ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా లోని భువనేశ్వర్ లో ఉన్న ఎస్ యు ఎమ్ ఆసుపత్రిలో 2016 అక్టోబరు 17వ తేదీనాడు జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అనుగ్రహపూర్వక ఆర్థిక సహాయాన్ని వారి బంధువులకు మంజూరు చేశారు. అలాగే, అదే అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి సైతం ఒక్కొక్కరికి రూ.50,000 వంతున మంజూరు చేశారు. ఈ ఎక్స్ గ్రేషియా రిలీఫ్ ను ప్రధాన మంత్రి జాతీయ పరిహార నిధి నుండి మంజూరు చేయడమైంది.
PM sanctions ex-gratia relief for the victims of fire accident in Bhubaneswar SUM Hospital, Odisha