవడం తో పాటు వ్యూహాత్మక రక్షణ సంబంధి సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు సమ్మతించారు.

 

ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), కీలకమైన మరియు క్రొత్తగా ఉనికి లోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలు, శక్తి మరియు క్రీడల రంగం లో సహకారాన్ని విస్తరించుకోవాలని కూడా వారు అంగీకరించారు. 2025 వ సంవత్సరం లో ఫ్రాన్స్ లో జరుగనున్న ఎఐ సమిట్ ను మరియు యునైటెడ్ నేశన్స్ ఓశన్స్ కాన్ఫరెన్స్ ను దృష్టి లో పెట్టుకొని కలసి పని చేయాలని సమ్మతించారు.

 

కీలకమైన ప్రపంచ అంశాలను గురించి మరియు ప్రాంతీయ అంశాల ను గురించి కూడా నేతలు ఇద్దరు వారి అభిప్రాయాల ను ఒకరి దృష్టి కి మరొకరు తీసుకు వచ్చారు. భారతదేశాని కి మరియు ఫ్రాన్స్ కు మధ్య ఒక బలమైన మరియు విశ్వసనీయమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవడం స్థిరమైనటువంటి మరియు సమృద్ధమైనటువంటి గ్లోబల్ ఆర్డర్ కోసం కీలకం అని వారు స్పష్టం చేస్తూ, మరి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాల కు చేర్చడం కోసం కలిసికట్టుగా పనిచేద్దామని సమ్మతిని వ్యక్తం చేశారు.

 

త్వరలో జరుగనున్న పేరిస్ ఒలింపిక్ మరియు పారాలింపిక్ గేమ్స్ కు గాను అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
10 Years of Jan-Dhan Yojana: Spurring Rural Consumption Through Digital Financial Inclusion

Media Coverage

10 Years of Jan-Dhan Yojana: Spurring Rural Consumption Through Digital Financial Inclusion
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives in drowning incident in Dehgam, Gujarat
September 14, 2024

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives in drowning incident in Dehgam, Gujarat.

The Prime Minister posted on X:

“ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના….

ૐ શાંતિ….॥”