జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
జపాన్ ప్రధాని గా పదవీబాధ్యతల ను స్వీకరించినందుకు గాను శ్రీ కిశిదా కు ప్రధానమంత్రి అభినందనల ను, శుభాకాంక్షల ను తెలియజేశారు.
భారతదేశాని కి, జపాన్ కు మధ్య గల ప్రత్యేకమైనటువంటి వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం శరవేగం గా పురోగమిస్తుండడం పట్ల ఇరువురు నేత లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. హై-టెక్నాలజీ రంగం లోను, భవిష్యత్తు లో రూపుదాల్చగల ఇతర రంగాలు సహా అనేక రంగాల లో సహకారాన్ని మరింత గా పెంపొందించుకొనేందుకు ఆస్కారం ఉందంటూ వారు అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఇతోధిక పెట్టుబడి ని పెట్టడం ద్వారా భారతదేశం లో ఆర్థిక సంస్కరణ ల నుంచి ప్రయజనాన్ని పొందవలసిందంటూ జపాన్ కంపెనీల ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.
ఇండో- పసిఫిక్ రీజియన్ లో భారతదేశానికి, జపాన్ కు మధ్య పటిష్ట సహకారాన్ని గురించి, దృష్టికోణాల లో సామంజస్యం పెరుగుతుండడాన్ని గురించి కూడా ను నేత లు చర్చించారు. ఈ విషయం లో క్వాడ్ ఫ్రేమ్ వర్క్ లో భాగం గా సహకారం సంబంధి ప్రగతి ని వారు సమీక్షించారు.
ఒక ద్వైపాక్షిక శిఖర సమావేశం లో పాలుపంచుకోవడం కోసం వీలయినంత త్వరలో భారతదేశాన్ని సందర్శించేందుకు రావలసిందంటూ శ్రీ కిశిదా కు ప్రధాన మంత్రి ఆహ్వానం పలికారు.