భారతదేశం యొక్క పూర్వ ఉప రాష్ట్రపతి భైరోం సింహ్ శెఖావత్ శత జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పించారు. భారతదేశం యొక్క ప్రజాస్వామిక స్వరూపాన్ని బలపరచడం లో శ్రీ భైరోం సింహ్ గారు ఒక ప్రముఖ పాత్ర ను పోషించారని, మరి పార్లమెంటరీ చర్చోపచర్చల తాలూకు ప్రమాణాల ను పెంపు చేయడం కోసం చాటిన నిబద్ధత కు గాను ఆయన యొక్క కార్యకాలాన్ని స్మరించుకోవడం జరుగుతోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పూర్వ ఉప రాష్ట్రపతి తో తాను జరిపిన మాటామంతీ ల దృశ్యాలు కొన్నిటి ని కూడాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో:

‘‘ఈ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు; ఇది గౌరవనీయ రాజనీతిజ్ఞుడు శ్రీ భైరోం సింహ్ శెఖావత్ గారి యొక్క శత జయంతి. ఆయన మార్గదర్శకప్రాయమైనటువంటి నాయకత్వాని కి గాను మరి మన దేశ పురోగతి కై ఆయన చేసినటువంటి కృషి కి గాను భారతదేశం ఎప్పటికీ ఆయన పట్ల కృతజ్ఞత తో ఉంటుంది. ఆయన ఎటువంటి నేత అంటే ఆయన ను యావత్తు రాజకీయ రంగం లో మరు సమాజం లో అన్ని రంగాల కు చెందిన వారు అభిమానించారు.

ఆయన తో నేను జరిపిన కొన్ని మాటామంతీ ల తాలూకు దృశ్యాల ను కూడా శేర్ చేస్తున్నాను.

‘‘భైరోం సింహ్ గారు దూరదృష్టి ని కలిగివున్నటువంటి నేత యే కాక ప్రభావవంతమైనటువంటి పరిపాలకుడు కూడాను. ఆయన శ్రేష్ఠమైన ముఖ్యమంత్రి గా తనకంటూ ఒక గుర్తింపు ను తెచ్చుకొని, రాజస్థాను ను ప్రగతి తాలూకు క్రొత్త శిఖరాల కు చేర్చారు. రాజస్థాన్ లో పేదల కు, రైతుల కు, యువతీ యువకుల కు మరియు మహిళల కు నాణ్యతభరిత జీవనానికై పూచీపడడానికి ఆయన పెద్ద పీట ను వేశారు. గ్రామీణ అభివృద్ధి ని పెంపు చేయడం కోసం అనేక ఆలోచనల ను కార్యరూపం లోకి తీసుకు వచ్చారు.

భారతదేశాని కి ఉప రాష్ట్రపతి గా, భైరోం సింహ్ గారు మన ప్రజాస్వామ్యం యొక్క అంతస్తు ను పెంచడం లో ఓ ప్రముఖ పాత్ర ను పోషించారు. పార్లమెంటు లో జరిగేటటువంటి చర్చోపచర్చల, వాద ప్రతివాదాల ప్రమాణాల ను పెంచేందుకు నిబద్ధత ను చాటినటువంటి పదవీకాలం గా ఆయన యొక్క పదవీకాలాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం జరుగుతుంది. ఆయన లోని చతురత ను మరియు హాస్య ప్రియత్వాన్ని సైతం గొప్ప ప్రసన్నత తో స్మరించుకోవడం జరుగుతుంది.

భైరోం సింహ్ గారి తో నేను జరిపిన మాటామంతీలకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటి లో నేను పార్టీ సంబంధి కార్యకలాపాల లో పని చేసినప్పటి సందర్భాలు, ఇంకా 1990 వ దశకం మొదట్లో ఏకత యాత్ర జరిగినప్పటి స్మృతులు కూడా ఉన్నాయి. నేను ఆయన తో భేటీ అయినపుడల్లా జల సంరక్షణ, పేదరికం నిర్మూలన, వంటి మరెన్నో అంశాల ను గురించి ఎంతగానో నేర్చుకొంటూ ఉండేవాడి ని.

గుజరాత్ రాష్ట్రాని కి 2001 వ సంవత్సరం లో నేను ముఖ్యమంత్రి ని అయినప్పుడు, మరి ఒక సంవత్సర కాలం తరువాత భైరోం సింహ్ గారు భారతదేశాని కి ఉప రాష్ట్రపతి అయ్యారు. ఆ కాలం లో ఆయన యొక్క సమర్థన ను అందుకొనే అదృష్టం నిరంతరం గా నాకు లభించింది. 2005 వ సంవత్సరం లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ సమిట్ కు ఆయన విచ్చేశారు. అప్పట్లో గుజరాత్ లో మేం అమలుచేస్తూ ఉన్న కార్యాల ను ఆయన ప్రశంసించారు.

నేను వ్రాసిన - ‘ఆంఖ్ ఆ ధన్య ఛే’ పుస్తకాన్ని సైతం ఆయన ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం తాలూకు ఛాయాచిత్రాన్ని ఇక్కడ పొందుపరచాను.

ఈ రోజు న, మనం మన దేశ ప్రజల కోసం భైరోం సింహ్ జీ యొక్క దృష్టికోణాన్ని సాకారం చేయడం కోసం, మరి అలాగే భారతదేశం లో ప్రతి ఒక్కరు గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని గడపడం తో పాటు భారతదేశం యొక్క వృద్ధి ని మెరిపించేందుకు మరియు సుసంపన్నం చేసేందుకు అసంఖ్యాక అవకాశాలను అందుకొనేటట్లుగా చూడడాని కి పాటుపడడం కోసం మా నిబద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.

 

 

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
How Varanasi epitomises the best of Narendra  Modi’s development model

Media Coverage

How Varanasi epitomises the best of Narendra Modi’s development model
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 ఫెబ్రవరి 2024
February 26, 2024

Appreciation for the Holistic Development of Critical Infrastructure Around the Country