షేర్ చేయండి
 
Comments
కోవిడ్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధం లో ప్రజల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు గవర్నర్ లు ఒక ముఖ్యమైన స్తంభం వంటి వారు: ప్ర‌ధాన మంత్రి
ఈ పోరు లో సాముదాయిక సంస్థ ల, రాజకీయ పక్షాల, ఎన్ జిఒ ల, సామాజిక సంస్థలన్నిటి అందడండల తాలూకు ఉమ్మడి శక్తి ని వినియోగించుకోవలసిన అవసరం ఉంది: ప్ర‌ధాన మంత్రి
ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ లకు పెద్ద పీట వేయాలన్న ప్రధాన మంత్రి; ఆర్ టి పిసిఆర్ టెస్టుల ను పెంచడానికి సైతం ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని ఆయన స్పష్టంచేశారు
టీకామందులు చాలినన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకొంది: ప్ర‌ధాన మంత్రి

కోవిడ్-19 స్థితి ని గురించి, దేశం లో ప్రస్తుతం అమలుపరుస్తున్న ప్రజల కు టీకాల ను ఇప్పించే కార్యక్రమాన్ని గురించి గవర్నర్ లతో  వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై, గవర్నర్ లతో మాట్లాడారు.

కోవిడ్ కు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధం లో, టీకామందుల తో పాటు, మన విలువ లు, కర్తవ్య పాలన భావన లు మన అతి పెద్ద బలాలు గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పోరాటం లో పాలుపంచుకోవడం వారి విధి గా భావించి కిందటి సంవత్సరం లో ఈ పోరాటం లో పాలుపంచుకొన్న పౌరుల నున ఆయన ప్రశంసిస్తూ, జన్ భాగీదారీ తాలూకు అదే విధమైన భావన ను ఇప్పుడు కూడాను ప్రోత్సహించవలసివుంది అని ఆయన అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం గవర్నర్ ల పాత్ర, సమాజం లో వారికి ఉన్న పదవి ని తగిన విధం గా ఉపయోగించడం ద్వారా,  చాలా కీలకం అయిపోయింది అని ఆయన అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వాలకు, సంఘానికకి మధ్య చక్కనైన సమన్వయం ఏర్పడేటట్టు చూడటం లో గవర్నర్ లు ఒక ముఖ్యమైన లంకె అని ఆయన చెప్తూ, ఈ పోరు లో సాముదాయిక సంస్థ ల, రాజకీయ పక్షాల, ఎన్ జిఒ ల, సామాజిక సంస్థ లు అన్నిటి అందడండల తాలూకు ఉమ్మడి శక్తి ని వినియోగించుకోవాలి అని కూడా అన్నారు.

మైక్రో కంటెయిన్ మెంట్ దిశ లో రాష్ట్ర ప్రభుత్వాలతో సామాజిక సంస్థ లు నిరంతర ప్రాతిపదిక న సహకరించేటట్టు చూడటం లో గవర్నర్ లు క్రియాశీల భూమిక ను నిర్వహించవలసింది అంటూ ప్రధాన మంత్రి సూచన చేశారు.  ఆసుపత్రుల లో ఎమ్ బ్యులన్స్ ల, వెంటిలేటర్ ల,  కెపాసిటీ పెరిగేటట్టు చూడటం లోల వారి కి గల సామాజిక నెట్ వర్క్ సాయపడగలుగుతుందని ఆయన అన్నారు.   టీకాలు వేయించుకోవడాన్ని గురించిన, చికిత్స ను పొందవలసిన సందేశాన్ని వ్యాప్తి చేయడం తో పాటు, ఆయుష్ సంబంధి నివారణ మార్గాలను గురించిన చైతన్యాన్ని కూడా గవర్నర్ లు విస్తరింపచేయగలుగుతారు అని ఆయన అన్నారు.

మన యువజనులు, మన శ్రమశక్తి మన ఆర్థిక వ్యవస్థ లో ఒక ముఖ్యమైనటువంటి భాగం అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ కారణంగా, మన యువతీయువకులు కోవిడ్ కు సంబంధించిన అన్ని నియమాలను, ముందుజాగ్రత్త చర్యల ను పాటించేటట్టు చూడవలసి ఉందన్నారు.  విశ్వవిద్యాలయాల ఆవరణలలో మన విద్యార్థులను ఈ ప్రజల భాగస్వామ్యం దిశ లో మరింత అధికం గా పాలుపంచుకొనేందుకు పూచీపడటం లో గవర్నర్ ల పాత్ర సైతం కీలకం అని ఆయన అన్నారు.  విశ్వవిద్యాలయాల ఆవరణల లోను, కళాశాల ల ఆవరణల లోను గల సదుపాయాల ను ఉత్తమమైన రీతి లో వినియోగించుకోవడం పైన కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి అని ఆయన చెప్పారు.  ఎన్ సిసి కి, ఎన్ఎస్ఎస్ కుకిందటి సంవత్సరం మాదిరి గానే, ఈ సంవత్సరం లో కూడాను  ముఖ్య భూమిక ఉంది అని ఆయన సూచించారు. ఈ పోరాటం లో ప్రజల భాగస్వామ్యం తాలూకు ఒక ముఖ్య స్తంభం గా గవర్నర్ లు ఉన్నారు, మరి రాష్ట్ర ప్రభుత్వాల తో వారు నెరపవలసిన సమన్వయం, అలాగే రాష్ట్ర  సంస్థల కు వారు అందించే మార్గదర్శకత్వం జాతీయ సంకల్పాన్ని మరింతగా బలపరచగలుగుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

కోవిడ్ కేసు ల సంఖ్య లో వృద్ధి ని గురించి ప్రధాన మంత్రి  చర్చిస్తూ, వైరస్ కు వ్యతిరేకంగా జరుపుతున్న ఈ సమరం తాలూకు ప్రస్తుత దశ లో, దేశం గత సంవత్సరం నుంచి నేర్చుకొన్న అనుభవం రీత్యాను, మెరుగైన  ఆరోగ్య సంరక్షణ సామర్థ్యం పరంగాను ప్రయోజనం పొందనుంది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఆర్ టిపిసిఆర్ పరీక్షలు చేసే సామర్థ్యం లో పెరుగుదల ను గురించి ఆయన ప్రస్తావించి, పరీక్షలు జరపడానికి సంబంధించినటువంటి కిట్స్, తదితర సామగ్రి పరంగా చూసినప్పుడు దేశం ‘ఆత్మనిర్భర్’ (స్వయంసమృద్ధం) గా మారిందని తెలిపారు.  ఇది అంతా కలసి ఆర్ టిపిసిఆర్ పరీక్షల కు అయ్యే ఖర్చు లో తగ్గుదల కు దారి తీసింది అని ఆయన చెప్పారు.  పరీక్షలు జరపడానికి సంబంధించిన ఉత్పత్తులలో చాలావరకు జిఇఎమ్ [ GeM ] పోర్టల్ లో కూడా అందుబాటులో ఉన్నాయి అని ఆయన వెల్లడించారు.  ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ లను పెంచడానికి పెద్ద పీట వేయవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.  అంతకంతకు మరింత మంది కి పరీక్షలు జరిపించడం మరీ ముఖ్యం అని ఆయన చెప్పారు.  

టీకామందులు సరిపడ అందుబాటులో ఉండేందుకు పూచీ పడటానికి ప్రభుత్వం కంకణం కట్టుకొంది అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. అతి తక్కువ కాలం లోనే 10 కోట్ల టీకామందుల మైలురాయి ని చేరుకొన్న దేశం గా భారతదేశం నిలచింది అని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు.  గడచిన నాలుగు రోజులు గా సాగిన టీకా ఉత్సవ్ తాలూకు సకారాత్మక ప్రభావాన్ని గురించి ఆయన చెప్తూ, ఈ కాలం లో, టీకాలను వేయించే కార్యక్రమం విస్తరించిందని, టీకాలను ఇప్పించే కొత్త కొత్త కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయన్నారు.

ఎవరు ఏమన్నారంటే

భారతదేశ ఉప రాష్ట్రపతి, హోం శాఖ కేంద్ర మంత్రి, ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరు అయ్యారు.

కోవిడ్ కు వ్యతిరేకం గా జరుగుతున్న పోరు కు నాయకత్వం వహిస్తున్నందుకు, ఈ మహమ్మారి ని ఎదుర్కోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాల ను అభివృద్ధిపరచడం కోసం ఎంతో ముందుగానే అవసరమైన చర్యలను తీసుకొంటూ వచ్చినందుకు గాను ప్రధాన మంత్రి ని ఉప రాష్ట్రపతి అభినందించారు.  భారతదేశానికి, యావత్తు ప్రపంచానికి శాస్త్రవిజ్ఞానవేత్త ల సముదాయం ఒక టీకామందు ను అందించి తోడ్పడ్డ సంగతి ని కూడా ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు.   మహమ్మారి కాలం లో ముందు వరుసలో నిలచి ఒక ముఖ్య పాత్ర ను పోషించినటువంటి ఆరోగ్య సంరక్షణ శ్రమికులు, పారిశుద్ధ్య శ్రమికులు, ఇతర శ్రమికుల తోడ్పాటు ప్రసక్తి ని కూడా ఆయన ఈ సందర్భం లో తీసుకు వచ్చారు.

ఆయా రాష్ట్రాల లో అఖిల పక్ష సమావేశాలకు నాయకత్వం వహించడం ద్వారాను, కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని ఏయే సంరక్షణ చర్యల ను తీసుకొంటూ ఉండాలో అనే అవగాహన ను పెంపొందింపచేయడానికి పౌర సమాజం లోని సంస్థ ల సేవల ను వినియోగించుకోవడం ద్వారాను ఒక సమన్వయం కలిగినటువంటి వేదిక ను ఏర్పరచాలి అని గవర్నర్ లకు ఉప రాష్ట్రపతి పిలుపు ను ఇచ్చారు.  ఈ విషయం లో విధానాల రేఖ ల కంటే మిన్న గా ‘టీమ్ ఇండియా స్పిరిట్’ ను అనుసరించాలి, ‘రాష్ట్ర సంరక్షకులు’ గా గవర్నర్ లు రాష్ట్ర ప్రభుత్వాల కు మార్గదర్శులు కాగలుగుతారు అని ఉప రాష్ట్రపతి అన్నారు.

ప్రతి ఒక్కరిని కాపాడడానికి, ప్రతి ఒక్క ప్రాణాన్ని రక్షించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి అని హోం శాఖ కేంద్ర మంత్రి నొక్కిచెప్పారు.  కోవిడ్ కేసులను గురించి, టీకాలను ఇప్పించే కార్యక్రమం పురోగతి ని గురించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఒక నివేదిక ను సమావేశం ముందు ఉంచారు.  ఈ కృషి లో భారతదేశం ఒక సక్రియాత్మకమైనటువంటి, ముందస్తు నివారణ చర్యల తో కూడినటువంటి విధానాన్ని ఎలాగ అమలుపరచిందీ ఆయన సమగ్రంగా వివరించారు.

గవర్నర్ లు వారి వారి రాష్ట్రాలు వైరస్ వ్యాప్తి ని ఎలాగ ఎదుర్కొంటున్నదీ, టీకాలను వేయించే కార్యక్రమం సాఫీ గా అమలు చేసే దిశ లో కార్యకలాపాల ను ఎలాగ సమన్వయపరుస్తున్నదీ తెలియజేశారు.  అలాగే, రాష్ట్రాల లో ఆరోగ్యసంరక్షణ సదుపాయాల లో గల లోటుపాటుల ను గురించి కూడా వారు వివరాలను అందించారు.  

ప్రయాసల ను మరింత గా ఎలా మెరుగుపరచుకోవాలో, చురుకైనటువంటి సామాజిక కర్తవ్య పాలన లో వివిధ సమూహాల మాధ్యమాన్ని తోడు గా తీసుకువెళ్లడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్నిఎలా పెంచవచ్చో అనేటటువంటి విషయాల లో ప్రణాళికల ను గురించి వారు సూచన లు, సలహా లు ఇచ్చారు.

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
India's FDI inflow rises 62% YoY to $27.37 bn in Apr-July

Media Coverage

India's FDI inflow rises 62% YoY to $27.37 bn in Apr-July
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi holds fruitful talks with PM Yoshihide Suga of Japan
September 24, 2021
షేర్ చేయండి
 
Comments

Prime Minister Narendra Modi and PM Yoshihide Suga of Japan had a fruitful meeting in Washington DC. Both leaders held discussions on several issues including ways to give further impetus to trade and cultural ties.