భగవాన్ బిర్ సా ముండా గారి కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. స్వాతంత్య్ర సమరాని కి బలాన్ని ఇవ్వడం కోసం ఆయన అందించినటువంటి తోడ్పాటు ను, అలాగే ఆదివాసీ సమాజం యొక్క ప్రయోజనాల కోసం ఆయన జరిపిన పోరాటాన్ని శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
“భగవాన్ బిర్ సా ముండా గారి కి ఆయన జయంతి నాడు ఇదే ఆదర పూర్ణమైనటువంటి శ్రద్ధాంజలి. వారు స్వాతంత్య్ర సంగ్రామాని కి శక్తి ని అందించడం తో పాటు ఆదివాసీ సమాజం యొక్క హితాల ను రక్షించడం కోసం నిరంతరం సంఘర్షణ చేస్తూ వచ్చారు. దేశం కోసం ఆయన అందించిన తోడ్పాటు చిర స్మరణీయం గా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
भगवान बिरसा मुंडा जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। वे स्वतंत्रता आंदोलन को तेज धार देने के साथ-साथ आदिवासी समाज के हितों की रक्षा के लिए सदैव संघर्षरत रहे। देश के लिए उनका योगदान हमेशा स्मरणीय रहेगा।
— Narendra Modi (@narendramodi) November 15, 2021