షేర్ చేయండి
 
Comments
పాలన యంత్రాంగం అత్యంత సూక్ష్మ దృష్టి తోవారాణసీ ప్రజలకు సాధ్యమైన అన్నివిధాలుగాను సహాయాన్ని అందించాలి: ప్రధాన మంత్రి
‘రెండు గజాల దూరం.. మాస్క్ ధరించడం’ అనే నియమాల ను పాటించాలి; 45 ఏళ్ల వయస్సు పైబడిన అందరికీ టీకామందును వేయించడానికి పాలనయంత్రాంగం చొరవ తీసుకోవాలి: ప్రధాన మంత్రి
‘ట్రాకింగ్, ట్రేసింగ్ ఎండ్ టెస్టింగ్’ పట్ల మళ్లీ శ్రద్ధ వహించడం ముఖ్యం, తొలి వేవ్ మాదిరిగానే ఈ రెండో వేవ్ తో పోరాడటం కూడా ఎంతో ముఖ్యం
కోవిడ్ సంక్రమణ నుంచి రక్షణ కు ప్రభుత్వం, సమాజం.. రెండిటి సహకారం తప్పనిసరి: ప్రధాన మంత్రి

వారణాసి జిల్లాలో కోవిడ్-19 పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్షించారు. కరోనా నివారణతోపాటు వ్యాధి సోకిన రోగులకు సముచిత చికిత్సకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు, పడకల లభ్యత, మందులు-టీకాల అందుబాటు, మానవ వనరుల పరిస్థితి తదితరాల గురించి ఈ సందర్భంగా ప్రధాని వివరాలు  తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజలందరికీ అన్నివిధాలా అవసరమైన సహాయం వేగంగా అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

   ప్రతి ఒక్కరూ ‘‘రెండు గజాల దూరం, మాస్కు ధారణ’’ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని చర్చలో భాగంగా ప్రధాని నొక్కిచెప్పారు. టీకాకరణ కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరిస్తూ- 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ తప్పక టీకా ఇచ్చేలా చూసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వారణాసి జిల్లావాసులందరికీ అత్యంత సూక్ష్మదృష్టితో అవసరమైన అన్నిరకాల సహాయం అందించాలని ఆయన సూచించారు. దేశంలోని వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రధానమంత్రి ఈ సందర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇటువంటి సంక్షోభ సమయంలోనూ వారు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ఈ నేపథ్యంలో నిరుటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా ముందడుగు వేయాలని ఆయన చెప్పారు.

   చట్టసభలో వారణాసికి ప్రాతనిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధిగా అక్కడి సాధారణ ప్రజానీకం నుంచి కూడా కోవిడ్ గురించి నిరంతరం సమాచారం స్వీకరిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. వారణాసిలో గడచిన 5-6 సంవత్సరాలు వైద్యపరంగా మౌలిక సదుపాయాల విస్తరణ-ఆధునికీకరణ చేపట్టడం కరోనాపై పోరులో ఎంతగానో దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. వారణాసిలో వైద్య సదుపాయాల మెరుగుసహా పడకలు, ఐసీయూ సౌకర్యం, ఆక్సిజన్ లభ్యత కూడా పెంచబడిందని గుర్తుచేశారు. వ్యాధి పీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున అన్ని స్థాయులలోనూ ఒత్తిడిని తట్టుకునేలా అన్ని చర్యలనూ ముమ్మరం చేయాల్సి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ‘‘కాశీ కోవిడ్ ప్రతిస్పందన కేంద్రం’’ ఏర్పాటులో చూపిన వేగాన్ని ఇతర రంగాల్లో తీసుకోవాల్సిన చర్యల విషయంలో మరింత పెంచాలని వారణాసి యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు.

   మహమ్మారి వంటి వైర‌స్‌లపై విజయం దిశగా తొలిదశ తరహాలోనే మలిదశలోనూ ‘అన్వేషణ.. ఆనవాలు.. పరీక్ష’ వ్యూహంతో పోరు కొనసాగించాల్సి ఉందని ప్రధాని నొక్కిచెప్పారు. అదే సమయంలో వీలైనంత వేగంగా వ్యాధిగ్రస్తులను కలిసిన వారందరి జాడతీసి, పరీక్ష నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. వ్యాధి పీడితులు, ఇంటివద్ద నిర్బంధ వైద్య పర్యవేక్షణలోగల వారి కుటుంబ సభ్యుల విషయంలో అన్ని బాధ్యతలనూ నిర్వర్తించాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఈ చర్యల సమయంలో అత్యంత సూక్ష్మదృష్టితో వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తించాలని నొక్కిచెప్పారు.

   వారణాసిలో స్వచ్ఛంద సంస్థలు ప్రశంసనీయ రీతిలో ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని కొనియాడుతూ, అలాంటి సంస్థలను అధికార యంత్రాంగం మరింత ప్రోత్సహించాలని ప్రధాని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దడంలో పటిష్ఠ నిఘా, నిశితదృష్టి అవసరమని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నివారణ-చికిత్సకు సంబంధించి చేసిన వివిధ ఏర్పాట్ల గురించి వారణాసి ప్రాంతీయ ప్రజా ప్రతినిధులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధానికి నివేదించారు. వ్యాధిగ్రస్తులతో సంబంధాలున్నవారి జాడతీసేందుకు కంట్రోల్ రూములతోపాటు నిర్బంధ గృహ పర్యవేక్షణలో చికిత్సకు కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు గురించి ప్రధానమంత్రికి వారు వివరించారు. అలాగే అంబులెన్స్ వసతి కల్పనకు ప్రత్యేక ఫోన్ నంబర్, కంట్రోల్ రూముల నుంచి దూరవైద్యం కోసం సదుపాయాలు, పట్టణ ప్రాంతాల్లో అదనంగా సత్వర ప్రతిస్పందన బృందాల నియామకం వగైరాల గురించి తెలియజేశారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటిదాకా 1,98,383 మందికి తొలిమోతాదు టీకా, మరో 35,014 మందికి రెండో మోతాదు టీకాలు ఇవ్వడం పూర్తయిందని ప్రధానికి తెలిపారు.

   ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో రాష్ట్ర మంత్రులు శ్రీ నీలకాంత్ తివారీ, శ్రీ రవీంద్ర జైస్వాల్, రోహానియా ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్ సింగ్, వారణాసి కోవిడ్ వ్యవహారాల ఇన్‌చార్జి-ఎమ్మెల్సీ శ్రీ ఎ.కె.శర్మ, ఇతర ఎమ్మెల్సీలు శ్రీ అశోక్ ధావన్, శ్రీ లక్ష్మణ ఆచార్యతోపాటు జోనల్ అధిపతి శ్రీ దీపక్ అగర్వాల్, జిల్లా కలెక్టర్ శ్రీ కౌశల్ రాజ్ శర్మ, పోలీస్ కమిషనర్ శ్రీ ఎ.సతీష్ గణేష్, పురపాలక కమిషనర్ శ్రీ గౌరంగ్ రతి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఎన్.పి.సింగ్, ఐఎంస్- బీహెచ్‌యూ సంచాలకులు ప్రొఫెసర్ బి.ఆర్.మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

 

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Over 44 crore vaccine doses administered in India so far: Health ministry

Media Coverage

Over 44 crore vaccine doses administered in India so far: Health ministry
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సిఆర్పిఎఫ్ స్థాపక దినం నాడు ఆ సంస్థ సిబ్బంది కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
July 27, 2021
షేర్ చేయండి
 
Comments

సిఆర్ పిఎఫ్ స్థాపక దినం సందర్భం లో ఆ సంస్థ సిబ్బంది ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

‘‘ సాహసవంతులైన యావన్మంది @crpfindia సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు సిఆర్ పిఎఫ్ స్థాపక దినం సందర్భం లో ఇవే అభినందన లు. సిఆర్ పిఎఫ్ తన పరాక్రమాని కి, వృత్తి పరమైన నైపుణ్యానికి పెట్టింది పేరు. భారతదేశం భద్రత యంత్రాంగం లో దీనికి ఒక కీలక పాత్ర ఉంది. జాతీయ ఏకత ను పెంపొందించడం లో సిఆర్ పిఎఫ్ సిబ్బంది తోడ్పాటు ప్రపశంసించదగ్గది ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.