షేర్ చేయండి
 
Comments
What do you think NDA Govt’s move of banning old Rs. 500 & Rs. 1000 currency notes? Take a survey & submit your views on the NM App

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రూ.500 మరియు రూ.1,000 కరెన్సీ నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న నిర్ణయంపై ఉద్దేశాలను తెలియజేయాలంటూ ప్రజలను కోరారు.

ప్రజలు వారి ఉద్దేశాలను 10 ప్రశ్నలతో కూడి ఉండే ఒక సర్వేక్షణలో పాలుపంచుకోవడం ద్వారా తెలియజేయవచ్చు. ఈ సర్వేక్షణ the Narendra Modi App పై లభ్యం అవుతోంది. ఈ సర్వేక్షణ యొక్క లింకును పంచుకోవడం ద్వారా ప్రధాన మంత్రి ఈ నిర్ణయం విషయంలో ప్రజల వద్ద నుండి మౌలిక ఉద్దేశాన్ని తాను తెలుసుకోగోరుతున్నట్లు ఈ రోజు ట్విటర్ లో తెలిపారు.

సర్వేక్షణ లోని పది ప్రశ్నలు ఈ కింది విధంగా ఉన్నాయి:

1. భారతదేశంలో నల్లధనం ఉందని మీరు భావిస్తున్నారా? ఎ. అవును బి. కాదు

2. అవినీతి మరియు నల్లధనం అనే దుష్ట శక్తులపై పోరాటం జరపవలసిన, మరియు వాటిని నాశనం చేయవలసిన అవసరం ఉందని మీరు అనుకొంటున్నారా? ఎ. అవును బి. కాదు

3. మొత్తంమీద, నల్లధనాన్ని ఎదిరించి పోరాడడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను గురించి మీరు ఏమనుకొంటున్నారు?

4. నల్లధనానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఇంతవరకు చేసిన ప్రయత్నాల విషయంలో మీరు ఏమంటారు? 1 నుండి 5 వరకు ఉన్న ఎంపికలపై స్పందించండి .. విశిష్టమైంది, చాలా మంచిది, మంచిది, సరే, నిరుపయోగకరమైనటువంటిది

5. పాత రూ.500, రూ.1000 నోట్లను నిషేధిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై మీరు ఏమనుకొంటున్నారు? ఎ. సరైన దిశగా తీసుకొన్న గొప్ప నిర్ణయం బి. మంచి నిర్ణయం సి. ఎటువంటి వ్యత్యాసాన్ని చూపదు

6. నల్లధనాన్ని, అవినీతిని మరియు ఉగ్రవాదాన్ని నిరోధించడంలో నోట్ల రద్దు తోడ్పడుతుందని మీరు భావిస్తున్నారా? ఎ. ఇది తక్షణ ప్రభావాన్ని చూపగలుగుతుంది. బి. మధ్య కాలం నుండి దీర్ఘ కాలంలో ప్రభావం ఉండగలదు. సి. కనీస ప్రభావం ఉంటుంది. డి. తెలియదు

7. నోట్ల రద్దు స్థిరాస్తి, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ లను సామాన్య మానవుడి అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది. ఎ. పూర్తిగా అంగీకరిస్తాను బి. కొంతవరకు అంగీకరిస్తాను సి. చెప్పలేను

8. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం మరియు నకిలీ కరెన్సీ తయారీలపై మన పోరాటం వల్ల మీకు కలిగే అసౌకర్యం పట్ల మీకు అభ్యంతరం ఉందా? ఎ. ఎంతమాత్రం లేదు బి. కొంతవరకు ఉంది, కానీ దాని వల్ల కొంత మేలు జరగగలదు సి. అవును

9. అవినీతి వ్యతిరేక కార్యకర్తలు ప్రస్తుతం నిజానికి నల్లధనం, అవినీతి మరియు ఉగ్రవాదాలకు మద్దతుగా పోరాడుతూ ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఎ. అవును బి. కాదు

10. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పంచుకోవాలని మీరు అనుకుంటున్న ఏవైనా సలహాలు, ఉపాయాలు లేదా అంతర్ దృష్టి వంటివి మీ వద్ద ఉన్నాయా?

రూ.500, రూ.1,000 నోట్లు చట్టబద్ధ ద్రవ్యం కావు అని ప్రకటించిన నిర్ణయానికి సంబంధించి సునిశితమైన, నేరు దృష్టికోణాలను ప్రధాన మంత్రి తెలుసుకోగోరారు. అంతే కాకుండా ఈ నిర్ణయం అమలును దృఢతరంగా ఎలా చేయవచ్చో అనేదానిపైన కూడా ఆయన ప్రజల ప్రతిస్పందనను ఆహ్వానించారు.

ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలనే ప్రధాన మంత్రి అంతరంగ విశ్వాసం సర్వేక్షణలో మరొక్కసారి వ్యక్తమైంది.

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Over 28,300 artisans and 1.49 lakh weavers registered on the GeM portal

Media Coverage

Over 28,300 artisans and 1.49 lakh weavers registered on the GeM portal
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో భేటీ అయిన కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ అల్ సౌద్
September 20, 2021
షేర్ చేయండి
 
Comments

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ అల్ సౌద్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ఉభయ దేశాల మధ్య ఏర్పాటైన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్ పిసి) ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు సహా ప్రస్తుతం అమలవుతున్న వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతి ని వీరి సమావేశం సమీక్షించింది. శక్తి, ఐటి, రక్షణ సంబంధి తయారీ వంటి కీలక రంగాలతో పాటు మరిన్ని రంగాల లో సౌదీ అరేబియా నుంచి ఇతోధిక పెట్టుబడి ని అందుకోవాలని భారతదేశం ఆసక్తి తో ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

అఫ్ గానిస్తాన్ లో స్థితి సహా ప్రాంతీయ పరిణామాల విషయం లో పరస్పర దృష్టికోణాల ను కూడా ఈ సమావేశం లో వెల్లడి చేసుకోవడం జరిగింది.

కోవిడ్-19 మహమ్మారి కాలం లో భారతీయ ప్రవాసి కుటుంబాల సంక్షేమాన్ని పట్టించుకొన్నందుకు గాను కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, తన ప్రత్యేక ధన్యవాదాలను వ్యక్తం చేశారు.

సౌదీ అరేబియా రాజు కు, సౌదీ అరేబియా యువరాజు కు ప్రధాన మంత్రి తన నమస్కారాలందజేస్తూ, ఆత్మీయ అభినందనల ను కూడా వ్యక్తం చేశారు.