షేర్ చేయండి
 
Comments

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 నవంబర్, 30వ తేదీన వారణాసిలో పర్యటించనున్నారు.   జాతీయ రహదారి – 19 లోని హండియా (ప్రయాగ్ రాజ్) – రాజతలాబ్ (వారణాసి) విభాగానికి చెందిన ఆరు లైన్ల వెడల్పు ప్రాజెక్టును ప్రధానమంత్రి ఈ సందర్భంగా దేశానికి అంకితం చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా, దేవ్ దీపావళి ఉత్సవాన్ని ప్రధానమంత్రి వీక్షిస్తారు.  కాశీ విశ్వనాథ్ దేవాలయ కారిడార్ ప్రాజెక్టు ప్రదేశాన్ని, సారనాథ్ పురావస్తు ప్రదేశాన్ని కూడా ఆయన సందర్శిస్తారు.

మొత్తం 2,447 కోట్ల రూపాయల వ్యయంతో, కొత్తగా ఆరు లైన్లతో వెడల్పు చేసిన ఎన్.హెచ్-19 కు చెందిన 73 కిలోమీటర్ల పొడవైన రహదారి ప్రయాగ్ రాజ్ మరియు వారణాసి మధ్య ప్రయాణ సమయాన్ని ఒక గంట తగ్గిస్తుంది.

వారణాసిలో, ప్రతీ ఏడాదీ కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే, దేవ్ దీపావళి ఉత్సవం, దీపాలతో, ఉత్సాహంగా జరుపుకునే ప్రపంచ ప్రఖ్యాతి పండువగా పేరుగాంచింది.   వారణాసిలోని రాజ్ ఘాట్‌లో దియా వెలిగించి ప్రధానమంత్రి, ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. అనంతరం,  గంగా నదికి ఇరువైపులా ప్రజలు దాదాపు  11 లక్షల దీపాలను వెలిగిస్తారు. 

నిర్మాణంలో ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయ కారిడార్ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించడానికి ప్రధానమంత్రి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు.  సారనాథ్ పురావస్తు ప్రదేశంలో, ఈ నెల ఆరంభంలో, తాను ప్రారంభించిన, "లైట్ అండ్ సౌండ్ షో" ను కూడా ప్రధానమంత్రి, ఈ పర్యటనలో భాగంగా వీక్షించనున్నారు. 

 

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
21 Exclusive Photos of PM Modi from 2021
Explore More
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
Construction equipment industry grew 47% in Q2 FY22

Media Coverage

Construction equipment industry grew 47% in Q2 FY22
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi, PM Jugnauth to jointly inaugurate India-assisted Social Housing Units project in Mauritius
January 19, 2022
షేర్ చేయండి
 
Comments

Prime Minister Narendra Modi and Prime Minister of Mauritius Pravind Kumar Jugnauth will jointly inaugurate the India-assisted Social Housing Units project in Mauritius virtually on 20 January, 2022 at around 4:30 PM. The two dignitaries will also launch the Civil Service College and 8MW Solar PV Farm projects in Mauritius that are being undertaken under India’s development support.

An Agreement on extending a US$ 190 mn Line of Credit (LoC) from India to Mauritius for the Metro Express Project and other infrastructure projects; and MoU on the implementation of Small Development Projects will also be exchanged.